* ప్రణబ్ ముఖర్జీకి హిందీ రాకపోవడం వల్లే ప్రధాన మంత్రి పదవి ఇవ్వలేదా
ప్రణబ్ ముఖర్జీ.. నిజంగానే మేన్ ఆఫ్ ఆల్ సీజన్స్. భారతదేశంలోని అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా ఆయన పనిచేశారు. కానీ, అత్యంత శక్తిమంతమైన, ఆకర్షణీయమైన పదవైన ప్రధానమంత్రి పదవి మాత్రం ఆయన్ను వరించలేదు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన పార్టీలో ఉండి ఆర్థిక మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి వంటి కీలక పదవులు చేపట్టిన ఆయన ప్రధాన మంత్రి మాత్రం కాలేకపోయారు.
కుటుంబ పార్టీ అయిన కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబేతరులు ప్రధాన మంత్రి కావడం అసాధ్యమే అయినా రాజీవ్ గాంధీ మరణానంతరం సోనియా గాంధీ ప్రధాని పదవి చేపట్టకపోవడంతో ప్రణబ్‌కు అవకాశం వచ్చినట్లే వచ్చి ఉసూరనిపించింది.
ప్రధాని పదవి వద్దని త్యాగం చేసినా ప్రధానిని నిర్ణయించే శక్తి తానే అయిన సోనియా ఆ అవకాశాన్ని నోరు లేని మన్మోహన్ సింగ్‌కు ఇచ్చి రాజకీయ చాణక్యుడైన ప్రణబ్‌కు మొండిచేయి చూపించింది.
మన్మోహన్ సింగ్ అయితే చెప్పినట్లు వింటూ చెప్పుచేతల్లో ఉంటారన్న కారణం ఒకటి కాగా ప్రణబ్ రాజకీయ చతురత, పరపతి వల్ల తమ మాట వినకపోవచ్చన్న జ్ఞానం, ప్రధానిగా అధికారం దక్కితే పార్టీనే చేతుల్లోకి తీసుకుంటారన్న భయంతో సోనియా అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు.
అలా ప్రధాని రేసు నుంచి తప్పించారు
అయితే.. కాంగ్రెస్‌లో నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని కాదని అవకాశం రావడమే అరుదు.. అలాంటి అవకాశం వచ్చినట్లే వచ్చి పోవడంతో ఆయనలో ఆ అసంతృప్తి ఉండేది. అయితే.. సోనియా కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ప్రణబ్ వంటి సీనియర్ల నుంచి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆయన్ను తరువాత కాలంలో రాష్ట్రపతిని చేశారు. దాంతో ప్రధాని రేసు నుంచి ఆయన్ను పూర్తిగా తప్పించింది కాంగ్రెస్ పార్టీ.
అయితే, రాష్ట్రపతి అయిన ప్రణబ్‌లో మాత్రం ప్రధాని కోరిక మాత్రం పోలేదు. తనకెందుకు ప్రధాని పదవి రాలేదనే విషయంలో ఆయన పార్టీని ఎన్నడూ బహిరంగంగా తప్పు పట్టకపోయినప్పటికీ ఇతరత్రా కారణాలు చెప్పేవారు.
అందులో ప్రధానమైనది భాషా సమస్య. అవును.. తనకు హిందీ రాకపోవడం వల్లే ప్రధానిని కాలేకపోయానని ప్రణబ్ ఓ సందర్భంలో చెప్పారు.
2017 అక్టోబరులో ప్రణబ్ తాను రాసిన ‘ది కొయిలేషన్ యియర్స్ 1996-2012’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఈ మాట చెప్పారు.
ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రధానిగా తన కంటే ప్రణబ్ అన్ని అర్హతలు ఉన్న వ్యక్తని అన్నారు.
తాను సుదీర్ఘ కాలం రాజ్యసభలోనే ఉండడం వల్ల.. అలాగే హిందీ రాకపోవడం వల్ల తనకు అవకాశం రాకపోయి ఉండొచ్చన్నారు.
అసంతృప్తి లేదు కానీ అసలు కారణం అదీ
అలాగే ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన ఇదే చెప్పారు. తనకు కాకుండా మన్మోహన్ సింగ్‌కు ప్రధాని పదవి ఇచ్చారన్న అసంతృప్తి తనకేమీ లేదని.. తనకు ఆ అర్హత లేదని తాను భావిస్తానని అన్నారు.
ఒక్క 2004లో లోక్ సభకు ఎంపిక కావడం తప్ప తన మిగతా పార్లమెంటు కెరీర్ అంతా రాజ్యసభలో సాగడం.. హిందీ రాకపోవడం తన అనర్హతలని అభిప్రాయపడ్డారు.
‘‘హిందీ రాకుండా ఈ దేశంలో ఎవరూ ప్రధాని కాలేరు. కామరాజ్ నాడార్ కూడా ఒక సందర్భంలో ‘నో హిందీ, నో ప్రైమ్ మినిష్టర్‌షిప్’ అని అన్నార’’ని ప్రణబ్ చెప్పారు.
Read Our Exclusives:
- కరోనా వైరస్ వచ్చినా సింపుల్‌గా తగ్గిపోవాలంటే ఏం చేయాలి
- బాజీ రౌత్ : స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అత్యంత పిన్న వయస్కుడు
- Shakuntala Devi : హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి మెదక్ నుంచి పోటీచేశారు తెలుసా
- ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది
- కరోనా వైరస్ 15 లక్షణాలు ఇవే
- చైనా పొగరు అణచాలంటే ఇండియన్ నేవీతోనే సాధ్యం.. అదెల...
- స్ట్రాబెర్రీ మూన్ Strawberry moon అసలేంటీ స్ట్రాబె...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి