10, సెప్టెంబర్ 2020, గురువారం

అంతర్వేది: ఫస్ట్ టైం.. హిందూ ఓట్ బ్యాంక్ దిశగా ఏపీ

అంతర్వేది రథం

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో(తెలంగాణ లేకుండా) హిందువుల జనాభా 90.87 శాతం. ముస్లింలు 7.32 శాతం, క్రిస్టియన్లు 1.38 శాతం, ఇతర మతాలు 0.43 శాతం ఉన్నాయి. 

అయితే, ఇవి దాదాపు పదేళ్ల కిందటి లెక్కలు. ఈ పదేళ్లలో సొసైటీ చాలామారిపోయింది.. అలాగే చాలామంది మతం కూడా మారిపోయారు. 

మతం మారిపోవడమంటే ఇతర మతాల నుంచి హిందూమతంలోకో.. లేదంటే ఇతర మతాల నుంచి ముస్లిం మతంలోకో మారడం కాదు, ఒక వేళ అలా మారినా వారి సంఖ్య చాలా తక్కువ. అసలు ఉండకపోవచ్చు కూడా. కానీ, ఇతర మతాల నుంచి.. ముఖ్యంగా హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి మారినవారు మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

అందుకు కారణాలున్నాయి.. క్రైస్తవ మత ప్రచారం భారీ స్థాయిలో జరుగుతుండడం, అందుకు తోడ్పడేలా నిధుల సహకారం విదేశాల నుంచి అందుతుండడం, దేశంలోనూ చాలాకాలంగా, రాష్ట్రంలో కొద్ది కాలంగా రాజకీయంగా అండదండలు ఉండడం చెప్పుకోదగ్గ కారణాలు. 

7 secrets of Shiva

అయితే, ఇలా క్రైస్తవంలోకి మతం మారినవారంతా అధికారికంగా, లెక్కల ప్రకారం క్రైస్తవుల జనాభా లెక్కల్లో కనిపించరు. కారణం.. ఈ దేశం ఉదారంగా ఇస్తున్న రిజర్వేషన్లు, ఇతర సదుపాయాలు. 

క్రైస్తవంలోకి మారినట్లు అధికారికంగా చెబితే కొన్ని వర్గాలకు రాజ్యాంగ పరంగా దక్కాల్సిన, ప్రభుత్వాల పథకాల పరంగా దక్కాల్సిన అనేక ప్రయోజనాలకు కోత పడుతుంది.  కాబట్టి మతం మారినా లెక్కల్లో మాత్రం ఆ సంగతి చెప్పరు. 

కాబట్టి, జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ జనాభా 1.36 శాతంగా చెప్పిన వాస్తవ లెక్క అందుకు 10 రెట్లు, అంతకుమించి కూడా ఉండొచ్చు. 

పైగా గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో పాలనాపరమైన, రాజకీయపరమైన మార్పులు వచ్చాక జన్మతః హిందూ నాయకులు, వారి అనుయాయులు, హిందూ అధికారులుగా ఉన్నవారు కూడా ఎంతోమంది కెరీర్ ఎదుగుదల కోణంలో ఇతర మతాలను పులుముకొంటున్నారు.

ఇంతకీ.. ఇదంతా చెప్పడం ఎందుకంటే.. బీజేపీ.. అంటే భారతీయ జనతా పార్టీ.. దానికి ఆంధ్రప్రదేశ్‌లో గల అవకాశాల గురించి మాట్లాడడానికి. అవును.. అదే రీజన్. 

Anti Hindu riots


టార్గెట్ 2029 నుంచి 2024కి..

ఏపీలో బీజేపీలో బలపడడానికి కానీ..  కలో, కల్పనో ఆ పార్టీ నాయకులు అప్పుడప్పుడు చెప్పే అధికారంలోకి రావడం గురించి మాట్లాడడానికి ప్రధానమైన డిస్కషన్ పాయింట్ ఈ మతాల, జనాభాలో శాతాల లెక్క. అంతకుమించి ఈ లెక్కలకు వేరే కారణాలేవీ లేవు.

బీజేపీ 2024లో ఏపీలో అధికారంలోకి వస్తుంది అని చెబితే పకపకా నవ్వి పిచ్చోడిని చూసినట్లు చూసేవారు చాలామంది ఉంటారు. కానీ, అలా నవ్వేవారే పిచ్చోళ్లనుకోవాలి. అవును.. నిజమే. 2024 అనేది కాస్త అతిశయం అనుకున్నా 2029 మాత్రం అతిశయం ఏమీ కాదు. 2029 నాటికి ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అందుకు బలమైన కారణాలున్నాయి. ఆ బలమైన కారణాల్లో ఒకటి ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం.  ఈ  ప్రభుత్వ కాలంలో క్రైస్తవ మతం అనేక ఇతర ముసుగుల్లో ఉంటూ హిందూత్వపై దాడులకు తెగబడుతుండడం.

ఇటీవల ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలే అందుకు ఉదాహరణ. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో రథం కాలిపోవడం, తాజాగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం కాలిపోవడం. 

అంతర్వేది ఘటన తరువాత బీజేపీ కాస్త గట్టిగానే స్పందించింది. కానీ, పార్టీ సిద్ధాంతంలో ఉన్న దూకుడు, స్పష్టత ఏపీ బీజేపీ నాయకుల్లో లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకో ఏపీ బీజేపీ వీరత్వం ప్రదర్శించడం లేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

అంతోఇంతో చూపుతున్నట్లు అనిపిస్తున్నా అది కూడా ఇప్పుడు జరుగుతున్నదంతా వదిలేసి గత ప్రభుత్వంపై చూపుతున్న వీరత్వమే.

Hindu Trinity


నేషనల్ చాంపియన్లను చూసి నేర్చుకోరా?

రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. చిన్నచితకా పార్టీల నుంచి ఈ దేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన ముసలి పార్టీల వరకు అన్నీ నిత్యం రాళ్లు విసురుతున్నా... సూడో మేధావులు సూదులతో పొడుస్తున్నా జాతీయ స్థాయిలో బీజేపీ మాత్రం దినదిన ప్రవర్థమానమవుతోంది. 

అందుకు కారణం సుస్పష్టం.  ఇప్పుడు దేశంలో దుమ్ము రేపుతున్నది ఒకప్పటి బీజేపీ కాదు.. మోదీ-అమిత్ షా ద్వయం నేతృత్వంలో ఉరకలేస్తున్న బీజేపీ. కాకపోతే.. ఉత్తరాదిని పూర్తిగా సోలిడ్ చేసుకోవడానికి, కాస్త బలంగా ఉన్న రాష్ట్రాలు, అవకాశాలు మెరుగ్గా ఉన్న రాష్ట్రాలను ముందుగా తమ పరం చేసుకోవడానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండడం... కోవిడ్ కారణంగా రాజకీయాలు చేయడం ఇష్టం లేకపోవడం వంటి కారణాల వల్ల మోదీ-షాల నేతృత్వంలోని బీజేపీ ఇంకా ఏపీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. 

ఏపీపై ఇప్పుడే కనుక మోదీ-షా దృష్టిపెడితే వారి టార్గెట్ 2024 అవుతుంది. దేశ, ప్రపంచ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం.. మోదీ, షాలకు ఇతర ప్రాథామ్యాలు ఉండడం వల్ల ఏపీ, అందులోని వైసీపీ ప్రభుత్వం బతికిపోయిందనే చెప్పొచ్చు. లేదంటే అంతర్వేది రథం దహనం వంటి ఘటనలు జరుగుతున్న సమయంలో బీజేపీ అధిష్ఠానం వైఖరి ఇంత ఈజీగా ఉండదనే చెప్పాలి.

The Hindus


ఏపీ బీజేపీ పెద్దలు, ఏపీ బీజేపీలోని ఇతర కొందరు నాయకులు వైసీపీకి అనుకూలంగా ఉన్నా కేంద్రం చూస్తూ ఊరుకుంటుందంటే అందుకు కారణం రాజకీయాలు చేసే టైం కాదని బీజేపీ దిల్లీ పెద్దలు భావిస్తుండడమే.

పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ బంగారు పళ్లెంలో బీజేపీకి బహుకరించినట్లే. 

దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో కులమే ప్రధానమైనప్పటికీ ఇలాంటి ఘటనను జరుగుతుంటే మతమూ ఎన్నికల్లో ఓట్లేయడానికి ప్రధానాంశంగా మారుతుంది. అప్పుడు ఏపీలాంటి రాష్ట్రంలో రాజకీయ పార్టీలవారీగా భావజాలాలున్న ప్రధాన సామాజికవర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే తేడా లేకుండా హిందూ ఓట్ బ్యాంక్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఏపీలో తొలిసారి అలాంటి పరిస్థితులకు దారులు కనిపిస్తున్నాయి.

Read Our Exclusives:

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి