జగన్‌ను బీజేపీ ముద్దు చేస్తోందన్న భావన ఏపీకి చెందిన రాజకీయవర్గాలలో చాలాకాలంగా ఉంది. అయితే.. అప్పుడప్పుడు అలా అనిపించినా కేంద్రం ఆయన్ను ఎంటర్‌టెయిన్ చేసింది మాత్రం లేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి.
ఏపీ బీజేపీలోనే కొంతమంది నాయకులు జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో వ్యవహరిస్తున్నారని చెబుతుంటారు.
అయితే, కేంద్రంలోని పెద్దలను కలిసినప్పుడంతా తన కేసులను ఎత్తివేయించేందుకు ఆయన చేసే ప్రయత్నాలంటే వారికి మా చెడ్డ చిరాకని మాత్రం కేంద్రంలోని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తుంటుంది.
కానీ.. జగన్‌ను ఇబ్బంది పెట్టేలా, ఇరుకునపెట్టేలా ఏపీ బీజేపీ భారీ స్థాయిలో ఏమీ చేయయకపోవడంతో ఆయన్ను ఎంటర్‌టెయిన్ చేస్తున్నారన్న విమర్శలు మాత్రం వినిపిస్తుంటాయి.
కానీ, అది నిజం కాదని.. జగన్‌ను విమర్శించడంలో బీజేపీ ఏమాత్రం వెనక్కు తగ్గదని ఆ పార్టీ నేషనల్ సెక్రటరీ రాంమాధవ్ తాజాగా నిరూపించారు.
ఏపీలోని విపక్షం ఆరోపిస్తున్నట్లుగానే రాంమాధవ్ కూడా జగన్‌పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ రోజురోజుకీ వెనక్కు వెళ్తోందని ఆయన అన్నారు.
మోదీ నాయకత్వంలో దేశం ముందుకు దూసుకెళ్తుంటే ఏపీ మాత్రం జగన్ నాయకత్వంలో వెనక్కు పరుగెడుతోందని రామ్ మాధవ్ అన్నారు.
అంతేకాదు... బెయిలు మీద ఉన్న వ్యక్తి ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తున్నాడని... పైగా ఆ పాలన రివర్స్ పాలన అని ఆయన అన్నారు.
హైదరాబాదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫుల్ స్పీడ్‌తో రివర్స్ గేర్
రామ్ మాధవ్ జగన్ పాలనపై ఈ విమర్శలను ఏదో యథాలాపంగా చేయలేదు. చాలా డీటెయిల్డ్‌గా అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ స్పష్టంగా ఏకిపడేశారు.
ఏపీ రాజధానిలో మొదలైన జగన్ రివర్స్ పాలన ఫుల్ స్పీడుతో వెనక్కు వెళ్తోందన్నారు.
రాజధాని రివర్సు, పోలవరం రివర్సు, మద్యపాన నిషేధం రివర్సు... అన్నీ రివర్సే అంటూ రామ్ మాధవ్ మండిపడ్డారు.
తిరుమల భూములు అమ్మేయడానికీ జగన్ రెడీ అయ్యాడని.. కానీ, ప్రజలు తిరగబడడంతో జగన్ వెనక్కు తగ్గాడని అన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గత ఏడాది కాలంలో వారానికోసారి కోర్టుతో మొట్టికాయలు తింటున్నారని... అలాంటి రికార్డు భారత దేశ చరిత్రలో ఇంకే ముఖ్యమంత్రికీ లేదని అన్నారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది
జగన్ పుణ్యమా అని ఏపీ పేద రాష్ట్రంగా మారుతోందని.. రోజురోజుకీ ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందన్నారు.
పన్నులు వసూలు కాకపోయినా కేంద్రం రెండు విడతల్లో ఏపీకి 10 వేలకోట్లు ఇచ్చిందని రాంమాధవ్ గుర్తు చేశారు.
అయితే.. కొద్దిరోజుల కిందటే రాంమాధవ్ జగన్‌కు సానుకూలంగా మాట్లాడారు.
కానీ, ఇంతలోనే ఆయన ఈ రేంజ్‌లో విరుచుకుపడడడంతో కేంద్రం నుంచి ఏదో క్లియర్ డైరెక్షన్ వచ్చినట్లుందన్న మాట వినిపిస్తోంది.
అంతేకాదు.. ఇంతవరకు హైకోర్టులో వరుస దెబ్బలు తింటూ వస్తున్న జగన్.. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ చివాట్లు తినడంతో అలాంటి సీఎంను వెనకేసుకొస్తే ఇబ్బందేనని గుర్తించి బీజేపీ స్టాండ్ మార్చుకుంటోందని అంటున్నారు.
అంతేకాదు.. ఇటీవల బీజేపీ నిర్వహించిన సర్వేలోనూ జగన్ గ్రాఫ్ భారీగా పడిపోయినట్లు తేలడంతో ఏపీపై ఫోకస్ పెట్టడానికి టైమొచ్చిందని మోదీ-షా డిసైడ్ చేశారని.. ఆ ఫలితమే రాంమాధవ్ వ్యాఖ్యలని.. ఇక బీజేపీ నుంచి జగన్‌పై దాడి మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.
మా ఇతర కథనాలనూ చదవండి:
- Super Flower Moon 2020: సూపర్ ఫ్లవర్ మూన్ అంటే ఏమిటి? మే 7న ఎన్ని గంటలకు కనిపిస్తుంది.. ఫుల్ డీటెయిల్స్ చదవండి
- బాలకృష్ణ 60వ పుట్టిన రోజు.. 60 స్పెషల్ థింగ్స్.. బాలయ్యకు నచ్చిన చిరంజీవి సినిమా ఏంటి?
- Aarogy Setu ఆరోగ్య సేతు యాప్ ఎలా పనిచేస్తుంది? ఎవరు తయారుచేశారు? ఎన్ని భాషల్లో ఉంది?
- ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది
- కరోనా వైరస్: లాక్‌డౌన్ ఉన్నా ఇవన్నీ చేయొచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి