సూపర్ ఫ్లవర్ మూన్ 2020లో మే 7న కనిపించనుంది. సూపర్ ఫ్లవర్ మూన్ అంటే భూమికి అత్యంత సమీపంగా కనిపించే పున్నమి చంద్రుడు.
భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు భూకక్షలో అత్యంత సమీపంగా వచ్చిన రోజుల్లో పౌర్ణమి రోజున కనిపించే చందమామే ఈ సూపర్ ఫ్లవర్ మూన్.
ఎన్ని గంటలకు కనిపిస్తుంది
ఇది మే 7న బుద్ధ పూర్ణిమ రోజున కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.15 గంటలకు భూమికి అత్యంత సమీపంలోకి వస్తుంది. అయితే.. రాత్రి 10.30 నుంచి 11.30 గంటల(మన కాలమానం ప్రకారం) మధ్య పూర్తిస్థాయిలో ప్రకాశవంతంగా దర్శనమిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పేరెలా వచ్చింది
అయితే.. దీనికి ఫ్లవర్ మూన్ అనే పేరు రావడానికి కారణం ఉంది. ఉత్తరార్థ గోళంలో వసంత కాలం ప్రారంభమయ్యే సమయంలో ఏర్పడుతుంది కాబట్టి నాసా దీనికి సూపర్ ఫ్లవర్ మూన్ అని పేరు పెట్టింది.దీనికి కార్న్ ప్లాంటింగ్ మూన్, మిల్క్ మూన్, ది వేశాక్ ఫెస్టివల్ మూన్ అనే పేర్లూ ఉన్నాయి.
ఈ ఏడాది ఇదే చివరిది
2020లో ఇదే చివరి సూపర్ మూన్ ఈ ఏడాదికి ఇక ఉండదు.అంతేకాదు.. మళ్లీ సూపర్ మూన్ చూడాలంటే దాదాపు ఏడాది వెయిట్ చేయాలి.
2021 ఏప్రిల్ చివరి వారంలో మళ్లీ సూపర్ మూన్ కనిపించనుంది. దాన్ని సూపర్ పింక్ మూన్ అంటారు.
సో.. మిస్ కాకుండా గురువారం రాత్రి సూపర్ ఫ్లవర్ మూన్‌ను చూసేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి