ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బాగా క్షీణించిందని ఆయనకు చికిత్స చేస్తున్న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం గురించి విడుదల చేసిన బులెటిన్‌లో ఆయన ఆరోగ్యం గత 24 గంటల్లో మరింతగా క్షీణించిందని ఆసుపత్రి తెలిపింది.
కరోనా సోకడంతో బాలసుబ్రహ్మణ్యం ఆగస్ట్ 5న ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సహా ఇతర పద్ధతుల్లో చికిత్స అందిస్తున్నారు.
సుదీర్ఘ చికిత్స అనంతరం ఆయనకు కరోనా నెగటివ్ రావడంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆసుపత్రిలోనే ఆయన పెళ్లి రోజు జరుపుకొన్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడిందని అంతా సంతోషించారు.
అయితే, ఇటీవల బాలు తనయుడు చరణ్ తన తండ్రికి ఇంకా ఎక్మో సాయంతో చికిత్స జరుగుతోందని చెప్పారు. ద్రవాహారం తీసుకుంటున్నారనీ చెప్పారు. ఇంతలోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించినట్లు ఆసుపత్రి వెల్లడించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి