10, జూన్ 2020, బుధవారం

కరోనా వైరస్: ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్లు కొనాలంటే ఈ ఆఫర్లు చూడండి


ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆఫర్లు


కరోనావైరస్.. లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడిపోయాయి. ఇంతకాలం ఏ కొన్ని విద్యాసంస్థలకో, ఏ కొందరు విద్యార్థులకో మాత్రమే పరిమితమైన ఆన్ లైన్ క్లాసులనేవి ఇప్పుడు అందరికీ అవసరంగా మారాయి. 
ప్రయివేటు స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలు అన్న తేడాలేకుండా... ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ అనే తేడా లేకుండా అందరికీ ఆన్‌లైన్ పాఠాలు కంపల్సరీగా మారాయి.
దీంతో విద్యార్థులందరికీ ఈ ఆన్‌లైన్ పాఠాలు వినడానికి స్మార్టు ఫోన్లు కావాల్సి వస్తోంది.
పెద్దక్లాసుల పిల్లల వద్ద ఇప్పటికే చాలామందికి స్మార్టు ఫోన్లు ఉంటున్నప్పటికీ చిన్న తరగతులు, దిగువ మధ్య తరగతి పిల్లలు, అమ్మాయిల వద్ద స్మార్టు ఫోన్లు తక్కువే.
ఆన్ లైన్ పాఠాల కోసం ఇప్పుడు వారంతా స్మార్ట్ ఫోన్లు కొనాల్సి ఉంటుంది.
అయితే, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఆఫర్ సేల్స్ ఉండడంతో ఇలాంటి సమయంలో ఎవరైనా కొనుక్కోవచ్చు.
జూన్ 9 నుంచి మొదలైన ఈ సేల్ జూన్ 12 వరకు ఉంటుంది.
క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్20 సిరీస్‌పై 4 వేల క్యాష్ బ్యాక్
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్‌లో వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా, ఎస్ 20, ఎస్ 20 ప్లస్‌లపై రూ. 4 వేల క్యాష్ బ్యాక్ వస్తోంది. 
ఈ క్యాష్ బ్యాక్ కావాలంటే హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనాల్సి ఉంటుంది. దీనిపై 12 నెల నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10పైనా..
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్ 128 జీబీ వేరియంట్‌పై హెచ్‌డీఎఫ్‌సీ కార్డుదారులకు రూ. 4 వేల ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. 
మా ఇతర కథనాలు కూడా చదవండి:

జగన్‌పై రామ్ మాధవ్ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం వెనుక కథేంటి?




జగన్‌ను బీజేపీ ముద్దు చేస్తోందన్న భావన ఏపీకి చెందిన రాజకీయవర్గాలలో చాలాకాలంగా ఉంది. అయితే.. అప్పుడప్పుడు అలా అనిపించినా కేంద్రం ఆయన్ను ఎంటర్‌టెయిన్ చేసింది మాత్రం లేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. 
ఏపీ బీజేపీలోనే కొంతమంది నాయకులు జగన్‌ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో వ్యవహరిస్తున్నారని చెబుతుంటారు.
అయితే, కేంద్రంలోని పెద్దలను కలిసినప్పుడంతా తన కేసులను ఎత్తివేయించేందుకు ఆయన చేసే ప్రయత్నాలంటే వారికి మా చెడ్డ చిరాకని మాత్రం  కేంద్రంలోని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తుంటుంది. 
కానీ.. జగన్‌ను ఇబ్బంది పెట్టేలా, ఇరుకునపెట్టేలా ఏపీ బీజేపీ భారీ స్థాయిలో ఏమీ చేయయకపోవడంతో ఆయన్ను ఎంటర్‌టెయిన్ చేస్తున్నారన్న విమర్శలు మాత్రం వినిపిస్తుంటాయి. 
కానీ, అది నిజం కాదని.. జగన్‌ను విమర్శించడంలో బీజేపీ ఏమాత్రం వెనక్కు తగ్గదని ఆ పార్టీ నేషనల్ సెక్రటరీ రాంమాధవ్ తాజాగా నిరూపించారు. 
ఏపీలోని విపక్షం ఆరోపిస్తున్నట్లుగానే రాంమాధవ్ కూడా జగన్‌పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ రోజురోజుకీ వెనక్కు వెళ్తోందని ఆయన అన్నారు.

మోదీ నాయకత్వంలో దేశం ముందుకు దూసుకెళ్తుంటే ఏపీ మాత్రం జగన్ నాయకత్వంలో వెనక్కు పరుగెడుతోందని రామ్ మాధవ్ అన్నారు. 
అంతేకాదు... బెయిలు మీద ఉన్న వ్యక్తి ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలిస్తున్నాడని... పైగా ఆ పాలన రివర్స్ పాలన అని ఆయన అన్నారు. 
హైదరాబాదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఫుల్ స్పీడ్‌‌తో రివర్స్ గేర్

రామ్ మాధవ్ జగన్ పాలనపై ఈ విమర్శలను ఏదో యథాలాపంగా చేయలేదు. చాలా డీటెయిల్డ్‌గా అన్ని అంశాలనూ ప్రస్తావిస్తూ స్పష్టంగా ఏకిపడేశారు. 
ఏపీ రాజధానిలో మొదలైన జగన్ రివర్స్ పాలన ఫుల్ స్పీడుతో వెనక్కు వెళ్తోందన్నారు. 
రాజధాని రివర్సు, పోలవరం రివర్సు, మద్యపాన నిషేధం రివర్సు... అన్నీ రివర్సే అంటూ రామ్ మాధవ్ మండిపడ్డారు.
తిరుమల భూములు అమ్మేయడానికీ జగన్ రెడీ అయ్యాడని.. కానీ, ప్రజలు తిరగబడడంతో జగన్ వెనక్కు తగ్గాడని అన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గత ఏడాది కాలంలో వారానికోసారి కోర్టుతో మొట్టికాయలు తింటున్నారని... అలాంటి రికార్డు భారత దేశ చరిత్రలో ఇంకే ముఖ్యమంత్రికీ లేదని అన్నారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది
జగన్ పుణ్యమా అని ఏపీ పేద రాష్ట్రంగా మారుతోందని.. రోజురోజుకీ ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందన్నారు.
పన్నులు వసూలు కాకపోయినా కేంద్రం రెండు విడతల్లో ఏపీకి 10 వేలకోట్లు ఇచ్చిందని రాంమాధవ్ గుర్తు చేశారు.
అయితే.. కొద్దిరోజుల కిందటే రాంమాధవ్ జగన్‌కు సానుకూలంగా మాట్లాడారు. 
కానీ, ఇంతలోనే ఆయన ఈ రేంజ్‌లో విరుచుకుపడడడంతో కేంద్రం నుంచి ఏదో క్లియర్ డైరెక్షన్ వచ్చినట్లుందన్న మాట వినిపిస్తోంది. 
అంతేకాదు.. ఇంతవరకు హైకోర్టులో వరుస దెబ్బలు తింటూ వస్తున్న జగన్.. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ చివాట్లు తినడంతో అలాంటి సీఎంను వెనకేసుకొస్తే ఇబ్బందేనని గుర్తించి బీజేపీ స్టాండ్ మార్చుకుంటోందని అంటున్నారు.
అంతేకాదు.. ఇటీవల బీజేపీ నిర్వహించిన సర్వేలోనూ జగన్ గ్రాఫ్ భారీగా పడిపోయినట్లు తేలడంతో ఏపీపై ఫోకస్ పెట్టడానికి టైమొచ్చిందని మోదీ-షా డిసైడ్ చేశారని.. ఆ ఫలితమే రాంమాధవ్ వ్యాఖ్యలని.. ఇక బీజేపీ నుంచి జగన్‌పై దాడి మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.
మా ఇతర కథనాలనూ చదవండి:
  1. Super Flower Moon 2020: సూపర్ ఫ్లవర్ మూన్ అంటే ఏమిటి? మే 7న ఎన్ని గంటలకు కనిపిస్తుంది.. ఫుల్ డీటెయిల్స్ చదవండి
  2. బాలకృష్ణ 60వ పుట్టిన రోజు.. 60 స్పెషల్ థింగ్స్.. బాలయ్యకు నచ్చిన చిరంజీవి సినిమా ఏంటి? 
  3. Aarogy Setu ఆరోగ్య సేతు యాప్ ఎలా పనిచేస్తుంది? ఎవరు తయారుచేశారు? ఎన్ని భాషల్లో ఉంది? 
  4. ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది
  5. కరోనా వైరస్: లాక్‌డౌన్ ఉన్నా ఇవన్నీ చేయొచ్చు

బాలకృష్ణ 60వ పుట్టిన రోజు.. 60 స్పెషల్ థింగ్స్.. బాలయ్యకు నచ్చిన చిరంజీవి సినిమా ఏంటి?

బాలకృష్ణ



బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ, బాలయ్య, బాలయ్య బాబు, బాలా.. ఇలా ఎవరెలా పిలుచుకున్నా కానీ తనదైన స్టైల్‌లో చెలరేగిపోయే నటుడు బాలకృష్ణ. 
అప్పుడే 60 ఏళ్లు వచ్చేశాయే అనిపించేలా మెంటైన్ చేసే గ్లామర్.. స్పీడ్... ఎనర్జీ ఆయన సొంతం.
ఆయనకు కూడా అదే ఫీలింగ్.. అందుకే.. మరో 60 ఏళ్లు ఇంతే హుషారుగా బతుకుతా  అంటారాయన.
అటు హీరోగా, ఇటు ఎమ్మెల్యేగా రాణిస్తున్న ఆయనను చూసి నవ్వే వారు.. అసూయపడేవారు.. అభిమానించేవారు.. ఆరాధించేవారూ అందరూ ఎక్కువే.

నందమూరి బాలకృష్ణ షష్ఠిపూర్తి(60వ జన్మదినం) సందర్భంగా ఆయనకు సంబంధించిన 60 ప్రత్యేకమైన అంశాలు మీకోసం..
స్వీట్ 60
1. బాలకృష్ణ బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. నిజాం కాలేజ్‌లో డిగ్రీ చదివారు.
2. బాలకృష్ణ పద్నాలుగేళ్ల వయసులో తన తండ్రి ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన ‘తాతమ్మ కల’ చిత్రంతో ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు.
3. ఇంటర్మీడియట్ తరువాత పూర్తిగా సినీ ఫీల్డులో సెటిలైపోదామనుకున్నారాయన. కానీ.. కనీసం డిగ్రీ చదివాకే సినీ ముచ్చట తీర్చుకో అని తండ్రి చెప్పడంతో బీఏ చదివి ఆపైన హీరోగా వచ్చారు.
4. తొలినాళ్లలో సహాయ నటుడిగా వివిధ సినిమాల్లో నటించారు. వాటిలో తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించిన చిత్రాలే ఎక్కువ.
5. బాలకృష్ణ నటించిన ‘తాతమ్మ కల’, ‘దాన వీర సూర కర్ణ’, ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలీ’, ‘శ్రీమద్విరాట్‌పర్వం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం’ చిత్రాలకు ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించారు. 
6. కథానాయకుడిగా మారిన తర్వాత ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ‘శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ చిత్రంలో బాలయ్య నటించారు.
7. బాలకృష్ణ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘సాహసమే జీవితం’. 1984 జూన్‌ 1న విడుదలైన ఈ చిత్రానికి భారతి-వాసు దర్శకత్వం వహించారు. విజి కథానాయికగా నటించారు. 
8. బాలకృష్ణ సినిమాలకు ఎక్కువగా దర్శకత్వం వహించింది ఎ.కోదండరామిరెడ్డి. ఆయన దర్శకత్వంలో  11 సినిమాల్లో బాలయ్య హీరోగా నటించారు.
9. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఏడు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆరు సినిమాల్లో నటించారు. 
10. 1987లో అత్యధికంగా బాలకృష్ణ 8 చిత్రాల్లో నటించారు. ‘అపూర్వ సోదరులు’, ‘భార్గవ రాముడు’, ‘రాము’, ‘అల్లరి కృష్ణయ్య’, ‘సాహస సామ్రాట్‌’, ‘ప్రెసిడెంట్‌గారి అబ్బాయి’, ‘మువ్వ గోపాలుడు’, ‘భానుమతిగారి మొగుడు’ చిత్రాలు విడుదలయ్యాయి.
నందమూరి బాలకృష్ణ

11. సొంతపేరుతో బాలకృష్ణ ఏడు సినిమాల్లో నటించారు. తొలి చిత్రం ‘తాతమ్మకల’లో ఆయన పేరు కూడా బాలకృష్ణనే. ఆ సమయంలో బాలకృష్ణ తొమ్మిదో తరగతి చదివేవారు. 
12. బాలకృష్ణ 25వ చిత్రం ‘నిప్పులాంటి మనిషి’. ఎస్‌.బి.చక్రవర్తి దర్శకుడు. 50వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇక 75వ చిత్రం ‘క్రిష్ణబాబు’ ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. 100వ చిత్రం ‘గౌతమీపుత్రశాతకర్ణి’ క్రిష్ దర్శకత్వం వహించారు.
13. ఎన్టీఆర్‌ నటించిన ‘యమగోల’ చిత్రాన్ని బాలకృష్ణతో తీయాలనుకున్నారు. ఎన్టీఆర్‌ యముడిగా, బాలకృష్ణ హీరోగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ, కుదరలేదు. 
14. బాలకృష్ణ నటించిన జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా కథానాయిక. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. 
15. ‘భైరవద్వీపం’ విడుదలయ్యే వరకూ ఇందులో ఆయనే కురూపి వేషం వేశారన్న విషయాన్ని దాచిపెట్టారు. ఆ మేకప్‌ వేసుకోవడానికి తీయడానికి రెండేసి గంటలు సమయం పట్టేది. 
16. ‘ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌’, ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘లక్ష్మీ నరసింహా’, ‘అల్లరి పిడుగు’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర చిత్రాల్లో బాలకృష్ణ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. 
17.  అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి బాలకృష్ణ రెండు సినిమాల్లో నటించారు. ఒకటి ‘భార్యాభర్తల బంధం’ కాగా, మరొకటి ‘గాండీవం.
18. బాలకృష్ణ నటించిన ‘నిప్పు రవ్వ’, ‘బంగారు బుల్లోడు’ ఒకే రోజున విడుదలయ్యాయి.
19. బాలకృష్ణ మొత్తం 15 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. ‘అధినాయకుడు’లో ట్రిపుల్‌రోల్‌ పోషించారు. 
20. బాలకృష్ణ అతిథి పాత్రలో నటించిన ఏకైక చిత్రం ‘త్రిమూర్తులు’.
21. బాలకృష్ణ నటించిన 35 చిత్రాలకు పరుచూరి బ్రదర్స్‌ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పనిచేశారు. 
22. బాలకృష్ణ కోసం పరుచూరి బ్రదర్స్‌ రాసిన కథతో ‘అల్లరి కృష్ణయ్య’ కథ క్లాష్‌ అయింది. దీంతో పరుచూరి బ్రదర్స్‌ ‘ప్రెసిడెంట్‌గారి అబ్బాయి’ కథ రాశారు. తొలుత ఈ సినిమాకు భానుప్రియను అనుకున్నారు. కానీ, సుహాసిని నటించారు. 
23. సినిమా ఆడదని తెలిసినా, తండ్రి మాటకు గౌరవం ఇచ్చి నటించిన చిత్రం ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’. 
24. ‘లారీడ్రైవర్‌’ కన్నా ముందు పరుచూరి బ్రదర్స్‌ ఒక కథ చెప్పారు. అది బి.గోపాల్‌కు నచ్చలేదు. అప్పుడు పుష్పానంద్‌ చెప్పిన లైన్‌ ఆధారంగా ‘లారీ డ్రైవర్‌’ తీర్చిదిద్దారు. 
25. బాలకృష్ణ డైలాగ్‌ బాడీ లాంగ్వేజ్‌తో పాటు, డైలాగ్‌ లాంగ్వేజ్‌ మార్చిన చిత్రం ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’. 
26. ఈ సినిమా కోసం బాలకృష్ణ రోజూ పోలీస్‌ జీపులోనే షూటింగ్‌కు వచ్చేవారట. 
27. ‘సమర సింహారెడ్డి’ చిత్రానికి తొలుత ‘సమర సింహం’ అని పెడదామనుకున్నారు. కానీ, చివరకు ప్రస్తుతం ఉన్న టైటిల్‌ అయితేనే బాగుంటుందని ఖరారు చేశారు. 
28. ‘నరసింహనాయుడు’లో కంటిచూపుతో చంపేస్తా డైలాగ్‌ మొదట లేదు. షూటింగ్‌ చివరి రోజున పరుచూరి గోపాలకృష్ణ రాశారు.
29. ‘నరసింహనాయుడు’ సినిమాను దేవి థియేటర్‌లో చూసిన గేటు బయటకు రావడానిడి దర్శకుడు బి.గోపాల్‌, రచయిత పరుచూరి గోపాలకృష్ణకు గంటా ఏడు నిమిషాలు పట్టింది. 
30. బాలకృష్ణ సెట్‌కు రాగానే తోటి నటీనటులను, సాంకేతిక బృందానికి అందరినీ విష్‌ చేసి షాట్‌కు వెళ్లిపోతారు.
31. బాలకృష్ణ నిద్రలేవగానే భూదేవికి నమస్కారం చేసి కాళ్లు కిందపెడతారు. 
32. బాలకృష్ణ తాను నటించిన చిత్రాల్లో ఎక్కువగా ఇష్టపడేది ‘సమర సింహారెడ్డి’. 
33. రజనీకాంత్‌ నటించిన చిత్రాల్లో ‘ముత్తు’, అమితాబ్‌ ‘అగ్నిపథ్‌’,  చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలంటే బాలకృష్ణకు ఇష్టం.
34. బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి చిరంజీవి ప్రచారం చేశారు. 
35. ‘విశ్వామిత్ర’ షూటింగ్‌ సమయంలో కపాల మోక్షం పొందే నేపథ్యంలో సన్నివేశాలు తీస్తున్నారు. అప్పుడు బాలకృష్ణ కాలి వద్ద టపాసు పేలాలి. కానీ అది పేలలేదు. అంతలో మరొకటి విసరమని ఎన్టీఆర్‌ చెప్పారట. దీంతో పాటు అంతకుముందు వేసింది కూడా పేలింది. ఓ వైపు కాలికి గాయమై రక్తం కారుతున్నా, షాట్‌ పూర్తయ్యే వరకూ బాలకృష్ణ కదల్లేదు. 
36. బాలకృష్ణ రాముడిగా కనిపించిన చిత్రం ‘శ్రీరామరాజ్యం’
37. బాలకృష్ణ కృష్ణుడిగా ‘కృష్ణార్జున విజయం’, ‘పాండురంగడు’ చిత్రాల్లో కనిపించారు.
38. సినిమాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా ఎన్నికైన అతి తక్కువమంది నటుల్లో బాలకృష్ణ ఒకరు.
39. స్వీయ దర్శకత్వంలో ‘నర్తనశాల’ తెరకెక్కించాలనేది బాలకృష్ణ చిరకాల కోరిక. దానికి తగ్గట్టే సినిమా చిత్రీకరణ ప్రారంభించినా... వివిధ కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.
40. బాలకృష్ణ మూడుసార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘నరసింహనాయుడు’, ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల్లో నటనకు గానూ ఈ అవార్డులు లభించాయి.
41. ఎన్టీఆర్‌, బసవతారకం దంపతులకు ఆరో కుమారుడిగా నందమూరి బాలకృష్ణ 1960 జూన్‌ 10న మద్రాసులో పుట్టారు. 
42. ఎన్టీఆర్‌ ఎస్టేట్‌ కట్టిన తర్వాత ఆరేళ్ల వయసులో బాలకృష్ణ హైదరాబాద్‌ వచ్చేశారు. 
43. హైదరాబాద్‌లో రామకృష్ణ థియేటర్‌ డాబా మీద తన అన్నదమ్ములతో కలిసి ఆడుకునేవారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసేవారు. 
44. అద్దె సైకిళ్లు తీసుకుని ట్రూప్‌ బజార్‌, సుల్తాన్‌ బజార్‌ తిరిగేవారు. 
45.  బాలకృష్ణకు తెలుగు భాష, పద్యాలు, పురాణాల గురించి చెప్పడానికి ప్రత్యేకంగా ఒక తెలుగు మాస్టార్‌ ఉండేవారు. పద్యాలు సరిగ్గా చెప్పకపోతే ఆయన తొడపాశం పెట్టేవారట.
46. బాలకృష్ణకు 1982లో వసుంధర దేవితో వివాహం అయింది. వీరికి తేజస్వి, బ్రాహ్మణి ఇద్దరు కూతుళ్లు కాగా, మోక్షజ్ఞ కుమారుడు.
47. బాలకృష్ణ తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రలేస్తారు. తప్పనిసరిగా యోగా, వ్యాయామం చేస్తారు.
48. బాలకృష్ణకు భక్తి ఎక్కువ. దేవుడిని నమ్ముతారు. అందుకు ప్రతిరోజూ తప్పకుండా పూజా చేస్తారు. ‘మనకోసం మనం కేటాయించుకునే సమయం ఒకటుంది. నాకు పూజా సమయం’ అని చెబుతుంటారు బాలయ్య. సూర్యోదయం అవ్వకముందే పూజా కార్యక్రమం ముగిస్తారు.
49. తన కుటుంబం కోసం ఏమిచ్చాను? తన కోసం ఎంత సమయం కేటాయించుకున్నానో బాలయ్య ఆలోచిస్తుంటారు. ఓ భర్తగా, తండ్రిగా తన కర్తవ్యాన్ని ఎప్పుడూ విస్మరించలేదని చెబుతారు.
50. ఆహారం విషయంలో బాలకృష్ణకు ప్రత్యేక నియమాలు అంటూ ఏవీ లేవు. అన్నీ తింటారు. ఇక సినిమాల్లో పాత్రను బట్టి తన డైట్‌లో స్వల్ప మార్పులు చేసుకుంటారు. అయితే, రాత్రి పూట మాత్రం భోజనం చేయరు.
51. ‘లెజెండ్‌’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ‘సైమా’ అవార్డును అందుకున్నారు.
52. బాలకృష్ణ తొలిసారి పాట పాడిన చిత్రం ‘పైసా వసూల్‌’. ‘మామా..ఏక్‌ పెగ్‌ లా’ అనే పాట పాడారు.
53. ఎన్టీఆర్‌ నటించిన అన్ని సినిమాల్లో ‘సీతారామ కళ్యాణం’ చాలా గొప్ప సినిమా అని బాలకృష్ణ అనేవారు.
54. బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్టుల్లో ‘ఆదిత్య 999’ కూడా ఒకటి. 
55. బాలకృష్ణ ఇప్పటివరకూ ఒక్క కమర్షియల్‌ యాడ్‌లోనూ నటించలేదు.
56. బాలకృష్ణ ‘9’ అంకెను నమ్ముతారు. తన సినిమాకు సంబంధించిన ఏది ప్రకటించాలన్నా ‘9’ కలిసేలా చూసుకుంటారు.
57. బాలకృష్ణకు ఫేస్‌బుక్‌ ఖాతాలో మాత్రమే అకౌంట్‌ ఉంది. ప్రస్తుతం 9,07,093 మంది అనుసరిస్తున్నారు. 
58. బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించిన ఏకైక చిత్రం ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌: మహానాయకుడు’
59.  బాలకృష్ణ ఇప్పటివరకూ ఎప్పుడూ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించలేదు. ఎందుకు అని అడిగితే, ‘నేను రొమాన్స్‌ చేస్తే నప్పదు. చొక్కాలు విప్పి సిక్స్‌ప్యాక్‌ చేసినా చూడరు. అది మన సంస్కృతి కాదు’ అని సమాధానం ఇచ్చారు.
60. బాలకృష్ణ ‘సింహం’ పేరు కలిసేలా ఎనిమిది చిత్రాలు వచ్చాయి. ‘సింహం నవ్వింది’, ‘బొబ్బిలి సింహం’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘సీమ సింహం’, ‘లక్ష్మీ నరసింహా’, ‘సింహా’, ‘జై సింహా

5, జూన్ 2020, శుక్రవారం

స్ట్రాబెర్రీ మూన్ Strawberry moon అసలేంటీ స్ట్రాబెర్రీ మూన్.. చంద్రగ్రహణం ఏర్పడితే ఎందుకిలా అంటున్నారు

స్ట్రాబెర్రీ మూన్

స్ట్రాబెర్రీ మూన్.. చంద్రగ్రహణం.. 2020 జూన్ 5, 6 తేదీల్లో ఏర్పడే దీనిని ప్రచ్ఛాయా చంద్ర గ్రహణం అంటారు. దీన్ని ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా ఖండాలలో ఉన్నవారు చూడవచ్చు.
ఈ గ్రహణం సమయంలో కనిపించే చంద్రుడిని స్ట్రాబెర్రీ మూన్ అంటున్నారు. రోజ్ మూన్, హాట్ మూన్, మెడ్ మూన్ అని కూడా అంటారు దీన్ని.
భారత కాలమానం ప్రకారం జూన్ 5వ తేదీ రాత్రి 11.15 గంటలకు మొదలయ్యే చంద్రగ్రహణం జూన్ 6వ తేదీ ఉదయం 2.34 గంటలకు ముగుస్తుందని టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ తెలిపింది. ఆ లెక్కన ఇది 3 గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది.
భారత్‌లో పూర్తి స్థాయి చంద్రగ్రహణం అర్థరాత్రి 12 గంటల 54 నిమిషాలకు కనిపిస్తుందని, వాతావరణం స్పష్టంగా ఉంటే దేశంలో అందరూ దానిని చూడవచ్చని ‘టైమ్ అండ్ డేట్’ తెలిపింది.
అసలు గ్రహణం ఎలా ఏర్పడుతుంది
సాధారణంగా చంద్రుడికి సూర్యుడికి మధ్యన భూమి అడ్డుగా వచ్చినపుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
అంటే సూర్యుడి వెలుతురు చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుకున్నప్పుడు అలా జరుగుతుంది. ఆ సమయంలో భూమిపైన ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. ఇది పౌర్ణమి రోజే ఏర్పడుతుంది.
జూన్ 5, 6 తేదీల్లో స్ట్రాబెర్రీ మూన్‌ చంద్రగ్రహణాన్ని టెలిస్కోప్‌ల అవసరం లేకుండా నేరుగానే వీక్షించవచ్చు.

ఏమిటీ ప్రచ్ఛాయ చంద్రగ్రహణం
చంద్రగ్రహణం మొదలవక ముందు చంద్రుడు భూమి పాక్షిక నీడలోకి అడుగుపెడతాడు. అందుకే దీని పెనుంబ్రల్(ప్రచ్ఛాయ) చంద్ర గ్రహణం అంటున్నారని నాసా చెప్పింది.
తర్వాత భూమి వాస్తవిక ఛాయలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అసలైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
అయితే ఎక్కువగా చంద్రుడు, భూమి ఉపఛాయలోకి ప్రవేశించిన వెంటనే ఆ నీడ నుంచి బయకు వస్తాడు.

ఆ సమయంలో చంద్రుడు పాక్షికంగా మాత్రమే కనిపిస్తాడు. అందుకే చంద్రుడు మసకగా కనిపిస్తాడు. అందుకే దీనిని ప్రచ్ఛాయ చంద్రగ్రహణం అంటారు.
జూన్‌లో వచ్చే పౌర్ణమిని వసంతకాలంలో చివరి పౌర్ణమిగా భావించిన ఆల్గోన్క్విన్ తెగలు దీనికి స్ట్రాబెరీ మూన్ అనే పేరు పెట్టారని నాసా చెప్పింది.
జ్యేష్ట మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని తెలుగు ప్రజలు జ్యేష్ట పూర్ణిమ, వట పూర్ణిమగా పిలుస్తారు.




30, మే 2020, శనివారం

Lockdown : లాక్ డౌన్ జూన్ 30 వరకు పొడిగింపు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం


మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగించింది. దేశవ్యాప్తంగా జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించింది. అయితే ఈసారి కేవలం కంటైన్మెంట్‌ జోన్లకే లాక్‌డౌన్‌ పరిమితం చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది.  తాజాగా మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ 5.0  మార్గదర్శకాలను  కూడా కేంద్రం విడుదల చేసింది. 

రాత్రి  9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.  జూన్‌ 8 నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతించింది. విద్యాసంస్థలపై జులైలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.  ఆంక్షల సడలింపులతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు కోరాయి. 

లాక్‌డౌన్ 5.0లో దేనికి అనుమతులున్నాయి..

మొదటి దశలో..
* జూన్ 8 నుంచి ఆలయాలు, మసీదులు, చర్చిలు తెరవొచ్చు.
* జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జింగులు, షాపింగ్ మాల్స్ తెరవొచ్చు.
రెండో దశలో..
* పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు.
* విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలనేది జులైలో నిర్ణయిస్తారు.
* కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల మేరకు విద్యాసంస్థల విషయంలో నిర్ణయం తీసుకుంటారు.

వీటికి అనుమతి లేదు..

* మెట్రో రైళ్లకు నో చాన్స్
* ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్‌కు నో చాన్స్
* సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఆటల పోటీలకు అనుమతి లేదు.

21, మే 2020, గురువారం

Anti-Terrorism Day Rajiv Gandhi : రాజీవ్ గాంధీ విశాఖపట్నం నుంచి వెళ్లిన గంటల్లోనే ఎలా హత్యకు గురయ్యారు

రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ


సరిగ్గా 29 సంవత్సరాల కిందట.. భారతదేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది.
అవును.. 1991 మే 21న రాత్రి పది గంటల 21 నిమిషాలకు జరిగిన ఆ హత్య దేశాన్ని కుదిపేసింది.
మాజీ ప్రధానమంత్రినే బాంబులు పేల్చి చంపేశారు. రాజీవ్ గాంధీ శరీరం తునాతునకలైపోయింది.

వైజాగ్‌లో ఉమాగజపతిరాజు తరఫున ప్రచారం.. అక్కడి నుంచి తమిళనాడుకు..

రాజీవ్ గాంధీ, ఉమా గజపతి రాజు(ఫొటో క్రెడిట్: సంచయిత గజపతిరాజు)

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉమా గజపతి రాజు తరఫున ఎన్నికల ప్రచారం ముగించి అక్కడి నుంచి తమిళనాడులోని శ్రీపెరంబదూరులో  ఎన్నికల సభకు వెళ్లారు రాజీవ్ గాంధీ.
సుమారు 30 ఏళ్లుంటాయేమో.. ఒక నల్లని యువతి పూల మాల తీసుకుని రాజీవ్ గాంధీ వైపు వచ్చింది. ఆయన పాదాలకు నమస్కరించడానికి వంగింది. అంతే... చెవులు దద్దరిల్లిపోయే శబ్దంతో ఆ ప్రాంతంమంతా పొగ, ధూళి కమ్మేసింది.
ఒక్కొక్కరి శరీరభాగాలు గాల్లోకి ఎగిరాయి.. ఎటుచూసినా రక్తం, మాంసపు ముద్దలే. పూలమాల వేయడానికి వచ్చిన 30 ఏళ్ల మానవ బాంబు  థాను రాజీవ్ పాదాలకు నమస్కరించేలా చేస్తూ తన నడుముకు కట్టుకుని వచ్చిన బాంబును పేల్చడంతో ఆమెతో పాటు రాజీవ్ కూడా చనిపోయారు. 
ఆ భయంకరమై పేలుడు సమయంలో తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు మూపనార్, జయంతి నటరాజన్, రామమూర్తి వేదికపై రాజీవ్ గాంధీకి సమీపంలోనే ఉన్నారు. మూపనార్ ఎగిరి అల్లంత దూరంలో పడ్డారు.
తేరుకున్న నేతలంతా ఆ పొగలోనే రాజీవ్ గాంధీ కోసం వెతకడం ప్రారంభించారు. ఆయన శరీరంలో ఒక భాగం, సగం తల కనిపించింది. ఆయన తల ఛిద్రమైంది. దాని నుంచి బయటికొచ్చిన మెదడు, ఆయన సెక్యూరిటీ అధికారి పీకే గుప్తా కాళ్లపై పడి ఉంది. గుప్తా కూడా చావు బతుకుల్లో ఉన్నారు.
పేలుడుకు ప్రత్యక్ష సాక్షి అయిన మూపనార్ ఆ తరువాత ఆ భయంకర ఘటన గురించి వివరిస్తూ " పేలుడు జరగగానే నేను పరుగులు తీశాను. నా ముందు శవాల భాగాలు పడి ఉన్నాయి. రాజీవ్ సెక్యూరిటీ అధికారి ప్రదీప్ గుప్తా అప్పటికి బతికే ఉన్నారు. నా కళ్ల ముందే ప్రాణాలు వదిలారు’’ అని చెప్పారు.
జయంతి నటరాజన్ అయితే ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయారు.
రాజీవ్ గాంధీ కోసం వెతికితే ముఖం, తల పగిలిపోయి కనిపించడంతో ఆమె భీతిల్లిపోయారు.
రాత్రి 10.50 నిమిషాలకు దిల్లీలోని జనపథ్‌లో రాజీవ్ నివాసంలో ఉన్న ఆయన భార్య సోనియా గాంధీకి విషయం చెప్పారు. ఆమె దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారని రషీద్ కిద్వాయ్ తన పుస్తకంలో రాశారు ఆ తరువాత.
‘‘ఆ సమయంలో సోనియాకు ఆస్తమా అటాక్ చాలా తీవ్రంగా వచ్చింది. ఆమె దాదాపు స్పృహతప్పిపోయారు’’ అని రషీద్ రాశారు.
ఆ తరువాత ఎల్టీటీఈ ఈ దాడి చేసిందని తేల్చారు. ఎల్టీటీఈకి చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శివరసన్, ఆయన సహచరులు అరెస్ట్ కావడానికి ముందు సైనైడ్ తిని చనిపోయారు.

ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది

ఈడీ అమీన్


ఆరు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు.. 135 కేజీల బరువు ఉండే ఆయన ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత.
అవును.. ప్రపంచ చరిత్రలో మరెందరో నియంతలు ఉన్నా వారంతా వేలు, లక్షల మందిని చంపి మారణహోమం సృష్టించినా కూడా క్రూరత్వంలో ఈయన కాలిగోటికి కూడా చాలరు.
ఎందుకంటే ఈ నియంత మనుషులను చంపడమే కాదు వారిని వండుకుని తినేసేవాడు కూడా.
అలాంటి క్రూరమైన నియంత పేరే ఈడీ అమీన్. ఉగాండాను చాలాకాలం ఏలాడు. ఆయన దెబ్బకు మన భారతీయులు కూడా చాలామంది అష్టకష్టాలు పడ్డారు.
ఉగాండాను వదిలి బతుకుజీవుడా అంటూ వేల మంది భారత్‌కు పారిపోయి వచ్చారు. మరికొందరు అక్కడే బలైపోయారు.

ఒకప్పుడు యుగాండా హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ అయిన ఈదీ అమీన్ 1971లో మిల్టన్ ఒబోటే ప్రభుత్వాన్ని కూలదోసి బలవంతంగా అధికారంలోకి వచ్చాడు.
అమీన్ ఉగాండాను పాలించిన ఎనిమిదేళ్లు అక్కడ రక్తపాతమే సాగింది. భయంకరమైన క్రూర ఘటనలకు సాక్ష్యంగా నిలిచిపోయింది. 
ఆధునిక ప్రపంచ చరిత్రలో అమీన్ వంటి పాలకుడు ఇంకెవరూ లేరనే చెబుతారు చరిత్రకారులు.

మామూలోడు కాదు


ఈడీ అమీన్
ఈడీ అమీన్ Idi Amin

ఈడీ అమీన్ ఉగాండాలోని కాక్వా తెగకు చెందినవారు. ఆయన ఎప్పుడు పుట్టారన్నది కచ్చితమైన తేదీ ఇంతవరకు తెలియకపోయినా 1925లో పుట్టారని చెబుతారు.
తండ్రి వదిలేయడంతో తల్లి పోషణలోనే పెరిగిన అమీన్ 1946లో బ్రిటిష్ కొలోనియల్ ఆర్మీలో అసిస్టెంట్ కుక్‌గా చేరారు.
చాలా చురుకైనవాడు కావడంతో మిలటరీలో త్వరత్వరగా పైకెదిగాడు అమీన్. ఆరున్నర అడుగుల ఆజానుబాహుడైన అమీన్ 1951 నుంచి 1960 వరకు ఉగాండా లైట్-హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా ఉన్నాడు. మాంచి ఈతగాడు కూడా. అయితే.. తన డామినేటింగ్ నేచర్ వల్ల మిగతా సైనికులను వేధించేవాడు.
బ్రిటిష్ ఆర్మీలో ఒక బ్లాక్ ఆఫ్రికన్ చేరుకోగల అతిపెద్ద ర్యాంకును ఆయన సాధించాడు. కెన్యాలో 1952-56 మధ్య సాగిన తిరుగుబాటును అణచివేసే పనిలో బ్రిటిష్ ఆర్మీలో ఆయన పనిచేశాడు.
1962లో ఉగాండాకు స్వాతంత్ర్యం రావడానికి ముందు అప్పటి ప్రైమ్ మినిష్టర్ కమ్ ప్రెసిడెంట్ మిల్టన్ ఒబొటెకు సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి కాంగో నుంచి బంగారం, ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేసేవారు. అయితే, తొందరలోనే ఇద్దరి మధ్యా విభేదాలు మొదలయ్యాయి.
ఇలాంటి సమయంలో 1971 జనవరి 25న ఒబొటె సింగపూర్‌లో ఒక మీటింగుకు వెళ్లగా అమీన్ సైనిక తిరుగుబాటు చేసి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. 1976లో ఆయన ఉగాండాను తానే శాశ్వత అధ్యక్షుడిగా ఉండేలా చట్టాలను మార్చుకున్నారు.
1971లో తిరుగుబాటు చేసి అధికారం చేపట్టిన తరువాత అమీన్ కిల్లర్ స్క్వాడ్స్ ఒబొటె మద్దతుదారులు లక్షలాది మందిని వెంటాడివేటాడి చంపేశాయి. వారంతా ఎక్కువగా అకోలీ, లాంగో తెగలకు చెందినవారే. సైన్యంలో ఒబోటెకు అనుకూలంగా ఉన్నవారు, ప్రజలను కూడా అమీన్ మనుషులు దారుణంగా చంపేశారు.
లాయర్లు, జర్నలిస్టులు, విద్యార్థులు, హోమో సెక్సువల్స్‌ను కూడా చంపించాడు అమీన్.
దారుణాతి దారుణంగా సుమారు 3 లక్షల మందిని చంపించిన అమీన్‌న్ ‘ఉగాండా కసాయి’ అంటారు. 
1976లో తానే స్వయంగా ఒక ఫ్రెంచ్ విమానాన్ని హైజాక్ చేశాడు అమీన్.

ఆసియా ప్రజలపై హఠాత్తుగా ఆగ్రహం

1972 ఆగస్టు 4న ఈదీ అమీన్‌ ఆ దేశంలో ఉన్న ఆసియా ప్రజల విషయంలో పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నాడు. 
ఉగాండాలోని టొరోరో నగరంలో తన సైనికాధికారులతో సమావేశమైన ఆయన అక్కడి ఆసియా ప్రజలందరినీ దేశం నుంచి వెంటనే పంపించివేయమని అల్లా తనను ఆదేశించాడని వారితో చెప్పారు.
అల్లా తనకు కలలో కనిపించి ఆ మాట చెప్పాడంటూ అమీన్ ఆదేశాలు జారీ చేశాడు.
ఆసియా ప్రజలు ఉగాండాను దోచుకోవాలని చూస్తున్నారు.. వారందరినీ 90 రోజుల్లో పంపించేయాలని సైనికాధికారులను ఆదేశించాడు.
నిజానికి 60 వేల మంది ఆసియా వాసులను అప్పటికప్పుడే దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడు అమీన్. ఆ తరువాత వారికి 90 రోజుల గడువు ఇచ్చాడు.
అయితే.. అమీన్ ప్రకటనను ఆసియా ప్రజలు మొదట పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ఆగ్రహంలో అలా అన్నాడు కానీ తరువాత సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ, వారం రోజుల్లోనే వారికి అర్థమైపోయింది. ఉగాండాను వదిలి వెంటనే వెళ్లకపోతే ప్రాణాలు దక్కవని.

ఆస్తులు కూడా వదిలేసి వెళ్లాలని ఆర్డర్స్

అమీన్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఆయన నిర్ణయం మార్చుకునేలా చేయడానికి బ్రిటన్ రంగంలోకి దిగింది. ఆ దేశ మంత్రిని ఉగాండా రాజధాని కంపాలకు పంపించింది. కానీ, అమీన్ ఆ మంత్రిని వారం రోజులు వెయిట్ చేయించాడు కానీ కలవలేదు. 
ఆ తరువాత కలిసినా బ్రిటన్ మాటను ఏమాత్రం లెక్క చేయలేదు.
భారత ప్రభుత్వం కూడా అక్కడి భారతీయులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా దౌత్యం చేయడానికి విదేశాంగ శాఖ అధికారులను పంపించింది. అందులో నిరంజన్ దేశాయ్ ప్రధానమైనవారు. 
ఆయన ఉగాండా వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయారు.
అక్కడి పరిస్థితులను ఆయన తరువాత వివిధ సందర్భాల్లో వెల్లడించారు.
ఆసియా ప్రజలకు తమతో 250 కేజీల సామాగ్రి, 55 పౌండ్ల డబ్బుమాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించారని.. మిగతాదంతా వదిలి వెళ్లాలని కఠినంగా చెప్పారని దేశాయ్ అప్పటి పరిస్థితులను చెప్పారు.

కొందరు డబ్బు ఖర్చు పెట్టేశారు.. కొందరు మళ్లీ రావొచ్చని బంగారం పాతిపెట్టారు
అమీన్ దెబ్బకు ఉగాండా వదిలివెళ్లక తప్పదని అర్థమైన ఆసియన్లు తమ డబ్బును కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. అమీన్ నిర్ణయాన్ని అమలు చేయడంలో అధికారులు విఫలం కావడంతో కొందరు తెలివిగా తమ డబ్బును దేశం దాటించగలిగారు. 
కొందరు తెలివిగా ప్రపంచమంతా తిరగడానికి మొత్తం కుటుంబానికి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కోని... మిస్లీయస్ చార్జ్ ఆర్డర్ల ద్వారా  ఈ బుకింగ్స్ చేశారు. ఉగాండా నుంచి బయటకు వెళ్లాక ఈ మిస్లీనియస్ చార్జ్ ఆర్డర్లను క్యాష్ చేసుకోగలిగారు.
మరికొందరు కార్లలో కార్పెట్ల కింద డబ్బు దాచి పొరుగు దేశం కెన్యా పారిపోయారు.
కొంతమంది పార్శిల్ ద్వారా తమ బంగారం స్వదేశాలకు పంపించేశారు.
మళ్లీ ఉగాండా రాగలమని ఆశ పెట్టుకున్నవారు తమ ఇళ్ల పెరళ్లో.. తోటల్లో బంగారాన్ని పాతి పెట్టారు.
కొందరు భారతీయులు అక్కడున్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో లాకర్లలో డబ్బు, బంగారం దాచి పదిహేనేల్ల తరువాత ఉగాండా వెళ్లి తమ డబ్బు తాము తీసుకోగలిగారు.

ఆసియన్ల సంపదను దోచుకున్నారు

చాలా మంది ఆసియా ప్రజలు తమ షాపులు, ఇళ్లు అలా ఉంచేసి వచ్చేశారు. ఇంట్లో సామాను  అమ్ముకునే చాన్సు కూడా వారికివ్వలేదు. 

తమతో పాటు బయటికి తీసుకెళ్లే సామాన్లను కకూడా ఉగాండా సైనికులు లాక్కున్నారని చాలామంది చెబుతారు.
ప్రజలు వదిలేసి వెళ్లిన సంపదను స్థానికులు కొందరు చేజిక్కించుకోగా మరికొంత సైనికాధికారులు, ప్రభుత్వంలో ఉన్నవారు దోచుకున్నారు.
సాధారణ ప్రజలకు దొరికింది తక్కువే.
ఆసియన్ల దుకాణాలు, హోటళ్లు, ఇల్లు, ఆస్తులను అమీన్ తన సైనికాధికారులకు ఇష్టమొచ్చినట్లు పంచిపెట్టారు.

నరరూప రాక్షసుడు

ఈడీ అమీన్‌కు నరరూప రాక్షసుడనే పేరు స్థిరపడిపోయింది. అతడి క్రూరత్వం గురించి ప్రపంచమంతా కథలు కథలుగా చెప్పుకునేవారు.
అమీన్ హయాంలో ఆరోగ్య మంత్రిగా ఉన్న హెన్రీ కెయెంబా 'ఎ స్టేట్ ఆఫ్ బ్లడ్: ద ఇన్‌సైడ్ స్టోరీ ఆఫ్ ఈదీ అమీన్' అనే ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన అమీన్ క్రూరత్వం గురించి రాశారు. అది చదివిన ప్రపంచం భయంతో వణికిపోయింది.

శత్రువులను చంపి మర్మాంగాలు తినేసేవాడు

ఈడీ అమీన్


ఈదీ అమీన్ తన శత్రువులను చంపడమే కాదు, వారు చనిపోయిన తర్వాత వారి శవాలను కూడా వదిలేవాడు కాడు. మార్చురీలో శవాలు తెరిచి ఉండేవని, వాటి మూత్రపిండాలు, కాలేయం, ముక్కు, పెదవులు, మర్మాంగాలు మాయమయ్యేవని ఉగాండా మెడికల్ ఉద్యోగులు ఎప్పుడూ చెప్పుకునేవారు. 
1974 జూన్‌లో ఫారిన్ సర్వీస్ అధికారి గాడ్‌ఫ్రీ కిగాలాను కాల్చి చంపినప్పుడు అతడి కళ్లు పీకి శవాన్ని కంపాలా బయట అడవుల్లో పడేశారు.
చనిపోయిన వ్యక్తుల మధ్య ఒంటరిగా గడపడం తనకు ఇష్టమని అమీన్ తన వద్ద పనిచేసేవారితో చెప్పేవాడు. 
1974 మార్చిలో కార్యనిర్వాహక సైన్యాధ్యక్షుడు బ్రిగేడియర్ చార్లెస్ అరూబే హత్య జరిగినపుడు, అమీన్ ఆయన శవాన్ని చూడడానికి ములాగో ఆస్పత్రిలోని మార్చురీకి కూడా వెళ్లాడు. 
శవంతోపాటూ తను అక్కడే కాసేపు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నానని.. అందరూ వెళ్లిపోవాలని అమీన్ ఆదేశించడంతో ఆసుపత్రి మొత్తం ఖాళీ చేస్తారు.
అమీన్ కాక్వా జాతి సంప్రదాయం ప్రకారం తన శత్రువు రక్తం తాగారని ఉగాండా ప్రజలు చెబుతారు. అమీన్ కూడా కాక్వా జాతికి చెందినవాడే.
మనిషి మాంసం తిన్నానని అమీన్ అనేకసార్లు చెప్పినట్లు ఆయన వద్ద పనిచేసేవారు తరువాత కాలంలో చెప్పారు.
1975 ఆగస్టులో అమీన్ కొంతమంది సీనియర్ అధికారులకు తన జయీర్ పర్యటన గురించి అమీన్ చెబుతూ.. అక్కడ తనకు కోతి మాంసం వడ్డించారని.. కానీ, అది మనిషి మాంసం అంత రుచిగా లేదని అమీన్ చెప్పారట.
అంతేకాదు.. యుద్ధ సమయంలో తిండి దొరక్కపోతే గాయపడిన తోటి సైనికులను చంపి తినేయమని కూడా అమీన్ చెప్పేవారట.

ఫ్రిజ్‌లో మనిషి తలలు

అమీన్ దగ్గర అప్పట్లో నౌకరుగా పనిచేసిన మోజెజ్ అలోగా, కెన్యా పారిపోయి వచ్చాక ఆయన గురించి ఒక కథ చెప్పారు. దానిని ఈ కాలంలో నమ్మాలంటే చాలా కష్టం.
అమీన్ పాత ఇంట్లోని కమాండ్ పోస్ట్‌లో ఒక గది ఎప్పుడూ మూసి ఉండేది, దాని లోపలికి వెళ్లడానికి అలోగాకు మాత్రమే అనుమతి ఉండేది. అలోగాను కూడా ఆ గదిని శుభ్రం చేయడానికి మాత్రమే వెళ్లనిచ్చేవారు.
అమీన్ ఐదో భార్య సారా క్యోలాబాకు ఆ గది గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉండేది. ఆమె అలోగాను ఆ గదిని తెరవమని చెప్పారు. అమీన్ చంపేస్తాడని చెప్పినా వినకుండా ఆమె ఒత్తిడి చేయడంతో అలోగా ఆ గది తాళం సారాకు ఇస్తాడు. 
ఆ గది లోపల ఉన్నరెండు ఫ్రిజ్‌లలో ఒక ఫ్రిజ్ తలుపు తెరిచిన ఆమె గట్టిగా అరిచి స్పృహతప్పి పడిపోయంది. అందులో ఆమె మాజీ ప్రియుడు జీజ్ గిటా తల కనిపిస్తుంది.
సారా ప్రియుడిలాగే, అమీన్ చాలా మంది మహిళల ప్రియుల తలలు కూడా నరికించారు. ఇండస్ట్రియల్ కోర్ట్ చీఫ్ మైకేల్ కబాలీ కాగ్వా ప్రియురాలు హెలన్ ఓగ్వాంగ్‌పై అమీన్ కన్నుపడడంతో, ఆయన బాడీగార్డ్స్ కంపాలా ఇంటర్నేషనల్ హోటల్లో స్విమ్మింగ్ పూల్లో ఉన్న కబాలీని కాల్చిచంపారు. తర్వాత హెలెన్‌ను పారిస్‌లో ఉన్న ఉగాండా రాయబార కార్యాలయంలో వేశారు. ఆమె అక్కడ్నుంచి పారిపోయి తప్పించుకుంది.
మకెరేరే యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్, తొరోరోలోని రాక్ హోటల్ మేనేజర్ భార్యలపై కూడా మనసుపడ్డ అమీన్ వారి భర్తలను పక్కా ప్లాన్ ప్రకారం చంపించారు.
అమీన్ ప్రియరాళ్ల సంఖ్యను లెక్కపెట్టడం కూడా కష్టం. ఒకప్పుడు ఆయన కనీసం 30 మంది మహిళలతో సంబంధాలు నడిపేవారని, వారికోసం ఆయన మొత్తం ఉగాండా తిరిగేవారని చెబుతారు. ఆ మహిళలు ఎక్కువగా హోటళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో నర్సులుగా పనిచేస్తూ ఉండేవారని చెబుతారు.

11 వేల మంది భారత్ వచ్చారు

మళ్లీ ఆసియన్లను పంపించేయడందగ్గరకు వస్తే... ఉగాండా నుంచి ఆసియా వాసులను తరిమేసిన తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది.
ఉత్పత్తుల లోటు ఊహించలేనంతగా పెరిగింది. హోటళ్లలో బ్రెడ్ లాంటివి కూడా దొంగిలించేవారు.
ఉగాండా నుంచి బయటపడ్డ 60 వేల మందిలో 29 వేల మంది బ్రిటన్ చేరారు. 
11 వేల మంది భారత్ వెళ్లారు. 5 వేల మంది కెనడాకు, మిగతా వారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు.
కట్టుబట్టలతో వచ్చిన వారందరినీ బ్రిటన్ రిటైల్ పరిశ్రమ ఆదుకుంది. బ్రిటన్‌లోని ప్రతి నగరంలో కూడళ్లలో పటేల్ దుకాణాలు తెరుచుకున్నాయి. వాళ్లు పాలు, వార్తా పత్రికలు అమ్మేవారు.
ఆరోజు ఉగాండా నుంచి బ్రిటన్ వెళ్లిన కుటుంబాలన్నీ ఇప్పుడు బాగా స్థిరపడ్డాయి. ప్రాణాలతో బయటపడ్డ ఆసియ వాసులు బ్రిటన్ సంస్కృతికి అలవాటు పడడంతోపాటు ఆ దేశ ఆర్థికాభివృద్ధిలో కూడా భాగమయ్యారు.

8 ఏళ్ల అమీన్ క్రూర పాలన ముగిసిందిలా..

8 ఏళ్లు పాలించిన ఈదీ అమీన్, తను ఎలా అధికారం చేజిక్కించుకున్నాడో, అలాగే అధికారం కోల్పోయాడు.
1971లో సైనిక తిరుగుబాటు చేసి అధికారంలోకొచ్చిన సంగతి తెలిసిందే.
1978లో పొరుగున ఉన్న టాంజేనియాపై దాడికి ఆదేశించాడు అమీన్. కొన్నాళ్లపాటు ఈ యుద్దంసాగింది. అయితే.. ఉగాండా నేషనలిస్టుల సహాయంతో టాంజేనియా ఆర్మీ ఈ దాడిని తిప్పికొట్టింది. 
అదే సమయంలో 1979లో అప్పటి ఉపాధ్యక్షుడు జనరల్ ముస్తఫా అద్రసీ తిరుగుబాటు చేశారు. మరోవైపు టాంజేనియా బలగాలు ఉగాండా రాజధాని కంపాలా వరకు వచ్చేశాయి.
దీంతో అమీన్ అక్కడి నుంచి పారిపోయి లిబియాలో తలదాచుకున్నాడు. 
అసలు లిబియా అధినేత కల్నల్ గడాఫీ స్ఫూర్తితోనే అమీన్ ఇదంతా చేశారని చెబుతారు.. గడాఫీ, అమీన్‌లు మంచి స్నేహితులు.
అలా లిబియా చేరుకున్న అమీన్ ఆ తరువాత సౌదీ అరేబియా పారిపోయి అక్కడే చరమాంకం గడిపాడు.
2003లో 78 ఏళ్ల వయసులో సౌదీలోని జెడ్డాలో కిడ్నీలు విఫలం, ఇతర అనారోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లి చనిపోయాడు.

20, మే 2020, బుధవారం

Amphan తుపానుకు అర్థమేంటి.. తుపాన్లకు పేరెలా పెడతారు? ఎవరు పెడతారు?



Amphan తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను భయం గుప్పిట నెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరకోస్తా ప్రాంతంలో సముద్రంలో అలు ఎగసిపడుతున్నాయి.
బుధవారం ఇది పశ్చిమబెంగాల్‌లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Amphan అనే పేరు ఎవరు పెట్టారు?

అంఫాన్ లేదా అంఫన్ అని అంతా దీన్ని పలుకుతున్నప్పటికీ దీన్ని పలికే విధానం మాత్రం వేరు. Amphan ను ఉమ్‌పున్(Um-pun) అని పలకాలి. 
ఇది థాయిలాండ్ దేశానికి చెందిన పదం.
Amphan అనే పేరును థాయిలాండ్ పెట్టింది 2004లోనే థాయిలాండ్ పెట్టిన పేరిది.  

Amphan అంటే ఏమిటి?

Amphan అంటే థాయ్ భాషలో ఆకాశం అని అర్థం.

తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు? ఎవరు నిర్ణయిస్తారు?
వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా పసిఫిక్... భారత్, బంగ్లాదేశ్, మియన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్‌లు సభ్య దేశాలుగా ఉన్న ఒక కూటమి కలిపి ఈ పేర్లను నిర్ణయిస్తాయి. 
కొన్ని పేర్లతో ఒక జాబితాను తయారుచేస్తాయి. 
2004లో ఇలా ఈ 8 దేశాలు ఒక్కో దేశం 8 చొప్పున పేర్లు నిర్ణయించి మొత్తం 64 పేర్లతో జాబితా రూపొందించాయి.
ఏటా వచ్చే తుపాన్లకు ఈ జాబితాలోని పేర్లను వరుసగా పెడుతుంటాయి.
అంఫాన్ తుపాను కంటే ముందు వచ్చిన తుపాను పేరు ఫొని(Fani).. బంగ్లాదేశ్ ఆ పేరు పెట్టింది.

Amphan చివరి పేరా?

అవును... 2004లో రూపొందించిన జాబితాలోని 64 పేర్లలో చిట్టచివరి పేరు Amphan. ఆ జాబితా ప్రకారం ఇదే చివరి పేరు.
అయితే, 2018లో వరల్డ్ మెటిరియలాజికల్ ఆర్గనైజేషన్ మొదట ఉన్న 8 దేశాలకు కూటమిలో మరో 5 దేశాలను చేర్చింది. అవి ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్.
వాటిని జోడించాక కూటమిలో మొత్తం 13 దేశలయ్యాయి.
దాంతో ప్రతి దేశం 13 చొప్పున 13 దేశాలు కలిపి 169 పేర్లతో కొత్త జాబితా రూపొందించారు.

కొత్త జాబితాలో ఉన్న తుపాను పేర్లేమిటి?

కొత్త జాబితా ప్రకారం 169 పేర్లున్నాయి.
అయితే.. అందులో మొదటిది నిసర్గ (Nisarga). బంగ్లాదేశ్ ఈ పేరు పెట్టింది.
దాని తరువాత గతి(Gati) భారత్ ప్రతిపాదించిన పేరిది.
ఆ తరువాత నివార్ (Nivar) అనేది ఇరాన్ పెట్టిన పేరు.
నెక్స్ట్ బురేవి (Burevi) అని మాల్దీవులు ప్రతిపాదించిన పేరు, తౌక్టే(Tauktae) అని మయన్మార్ ప్రతిపాదించిన పేరు ఉన్నాయి.

కొత్త జాబితాలో తొలి అయిదు పేర్లు

గతి(Gati)
నిసర్గ(Nisarga)
గతి(Gati)
నివార్(Nivar)
బురేవి(Burevi)
తౌక్టే(Tauktae)

ఇండియా పెట్టిన పేర్లేమిటి?

కొత్త జాబితాలో ఇండియా పెట్టిన పేర్లు కూడా 13 ఉన్నాయి.
Tej(తేజ్)
Murasu(మురసు)
Aag(ఆగ్)
Vyom(వ్యోమ్)
Jhar(ఝర్)
Probaho(ప్రొబాహో లేదా ప్రవాహ)
Neer(నీర్)
Prabhanjan(ప్రభంజన్)
Ghurni(ఘుర్ని)
Ambud(అంబుధ్)
Jaladhi(జలధి)
Vega(వేగ)

తుపాన్లకు అసలు పేర్లెందుకు పెడతారు?

ఒక్కో సముద్రంలో జనించే తుపాన్ల విషయంలో కన్ఫ్యూజన్ తగ్గించడానికి ఇలా పేర్లు పెట్టడం ప్రారంభించారు. 
ప్రతి మహాసముద్ర పరిధిలో ఏర్పడే తుపాన్లకు అక్కడి ప్రాంతీయ వాతావరణ కేంద్రాలు, ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్లు పేర్లు పెడుతుంటాయి.

తుఫాన్లకు పేర్లు పెట్టడానికి ఉన్న రూల్సేమిటి?

* తుపాన్లకు పెట్టే పేర్లకు రాజకీయాలతో సంబంధం ఉండకూదు.
* ఏ ఒక్క జెండర్‌నో , ఏ ఒక్క కల్చర్‌నో, ఏ ఒక్క మతాన్నో సూచించేలా ఉండకూడదు. వీటన్నిటికీ అతీతమైన పదం అయ్యుండాలి.
* ఎవరి సెంటిమెంట్లను బాధపెట్టేలా ఉండకూడదు.
* తీవ్రమైన, క్రూరమైన పదజాలం కాకూడదు.
* చిన్న పదాలు, సులభంగా పలికేవి అయ్యుండాలి.
* ఇంగ్లిష్‌లో 8 అక్షరాలు కంటే ఎక్కువ ఉండకూడదు.