లోతైన విశ్లేషణలు, ట్రెండింగ్ టాపిక్స్, రాజకీయాలు, సామాజిక అంశాలు అన్నిటిపైనా సమగ్ర కథనాలు అందించడమే మా ధ్యేయం.
30, జులై 2020, గురువారం
Shakuntala Devi : హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి మెదక్ నుంచి పోటీచేశారు తెలుసా
27, జులై 2020, సోమవారం
సోము వీర్రాజు: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
16, జులై 2020, గురువారం
ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా
బరాక్ ఒబామా, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజెస్ ట్విటర్ అకౌంట్లు హ్యాక్.. బిట్ కాయిన్ స్కామర్ల పనే
12, జులై 2020, ఆదివారం
ఐశ్వర్య రాయ్, ఆరాధ్యకు కరోనా.. మంత్రి ట్వీట్ అంతలోనే డిలీట్
11, జులై 2020, శనివారం
అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా.. చిరంజీవి ఏమని ట్వీట్ చేశారంటే..
10, జులై 2020, శుక్రవారం
వికాస్ దూబే ఎన్కౌంటర్
3, జులై 2020, శుక్రవారం
కరోనాకు వ్యాక్సిన్ మరో 40 రోజుల్లో వచ్చేస్తోంది
ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న కరోనా రోగానికి చెక్ చెప్పే వ్యాక్సిన్ తయారీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి.
దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడుతున్నాయి. ఇలాంటి వేళ.. మిగిలిన కంపెనీల కంటే ముందుగా తమ వ్యాక్సిన్ తొలుత బయటకు వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తోంది భారత్ బయోటెక్ కంపెనీ. మీడియా మొఘల్ రామోజీ కొడుకు కిరణ్ వియ్యంకుడికి చెందిన ఈ కంపెనీ వ్యాక్సిన్ తయారీలో కీలక అంకాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఈ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ ట్రయల్ రన్ కు కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్లినికల్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. మిగిలిన వారి కంటే ముందే.. మన దేశంలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ఈ కంపెనీ నమ్మకంగా చెబుతోంది. దీని ఆధారంగానే ఐసీఎంఆర్ ఆగస్టు 15 కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.
తాము అనుకున్నట్లు జరిగితే.. వ్యాక్సిన్ ను వచ్చే నెల పదిహేనో తేదీన ల్యాంచ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున వ్యాక్సిన్ కానీ విడుదల చేస్తే.. భావోద్వేగం పరంగానూ కలిసి వస్తుందన్న ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే.. ఏర్పాట్లు సాగుతున్నట్లు చెబుతున్నారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజునే.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి నుంచి స్వాతంత్య్రాన్ని పొందేలా వ్యాక్సిన్ వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగే.. ఈ వ్యాక్సిన్ కనెక్టు కావటమే కాదు.. ప్రపంచానికి గుదిబండలా మారిన మహమ్మారిని తరిమి.. తరిమి కొట్టొచ్చని చెప్పక తప్పదు.