లోతైన విశ్లేషణలు, ట్రెండింగ్ టాపిక్స్, రాజకీయాలు, సామాజిక అంశాలు అన్నిటిపైనా సమగ్ర కథనాలు అందించడమే మా ధ్యేయం.
పార్టీలో నిబద్దతతో చురుకుగా పనిచేస్తున్న కార్యకర్తలను ప్రోత్సహించడానికి క్రియాశీలక సభ్యులను గుర్తించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని ఆదేశించారు. ఇందులో భాగంగా గురువారం నాడు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు టెలీకాన్ఫరెన్సులో పాల్గొన్నారు. క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి తమ అభిప్రాయాలు, సూచనలు అందచేశారు.
సాధారణ సభ్యత్వం యధా విధిగా కొనసాగుతుంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ గా ఈ కార్యక్రమాన్ని అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్వహించి, అక్కడి అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కమిటీ చేసిన సూచనలను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారు.
పైలట్ ప్రాజెక్ట్ ను ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26 న ప్రారంభించి పది రోజులలో పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్సును కూడా వర్తింప చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరిపాలన విభాగాన్ని ఆదేశించారు.
ఈ రోజు జరిగిన కాల్ కాన్ఫరెన్స్ కు పి.ఏ.సి.చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శులు శ్రీ తోట చంద్రశేఖర్ గారు, శ్రీ టి.శివశంకర్ గారు, శ్రీ బొలిశెట్టి సత్య గారు, పార్టీ ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షకులు శ్రీ రత్నం గారు ఇతర పి.ఏ.సి. సభ్యులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి