సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అంకిత లోఖండే, కృతి సనన్, రియా చక్రవర్తి, మహేశ్ శెట్టి, నవీన్ పోలిశెట్టి
.....................
ధోనీ సినిమాలో హీరోగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం దేశాన్ని షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఆయనకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయా... లవ్ బ్రేకప్ అయిందా? కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలేమిటి? చనిపోవడానికి ముందు ఏం జరిగింది... ఏమైనా గొడవ జరిగిందా..? చనిపోవడానికి ముందు ఎవరితో మాట్లాడారు? ఆయనది నిజంగా ఆత్మహత్యేనా? లేదంటే హత్యా వంటి ప్రశ్నలు గూగుల్‌ను ముంచెత్తుతున్నాయి.
వీటన్నిటికీ సమాధానమే ఈ కథనం.
సుశాంత్‌ది ఆత్మహత్య కాదు హత్య అని ఆయన మేనమామ, కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ముంబయి పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక ఆధారాలను బట్టి సుశాంత్‌ది ఆత్మహత్యే అంటున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.
ముంబయి బాంద్రా ప్రాంతంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో సుశాంత్ సింగ్ మృతదేహం లభించింది.
ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. కానీ, ఎంతో మంది అభిమానులు, పేరు ప్రఖ్యాతలు ఉన్న యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? అన్న ప్రశ్నకు మాత్రం ఇంకా సమాధానాలు దొరకలేదు.
సుశాంత్ ఆరు నెలలుగా డిప్రెషన్‌తో పోరాడుతున్నారని తెలుస్తోంది.
సొంత ఇల్లున్నా అద్దె ఇంటికి
ముంబయిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సొంతంగా ఒక ఇల్లు కొనుక్కున్నారు. అయితే, విశాలమైన ఇంట్లో ఉండాలని భావించిన ఆయన ఎనిమిది నెలల కిందటే ఈ అద్దె ఇంటికి వచ్చారు.
ఇంట్లో ఎవరెవరు ఉంటారు?
ఈ అద్దె ఇంట్లో ఆయన ఒక్కరే నివసించట్లేదు. ఆయన క్రియేటివ్ మేనేజర్, ఒక ఫ్రెండ్, పనిమనిషి కూడా ఉంటున్నారు.
సుశాంత్ సింగ్ పనిమనిషి అసలేం జరిగిందో చెప్పారు.
చనిపోయిన రోజు ఉదయం 6.30 గంటలకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిద్రలేచారని చెప్పారు. తాను 9 గంటలకు దానిమ్మ గింజల రసం ఆయనకు ఇవ్వగా తాగారని చెప్పారు.
దానిమ్మ జ్యూస్ తాగిన తరువాత సుశాంత్ సింగ్ తన సోదరితో ఫోన్లో మాట్లాడారని.. ఆ వెంటనే ఫ్రెండ్ మహేశ్ శెట్టితో కూడా ఫోన్లో మాట్లాడారని చెప్పారు.
సుశాంత్ ఫోన్ నుంచి వెళ్లిన చివరి కాల్ మహేశ్ శెట్టికే.
మహేశ్ శెట్టి ఎవరు?
మహేశ్ శెట్టితో పాటుగానే సుశాంత్ తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి ఏక్తా కపూర్ సీరియల్ 'కిస్ దేశ్ మే హోగా మేరా దిల్'లో నటించారు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.
మహేశ్ శెట్టితో మాట్లాడాక ఏమైంది?
మహేశ్ శెట్టితో మాట్లాడిన తరువాత సుశాంత్ సింగ్ తన గదిలోకి వెళ్లి లోపల నుంచి తలుపుకు గడియపెట్టుకున్నారు.
10 గంటలకు టిఫిన్ చేస్తారని పనిమనిషి ఆయన్ను గది బయటి నుంచి పిలిచారు. కానీ, సుశాంత్ సింగ్ తలుపు తెరవలేదు.
రెండు, మూడు గంటల తర్వాత కూడా సుశాంత్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో సుశాంత్ సోదరికి మేనేజర్ కాల్ చేశారు.
ఆమె సుశాంత్ ఇంటికి వచ్చారు. ఆ తర్వాత తాళాలు తయారు చేసే వ్యక్తిని పిలిచి గది తలుపు తెరిచారు.
అక్కడ సుశాంత్ శవం వేలాడుతుండడం చూసి కూలబడిపోయారు.
పోలీసులేంటున్నారు..
పోలీసుల కథనం ప్రకారం సుశాంత్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య చనిపోయారు. ఉరి తాడుకు సుశాంత్ సింగ్ వేలాడుతుండటాన్ని అతని సోదరి సహా అక్కడున్నవాళ్లు అందరూ చూశారు.
తమకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమాచారం అందిందని, 2.30 గంటలకు తాము సుశాంత్ సింగ్ ఇంటికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు.
సుశాంత్ సింగ్ ఇంటిలో సూసైడ్ నోట్ వంటిదేమీ లభించలేదని పోలీసులు తెలిపారు.
లవ్.. బ్రేకప్
సుశాంత్ తనతో పాటు టీవీ సీరియళ్లలో నటించిన అంకిత లోఖండేను ప్రేమించారు. ఇద్దరూ చాలాకాలం కలిసి జీవించారు.
2016లో ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత అంకిత విక్కీ జైన్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు.
కృతి సనన్, రియా చక్రవర్తితో..
ఆ తరువాత సుశాంత్ కొంతకాలం కృతి సనన్‌తో డేటింగ్ చేశారు.
ప్రస్తుతం నటి రియా చక్రవర్తితో రిలేషన్లో ఉన్నారన్న రూమర్లున్నాయి.
ఆమె మరణం తరువాత..
కొద్దిరోజుల కిందట సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలైన్ ఒక భవనం 14వ అంతస్తు నుంచి పడి మరణించారు.
అప్పటికి ఆమె తాగి ఉన్నారని.. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని భిన్న కథనాలున్నాయి.
అది జరిగిన కొద్దిరోజులకే సుశాంత్ ఇలా బలవన్మరణం పాలయ్యారు.
అదర్ స్టోరీస్:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి