ఐశ్వర్య రాయ్‌కు కూడా కరోనా సోకిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె ప్రకటించారు.
శనివారం రాత్రి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లు కరోనాతో ఆసుపత్రిలో చేరగా కుటుంబ సబ్యులందరికీ టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో అమితాబ్ కోడలు, అభిషేక్ భార్య అయిన ఐశ్వర్య రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య అభిషేక్ బచ్చన్‌లకు కూడా కరోనా సోకినట్లు నిర్ధరణయింది.
కాగా జయా బచ్చన్‌కు టెస్ట్ రిజల్ట్ నెగటివ్ వచ్చిందని రాజేశ్ తోపె ట్వీట్ చేశారు.
అయితే కొద్దిసేపటికే రాజేశ్ తోపె ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
కానీ, అప్పటికే మంత్రి ట్వీట్ ఆధారంగా జాతీయ దినపత్రికల వెబ్‌సైట్లలో ఆ వార్త వచ్చేసింది.
హిందూస్తాన్ టైమ్స్, ఇండియా న్యూస్, ముంబయి నుంచి వెలువడే డీఎన్‌ఏ సహా పలు వార్తా వెబ్ సైట్లు ఈ వార్తను ప్రచురించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి