27, జూన్ 2020, శనివారం

చైనా పొగరు అణచాలంటే ఇండియన్ నేవీతోనే సాధ్యం.. అదెలాగో తెలుసా?

ఇండియన్ నేవీ Indian navy


చైనా గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులను పొట్టనపెట్టుకోవడం, అందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా అమరుడు కావడం తెలిసిందే. 
ఆ తరువాత కమాండర్ల స్థాయలో చర్చలు జరిగినా, ఉద్రిక్తతలు చల్లార్చడానికి రెండు దేశాల సైన్యాల మధ్య అంగీకారం కుదిరినా చైనా మాత్రం ఏదో నాటకం ఆడుతుందన్న వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. 
చైనా కనుక దారికి రాకుంటే తాను భారత్ తరఫున ఉంటానని అమెరికా కూడా ప్రకటించింది.
అయితే.. భారతే స్వయంగా చైనాకు చెక్ పెట్టాలంటే అందుకు మార్గం ఉందని.. గాల్వన్, ఇతర భూ సరిహద్దుల్లో చైనాకు చెక్ పెట్టాలంటే అందుకు ఇండియన్ నేవీని ఉపయోగించుకోవాలని రక్షణ నిపుణుల నుంచి సూచనలు వినిపిస్తున్నాయి. 
భూసరిహద్దుల్లో చైనా రెచ్చిపోతుంటే నేవీ ఏం చేస్తుందన్న అనుమానాలు కలగొచ్చు.. అందుకు సమాధానమే ఈ వ్యాసం.

చైనాను కంట్రోల్ చేయడానికి ఇండియన్ నేవీ ఎలా ఉపయోగపడుతుందంటే..

* చైనా నౌకా రవాణాపై తనిఖీ పెంచాలి. గతంలో మాదిరిగా అంత సులభంగా వాటిని వదిలేయకుండా తనిఖీల పేరుతో ఒత్తిడి పెంచాలి.
* హిందూ మహాసముద్రం మీదుగా వచ్చే చైనా నౌకలకు అనుమతుల విషయంలో ఏ చిన్న కారణం దొరికినా అభ్యంతరాలు పెట్టి అడ్డగించాలి.
* చైనా నౌకలు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడానికి ముందే  పశ్చిమ పసిఫిక్ మహా సముద్రంలో భారత ప్రాబల్యం పెంచాలి.
* సౌత్ చైనా సీ(దక్షిణ చైనా సముద్రం) విషయంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న తటస్థ వైఖరిని వదిలి చైనా వ్యతిరేక స్టాండ్ తీసుకోవాలి.
* చైనాతో కలహాలున్న జపాన్, ఇండోనేసియా, వియత్నాం, ఆస్ట్రేలియాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకుని చైనాపై ఒత్తిడి పెంచాలి.

చైనా రవాణా కోసం ఎక్కువగా హిందూ మహా సముద్రంపైనే ఆధారపడుతుంది. అందుకే అక్కడ మనం బిగిస్తే చైనా ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇండియా ఏమీ మనల్ని ఊరికే వదిలిపెట్టదన్న సంగతి చైనాకు అర్థమవుతుంది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి