కరోనావైరస్ భారత్‌లో ఎవరినీ విడిచిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు.
తాజాగా కేంద్ర సాంస్కృతిక, పర్యటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధరణైంది.
ఇందుకు ఒక రోజు ముందు బుధవారం(సెప్టెంబరు 16న) మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కరోనావైరస్ బారిన పడ్డారు.
మోదీ మంత్రివర్గంలో కోవిడ్ బారిన పడిన తొలి మంత్రి హోం మంత్రి అమిత్ షా. 55 ఏళ్ల అమిత్ షాకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్ నిర్ధరణైంది. గుర్‌గావ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొంది రెండు వారాల తరువాత డిశ్చార్జయ్యారు.
అయితే, కొద్దిరోజలు తరువాత మళ్లీ అనారోగ్యంగా ఉండడంతో ఆగస్టు 18న దిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జయ్యారు.
అనంతరం కొద్దిరోజులకే అంటే సెప్టెంబరు 13న మళ్లీ ఆయన ఎయిమ్స్‌లో చేరారు. గురువారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు... సోమవారం నుంచి పార్లమెంటుకు హాజరవుతారని చెబుతున్నారు.
వీరే కాకుండా మరికొందరు కేంద్ర మంత్రులూ కోవిడ్ బారిన పడ్డారు.
కోవిడ్ బారిన పడిన కేంద్రమంత్రులు వీరే
1) ప్రహ్లాద్ పటేల్ - సాంస్కృతిక, పర్యటక మంత్రి
2) ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజవాయు మంత్రి. ఆగస్టు 4న ఈయనకు కోవిడ్ నిర్ధరణైంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా అమిత్ షా చికిత్స పొందిన మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స పొందారు.
3) అర్జున్ రామ్ మేఘ్వాల్ - పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి. ఆగస్టు 9న ఈయనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.
జులైలో మేఘ్వాల్ ఒక రకం అప్పడాలు తింటే ఇమ్యూనిటీ పెరిగి కరోనా రాదని చెప్పిన కొద్దిరోజులకే దాని బారినపడ్డారు.
4) గజేంద్ర సింగ్ షెకావత్ - కేంద్ర జలవనరుల మంత్రి. ఆగస్టు 20న కరోనా బారినపడ్డారు.
5) శ్రీపాద యశోనాయక్ - ఆయుష్ శాఖ మంత్రి. ఆగస్ట్ 13న కరోనా బారినపడ్డారు.
6) కైలాశ్ చౌదరి- వ్యవసాయ శాఖ సహాయ మంత్రి.. ఆగస్టు 8న కరోనాబారినపడ్డారు.
7) అమిత్ షా - హోం మంత్రి
8) నితిన్ గడ్కరీ - ఉపరితల రవాణా మంత్రి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి