మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆయనకు చికిత్స అందిస్తున్న దిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిటల్(ఆర్&ఆర్) సోమవారం వెల్లడించింది.
ఆయన డీప్ కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని రాజాజీ మార్గ్‌లో ఉన్న తన ఇంట్లో పడిపోయిన తరువాత మెదడులో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ కోసం ఆగస్టు 10న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.
ఆ శస్త్రచికిత్స తరువాత ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ కోమాలోకి వెళ్లారు.
2012-17 మధ్య దేశానికి 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ సేవలందించారు.
ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగానూ పనిచేశారు.
Read Our Exclusives:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి