20, జూన్ 2020, శనివారం

సూర్య గ్రహణం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ని గంటలకు మొదలై ఎన్ని గంటలకు ముగుస్తుంది.. ఈ గ్రహణం ప్రత్యేకతలేమిటి?

సూర్య గ్రహణం

సూర్యగ్రహణం.. జ్వాలవలయ సూర్యగ్రహణం.. ఈ దశాబ్దంలోనే మొట్టమొదటిసారిగా కంటికి కనిపించే జ్వాలావలయ సూర్యగ్రహణం ఆదివారం(21.06.2020) ఏర్పడుతోంది. 
దేశంలో కొన్నిచోట్ల దాదాపు సంపూర్ణ సూర్యగ్రహణంలా ఇది కనిపిస్తుంది కానీ మిగతా చోట్ల అర్ధాధిక సూర్యగ్రహణంగా ఉంటుంది. అంటే పాక్షికమే అయినప్పటికీ సగం కంటే ఎక్కువ గ్రహణం పడుతుందన్నమాట.
ప్రపంచవ్యాప్తంగా ఇది మొదలై, ముగిసే సమయాలు చూసుకుంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 9.16 గంట‌ల‌ నుండి మధ్యాహ్నం 3.04 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది.
భార‌త్‌లో ద్వారక గుజరాత్ రాష్ట్రంలో మొదట గ్రహణం చూస్తార‌ు.
తెలంగాణలో ఉద‌యం 10.15 గంటల నుండి మ‌ధ్యాహ్నం 1.44 గంటల  వరకు ఉంటుంది. తెలంగాణలో 51 శాతం గ్రహణం పడుతుంది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద‌యం 10.21 గంటల నుండి మ‌ధ్యాహ్నం 1.49 గంటల వరకు ఉంటుంది. ఏపీలో 46 శాతం గ్రహణం క‌నిపిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి