కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఉద్యోగాలకు దూరం చేసింది. కొత్త నియామకాలు లేకపోవడమే కాదు ఉన్న ఉద్యోగాలూ పోవడంతో ఎంతోమంది తాము అంతకుముందెన్నడూ చేయని పనులు చేస్తున్నారు.
చివరకు కొందరు వ్యభిచారం, ఆన్‌లైన్లో తమ నగ్న ఫొటోలను పెట్టడం వంటి పనులతో డబ్బు సంపాదించుకుంటున్నారు.
బ్రిటన్‌కు చెందిన మార్క్ అనే వ్యక్తీ ఇలాంటి పనే చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘‘నాకు ఇది తప్పదు. ఆదాయం కావాలి. నేను ఊరికే నా నగ్న ఫోటోలు తీసుకుని ఆన్‌లైన్‌లో పెట్టడం లేదు'' అంటున్నాడు మార్క్.
కరోనా వైరస్ కారణంగా మార్చి నెలలలో మార్క్ ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి తన సెమీ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
32 ఏళ్ల మార్క్ గతంలో ఓ ఫైవ్‌స్టార్ రిసార్ట్ కంపెనీలో షోలు నిర్వహించేవాడు. లాక్‌డౌన్‌తో ఆయన కాంట్రాక్టు రద్దయి ఉద్యోగం పోయింది. ‘‘ జాబ్‌సెంటర్ వెబ్‌సైట్‌లో షాప్‌కీపర్ పోస్టు దగ్గర్నుంచి కనిపించిన ప్రతి జాబ్‌కు నేను అప్లికేషన్లు పెట్టాను'' అని చెప్పారు మార్క్.
ఒక మిత్రుడి సలహాతో ఓన్లీఫ్యాన్స్‌లో ఒక అకౌంట్ ఓపెన్ చేశారాయన. దీన్ని ఫాలో అయ్యే సబ్‌స్క్రైబర్లు నెలనెలా కొంత ఫీజు చెల్లించి ఈ అకౌంట్ సృష్టికర్త పెట్టే ఫోటోలు, వీడియోలు, లైవ్ స్ట్రీమ్‌లను వీక్షించవచ్చు. ఇందులో పోస్టులు పెట్టేవారి నుంచి ఈ వెబ్‌సైట్ 20శాతం కమీషన్ తీసుకుంటుంది.
పూర్తి నగ్నచిత్రాలు ఉండవంటూ ప్రొఫైల్‌లో రాసినప్పటికీ ఆయన చిత్రాలు అమ్ముడు పోవడం మొదలు పెట్టాయి. గత నాలుగు నెలలుగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా నెలకు 1500 యూరోలు సంపాదిస్తున్నానని చెబుతున్నాడు మార్క్.
"ఓన్లీఫ్యాన్స్ సైట్ నా ఇంటి రెంట్‌ను చెల్లిస్తోంది. నా తిండి ఖర్చులు, నా కారు ఖర్చులు చెల్లిస్తోంది. నాకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తోంది'' అని చెబుతున్నాడు మార్క్.
"దీనికి నెగెటివ్ కోణం కూడా ఉంది. దీన్ని ప్రారంభించిన కొత్తల్లో నా స్నేహితులు నన్ను తిడుతూ కామెంట్లు పెట్టారు'' అని చెప్పారు మార్క్.
"ఇది ఆత్మను అమ్ముకోవడంలాంటిది'' అని నా స్నేహితులు విమర్శించారు. నేను అందరితో సెక్స్‌లో పాల్గొంటు, వాటిని రికార్డు చేసి పోస్ట్ చేస్తానని ఊహించుకున్నారు. కానీ ఇది అలాంటిది కాదు. నా పేజ్‌లో అలాంటివి ఉండవు'' అన్నారాయన.
శృంగార కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయమని చాలామంది అడిగారని కాను తాను తిరిస్కరించానని చెబుతున్నాడు మార్క్.
ఇక స్కాట్లాండ్‌లో క్రాఫ్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ యువతి కూడా ఉద్యోగం పోవడంతో ఇలాంటి పనే చేస్తోంది.
ఓన్లీఫ్యాన్స్ సైట్‌లో ఎకౌంట్ ఓపెన్ చేసిన ఆమె, తన తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లినప్పుడు తన ఫోటోషూట్ ప్రారంభిస్తారు. వీటిని సబ్‌స్క్రైబర్లకు అమ్ముకోవడం ద్వారా ఆమె నెలకు సుమారు 5.55 యూరోలు సంపాదిస్తోంది.
ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి