26, జూన్ 2020, శుక్రవారం

Che Guevara : చే గువేరా ఇల్లు అమ్మకానికి పెట్టారు

che guevara చే గువేరా చే గెవేరా


Che Guevara  చే గెవేరా చే గువేరా
చే గెవేరా.. ప్రపంచానికి రివల్యూషనరీ ఐకాన్.
అర్జెంటీనాలోని రొసారియోలో ఆయన పుట్టిన ఇంటిని అమ్మకానికి పెట్టారు. 2,580 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇంటిని 2000లో కొన్నానని ప్రస్తుతం ఆ ఇంటి యజమాని అయిన ఫ్రాన్సిస్కో ఫరుగ్గియా చెబుతున్నారు.
నిజానికి ఫరుగ్గియా ఆ ఇంటిని ఒక కల్చరల్ సెంటర్‌గా మార్చాలని ట్రై చేశారట.. కానీ, తన వల్ల కాలేదని.. అందుకే అమ్మేస్తున్నానని చెప్పారు.

ఏటా లక్షలాది మంది పర్యాటకులు

రొసారియాలో ఉన్న ఈ ఇంటిని సందర్శించడానికి ప్రపంచ దేశాల నుంచి ఏటా లక్షలాది మంది వస్తుంటారు.

ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్‌ పీపే ముజికా, క్యూబా మాజీ అధినేత ఫీడెల్ క్యాస్ట్రో సంతానం, 1950లలో మోటార్‌సైకిల్‌పై చే గువేరాతో పాటు దక్షిణ అమెరికావ్యాప్తంగా వేల కిలోమీటర్లు ప్రయాణించిన డాక్టర్‌ ఆల్బర్టో గ్రానడోస్‌ కూడా అనంతర కాలంలో ఈ ఇంటిని సందర్శించారు.

చే గెవేరా నేపథ్యం

1928లో ఓ ధనిక-మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన చే గెవేరా, దక్షిణ అమెరికాలో పేదరికం, ఆకలిని చూసి విప్లవకారుడిగా మారారు. 1953-59 మధ్య సాగిన క్యూబా విప్లవంలో నియంత బటిస్టాను పదవి నుంచి పడదోయడంలో కీలకపాత్ర పోషించారు చే గెవేరా.
క్యూబా విప్లవం ముగిసిన తర్వాత ఆయన బొలీవియాలో ఉద్యమానికి నాయకత్వం వహించారు. అప్పటి ఆ దేశ అధ్యక్షుడు రెనీ బారియంటోస్‌ ఒర్డునోను గద్దె దించాలని ఆయన విప్లవించారు.
Che Guevara చే గువేరా మృతదేహం


అమెరికా సైన్యం సహకారంతో బొలీవియా సేనలు చే గెవేరాను, ఆయన సహచరులను బందీలుగా పట్టుకున్నాయి. 1967 అక్టోబర్‌ 9న లా హిగేరా అనే గ్రామంలో బొలీవియా దళాలు ఆయనను కాల్చి చంపాయి. ఆ తర్వాత ఆయన శరీరాన్ని గుర్తు తెలియని ప్రదేశంలో ఖననం చేశాయి.

1997లో ఆయన అస్థికలు బైటపడటంతో వాటిని క్యూబాకు తరలించి అక్కడ తిరిగి ఖననం చేశారు. 
Read Also

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి