సూర్యగ్రహణం : జూన్ 21, 2020న ఏర్పడుతున్న సూర్యగ్రహణం భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుని చుట్టూ వలయాకారంలో కనిపిస్తుంది. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ లేదా అగ్ని వలయం లేదా జ్వాలావలయం అంటున్నారు.
కానీ, దేశంలోనే అత్యధిక ప్రాంతాల్లో మాత్రం ఈ సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించనుండడంతో ఆయా ప్రాంతాల్లో ఈ జ్వాలా వలయాన్ని చూడలేరు.
సూర్యగ్రహణం సరిగ్గా ఎన్ని గంటలకు కనిపిస్తుంది
దేశంలో సూర్యగ్రహణం ఎన్ని గంటలకు కనిపిస్తుందనే విషయంలో భిన్న సమయాలను చెబుతున్నారు. కోల్‌కతాలోని బిర్లా ప్లానిటోరియం చెబుతున్న ప్రకారం అయితే... సూర్య గ్రహణం మొదట రాజస్థాన్ రాష్ట్రంలోని ఘర్సాణా దగ్గర ఉదయం 10.12 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది. అది 11.49 నిమిషాలకు వలయాకారంలో కనిపించడం మొదలవుతుంది. తర్వాత 11.50కి ముగుస్తుంది.
రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది?
రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలోని సిర్సా, రతియా, కురుక్షేత్ర, ఉత్తరాఖండ్‌లోని దెహ్రాడూన్, చంబా, చమేలీ, జోషీమఠ్ ప్రాంతాల్లో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఒక నిమిషం పాటు కనిపిస్తుంది.
2019 డిసెంబర్ 26న సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు కూడా రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించింది. కానీ, ఈసారి అప్పటిలా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంత స్పష్టంగా కనిపించదు.
రింగ్ ఆఫ్ ఫైర్ సోలార్ ఎక్లిప్ల్ అసలు ఎలా ఏర్పడుతుంది
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో ఉన్నప్పుడే వలయాకార సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఏర్పడుతుంది. కొంత సమయం పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా చీకటి కమ్మేస్తుంది.
ఆ సమయంలో సూర్యుడు జ్వాలావలయంలా కనిపిస్తాడు కాబట్టే ఆదివారం సూర్య గ్రహణం ప్రత్యేకం కాబోతోంది.
హైదరాబాద్‌లో ఎన్ని గంటలకు కనిపిస్తుంది?
హైదరాబాద్‌లో పాక్షిక సూర్యగ్రహణం ఉదయం 10.14కు మొదలై, మధ్యాహ్నం 1.44కు ముగుస్తుంది.
దిల్లీలో ఉదయం 10.20కి ప్రారంభమయ్యే సూర్య గ్రహణం 1.48కి ముగుస్తుంది.
ముంబయిలో అది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.27 వరకూ, చెన్నైలో ఉదయం 10.22 నుంచి మధ్యాహ్నం 1.41 వరకూ, బెంగళూరులో 10.13 నుంచి 1.31 వరకూ, కోల్‌కతాలో పాక్షిక సూర్యగ్రహణం ఉదయం 10.46కు ప్రారంభమై, 2.17కు ముగుస్తుంది.
ప్రపంచంలో మొట్ట మొదట ఎక్కడ కనిపిస్తుంది?
ప్రపంచంలో మొట్టమొదట ఆఫ్రికా ఖండంలోని కాంగో ప్రజలకు ఈ వలయాకార సూర్య గ్రహణం కనిపిస్తుంది.
ఇండియాలో మొట్టమొదట రాజస్థాన్‌లో కనిపించడానికి కంటే ముందు సౌత్ సూడాన్, ఇథియోపియా, యెమెన్, ఒమన్, సౌదీ అరేబియా, హిందూ మహాసముద్రం, పాకిస్తాన్‌లో కనిపిస్తుంది.
భారత్ తర్వాత టిబెట్, చైనా, తైవాన్ ప్రజలు దీన్ని చూడగలరు.
పసిఫిక్ మహాసముద్రం మధ్యకు చేరుకోగానే అది ముగుస్తుంది.
ప్రజల్లో అనేక భయాలు
యుగాంతం లేదా భయంకర అల్లకల్లోలానికి గ్రహణం ఒక హెచ్చరిక అని, అది ప్రమాదానికి సంకేతం అని ప్రపంచంలో చాలా మంది భావిస్తారు.
అమృతం కోసం ‘క్షీరసాగర మథనం’ జరిగిన తర్వాత రాహు-కేతు అనే రాక్షసులే ఈ గ్రహణాలకు కారణమయ్యారని పురాణాలు చెబుతాయి.
గ్రహణం ఎందుకు ఏర్పడుతుందో మనకు వైజ్ఞానిక కారణాలు తెలుసినప్పటికీ, మనలో చాలా మంది ఇప్పటికీ గ్రహణానికి సంబంధించిన కథలు, విశ్వాసాలు నమ్ముతుంటారు.
ప్రస్తుతం కూడా కరోనాకు, గ్రహణానికి ముడిపెడుతూ అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి.
Read Also:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి