భారత్, చైనా మధ్య యుద్ధం వస్తే ఎవరిది పైచేయి అవుతుంది? ఇండియాలో ఉంటూ
చైనాను సమర్థించేవారు.. అలాగే ఆల్రెడీ వాడుతున్న తమ చైనా ఫోన్లను, టీవీలను, ఇతర చైనా ఉత్పత్తులను
నేలకేసి కొట్టిమరీ చైనాపై కసి తీర్చుకుంటున్నవారూ ఉంటున్నారు.
సాధారణ జనంలోని ఆగ్రహావేశాలు, ఇష్టాయిష్టాలను
పక్కనపెడితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎవరు గెలిచే
అవకాశం ఉంటుందన్నది పరిశీలిద్దాం.
దీనికి ప్రధానంగా రెండు రెండు దేశాల ఆయుధ సామర్థ్యం ఎంత? ఆర్థిక సామర్థ్యం ఎంత? యుద్ధం ఎలా జరుగుతుంది.. ప్రపంచ దేశాల్లో ఏఏ దేశాలు భారత్ పక్షం వహిస్తాయి.. ఏవి చైనా పక్షం వహిస్తాయి? ఎన్నాళ్లు ఈ యుద్ధం సాగుతుంది వంటి ఎన్నో అంశాలు గెలుపోటములను నిర్దేశిస్తాయి. ఇందులో కొంత స్పష్టమైన వాస్తవాలు ఆధారంగా అంచనా వేయగలిగేవి కాగా మరికొన్ని హైపోథీసిస్ ఆధారంగా అంచనా వేయాల్సినవి.
మొదట భారత్, చైనాల మిలటరీ కెపాసిటీని పోల్చి చూద్దాం.
అంతర్జాతీయ సంస్థల లెక్కల ప్రకారం చూస్తే ప్రపంచంలో సైనిక సామర్థ్యం
ర్యాంకుల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంటే చైనా మూడో స్థానంలో ఉంది. అమెరికా, రష్యాలు ఒకటి, రెండు స్థానాల్లో
ఉన్నాయి.
అయితే.. గ్లోబల్ మిలటరీ పవర్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే భారత్
మంచి స్థానంలోనే ఉంది. గ్లోబల్ మిలటరీ పవర్ ఇండెక్స్ 0(జీరో)గా ఉంటే ఆ దేశం పూర్తిగా
శత్రు దుర్భేద్యం అని చెప్పుకోవచ్చు. కానీ, ప్రపంచంలో అంత శత్రుదుర్భేద్యమైన
దేశం ఏదీ లేదు. గ్లోబల్ పవర్ ఇండెక్స్‌లో 0.0606 పాయింట్లలో అమెరికా అత్యంత పవర్ ఫుల్
పొజిషన్లో ఉండగా 0.0681 పాయింట్లతో రష్యా ఉంది. మూడో స్థానంలో ఉన్న చైనా 0.0691 పాయింట్లతో
దాదాపు రష్యా స్థాయిలో ఉంది. ఇక భారత్ 0.0953 పాయింట్లతో సురక్షిత స్థానంలోనే ఉంది.
0.1 కంటే తక్కువ పాయింట్లతో బలమైన పొజిషనన్లో ఉన్నవి ఈ నాలుగు
దేశాలే. ప్రపంచంలోని మరే ఇతర దేశమూ ఈ నాలుగు దేశాల దరిదాపుల్లో కూడా లేదు.
గ్లోబల్ మిలటరీ పవర్ ఇండెక్స్‌లో టాప్ టెన్ కంట్రీస్
1) అమెరికా (0.0606 పాయింట్లు)
2) రష్యా(0.0681)
3) చైనా(0.0691)
4) భారత్(0.0953)
5) జపాన్(0.1501)
6) దక్షిణ కొరియా(0.1509)
7) ఫ్రాన్స్(0.1702)
8) యునైటెడ్ కింగ్‌డమ్(0.1717)
9) ఈజిప్ట్(0.1872)
10) బ్రెజిల్(0.1988)
నిత్యంతో మనలను కవ్వించే పొరుగు దేశం ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో(0.2364
పాయింట్లతో) ఉండగా ఈమధ్య కాలంలో చైనా అండ చూసుకుని కాలు దువ్వుతున్న నేపాల్ 122వ స్థానంలో(2.9891
పాయింట్లతో) ఉంది.
(పార్ట్ - 2 కోసం రేపు ఇదే వెబ్‌సైట్‌లో చూడండి. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక బలం వంటివన్నీ ఇండియాకు ఎంతుంది.. చైనాకు ఎంతుందనే విశ్లేషణ కోసం పార్ట్-2 చదవండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి