కరోనా లక్షణాల్లో ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కఫం, కండరాల నొప్పి, ముక్కు కారడం, గొంతుమంట, విరేచనాలు, వాసన లేమి, రుచిని తెలుసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నాయి.
కళ్లు గులాబీ రంగులోకి మారడమూ కొవిడ్ 19 ప్రైమరీ లక్షణమేనని కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మజీ ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది.
అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వాంతులు, విరేచనాలతో పాటు ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలేనని తేల్చారు. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోగా కనిపిస్తాయని సంస్థ పేర్కొంది.
ఇప్పటివరకు మొత్తంగా 12 లక్షణాలు కొవిడ్ లిస్టులో ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 15కు చేరింది.
కొవిడ్ గురించి తెలుసుకున్న కొద్దీ.. ఈ లిస్టులో మార్పులు వస్తుంటాయని ఏజెన్సీ తెలిపింది.
ఇప్పటివరకు కరోనా బాధితుల్లో కొందరికి సింప్టమ్స్ కనిపించగా, మరికొందరికీ అసలు ఏమాత్రం సింప్టమ్స్ కనపడటం లేదని, వ్యక్తికి వ్యక్తికి మధ్య కరోనా వ్యాధి లక్షణాల్లో మార్పు ఉందని సీడీసీ వెల్లడించింది.
హార్ట్, లంగ్ డిసీజ్, డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్న వారికి కరోనా రిస్క్ ఎక్కువని కూడా ప్రకటించింది.