Vikas Dubey Most Wanted Criminal Encounter
వికాస్ దూబే.. తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపి 8 మంది పోలీసుల మృతికి కారణమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్. ఆ వికాస్ దూబేను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో బుధవారం వికాస్ దూబేను అరెస్ట్ చేశారు.
అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ తీసుకెళ్తుండగా తప్పించుకునేందుకు ప్రయత్నించిన వికాస్ దూబే పోలీసు కాల్పుల్లో మరణించినట్లు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉజ్జయిని నుంచి రోడ్డు మార్గంలో కాన్పూర్ తీసుకెళ్తుండగా కారు పల్టీ కొట్టిందని.. దాంతో వికాస్ దూబే తమ వద్ద ఉన్న పిస్టల్ లాక్కుని కాల్పులు జరపడంతో తిరిగి కాల్చామని.. ఆ కాల్పుల్లో దూబే చనిపోయాడని పోలీసులు చెప్పారు.
కాగా నిన్న బుధవారం వికాస్ దూబేను అరెస్ట్ చేయగా అంతకుముందు రోజు ఆయన అనుచరులు ఇద్దరిని అరెస్టు చేశారు.
వారిని కాన్పూర్ తెస్తున్న సమయంలోనూ బుధవారం వారిని ఎన్‌కౌంటర్ చేశారు.
కాగా యోగి ఆదిత్యనాథ్ పాలనలో యూపీలో పెద్ద సంఖ్యలో రౌడీ షీటర్లను ఎన్‌కౌంటర్ చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి