బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను శనివారం రాత్రి ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేర్చారు.
అమితాబ్ బచ్చన్ కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
అమితాబే స్వయంగా ఈ విషయాన్ని ప్రజలకు వెల్లడించారు.
కాగా అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నాకు కోవిడ్ -19 టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో నన్ను ఆసుపత్రిలో చేర్చారు. నా కుటుంబ సభ్యులు, సిబ్బందికీ కరోనా పరీక్షలు జరిపారు. వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. గత పది రోజుల్లో నాకు సమీపంగా మెలిగినవారరు ఎవరైనా కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా అమితాబ్ కరోనా నుంచి కోలుకోవాలంటూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున సందేశాలు వస్తున్నాయి.
బాలీవుడ్ ఒక్కటే కాకుండా దేశంలోని అన్ని భాషల సినిమా పరిశ్రమకు చెందిన నటులు.. రాజకీయ నాయకులు, ఇతర రంగాల వారు అమితాబ్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
తెలుగు సినీరంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి