24, ఆగస్టు 2020, సోమవారం

Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారా? అసలు రహస్యం ఏమిటి?

 

Kim Jong-Un కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ కోమాలోకి వెళ్లారా.. మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించిందా? అవుననే అంటోంది దక్షిణ కొరియా.

నిత్యం ఉత్తర కొరియాపై కన్నేసి ఉంచే దక్షిణ కొరియా ఒక్కటే ఉత్తరకొరియాలో ఏం జరుగుతోందనేది అంతో ఇంతో చెప్పగలుగుతుంది. అయితే.. ఒక్కోసారి దక్షిణ కొరియా నిఘా వర్గాల ముసుగులో నిజాలను తొక్కిపెట్టి అసత్యాలనూ ప్రచారం చేస్తుంది. 

అయితే, తాజాగా దక్షిణ కొరియా అధికారి ఒకరు కిమ్ కోమాలోకి వెళ్లారని చెప్పడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ వార్త పాకింది. 

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్‌కు సహాయకుడిగా పని చేసిన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ రీసెంటుగా మాట్లాడుతూ తమ దేశ నిఘావర్గాల సమాచారం ప్రకారం కిమ్ ప్రస్తుతం కోమాలో ఉన్నారని చెప్పారు. అంతేకాదు.. కిమ్ కోలుకోకపోవడంతో ఆయన స్థానంలో సోదరి కిమ్ యో జోంగ్ పాలన వ్యవహారాలు చూస్తున్నారనీ చెప్పారు.


మరోవైపు కొద్దిరోజులుగా ఈ అధికార మార్పిడిపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఉన్న కొన్ని అధికారాలను కిమ్‌ తన సోదరి కిమ్‌ యో జోంగ్కు కట్టబెట్టారని మీడియాలో కథనాలు వచ్చాయి. విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జోంగ్‌కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో చాంగ్‌ సాంగ్‌ మిన్‌ మాట్లాడుతూ.. ‘కిమ్ కోమాలో ఉన్నట్టు నేను అంచనా వేస్తున్నాను. కానీ అతను మరణించలేదు’ అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కిమ్ బయట కనిపించింది చాలా తక్కువని.. ఆయన ఆరోగ్యం క్షిణించిందని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సిద్దంగా ఉన్నారని చాంగ్ అన్నారు.


కాగా, గతంలో కూడా కిమ్‌ ఆరోగ్యంపై ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రాణాలతో పోరాడుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయనకు బ్రెయిన్‌ డెడ్‌ అయిందని పుకార్లు వచ్చాయి. కానీ కొద్దికాలం కిందట ఆయన కనిపించడంతో అవన్నీ వదంతులేనని తేలిపోయింది. మరి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా.. లేదంటే కిమ్ నిజంగానే కోమాలో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.

Read Our Exclusives:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి