కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఆరోగ్య సేతు Aarogya Setu యాప్ ప్రారంభించిన 13 రోజుల్లోనే విశేష ఆదరణ పొందింది. ఏకంగా 5 కోట్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు.
దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం దీన్నిఅందుబాటులోకి తెచ్చారు. ఏప్రిల్ 2న దీన్ని విడుదల చేయగా పెద్దసంఖ్యలో ప్రజలు ఆ రోజునే డౌన్‌లోడ్ చేసుకున్నారు.
మొదటి మూడు రోజుల్లోనే 50,00,000 మంది ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 14న ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించినప్పుడు ఈ యాప్ అందరూ వాడాలని చెప్పడంతో ఒక్కసారిగా డౌన్‌లోడ్స్ పెరిగాయి.
ఏప్రిల్ 2 నుంచి 14 తేదీల మధ్య 4 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకోగా ఏప్రిల్ 14 నుంచి 15వ తేదీ మధ్య 24 గంటల్లో ఏకంగా కోటి మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.
Aarogya Setu యాప్‌ను ఎవరు తయారుచేశారు?
ఆరోగ్య సేతు (Aarogya Setu) మొబైల్ యాప్‌ని కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ రూపొందించింది.Aarogya Setu యాప్ ఉపయోగం ఏమిటి?
ఎవరిలోనైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా, అసలు అవి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.Aarogya Setu ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది?
ఇంగ్లిష్, తెలుగు, హిందీతో పాటు మొత్తం 10 భారతీయ భాషల్లో ఈ యాప్ లభిస్తోంది.Aarogya Setu యాప్‌తో ఏం తెలుసుకోవచ్చు?
ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉంటే, వారితో అంతవరకు కరోనా లక్షణాలు లేనివారు కూడా ఎవరైనా మెలగడం వల్ల వారికీ సోకితే... ఈ యాప్ ద్వారా... ఇంకా ఎంత మందికి ఆ వైరస్ సోకే అవకాశం ఉందో తెలుసుకోవచ్చు.మీరు ఎవరెవరిని కలిశారో, ఏయే ప్రాంతాలకు వెళ్లారో ఈ యాప్ సూచిస్తుంది. తద్వారా ఇంకా ఎవరెవరికి కరోనా సోకే అవకాశం ఉంటుందో గుర్తించడం తేలికవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి