లోతైన విశ్లేషణలు, ట్రెండింగ్ టాపిక్స్, రాజకీయాలు, సామాజిక అంశాలు అన్నిటిపైనా సమగ్ర కథనాలు అందించడమే మా ధ్యేయం.
24, సెప్టెంబర్ 2020, గురువారం
17, సెప్టెంబర్ 2020, గురువారం
అమిత్ షా నుంచి నితిన్ గడ్కరీ వరకు.. కోవిడ్ బారిన పడిన కేంద్ర మంత్రులు వీరే
కరోనావైరస్ భారత్‌లో ఎవరినీ విడిచిపెట్టడం లేదు. సాధారణ ప్రజల నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు.
తాజాగా కేంద్ర సాంస్కృతిక, పర్యటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధరణైంది.
ఇందుకు ఒక రోజు ముందు బుధవారం(సెప్టెంబరు 16న) మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కరోనావైరస్ బారిన పడ్డారు.
మోదీ మంత్రివర్గంలో కోవిడ్ బారిన పడిన తొలి మంత్రి హోం మంత్రి అమిత్ షా. 55 ఏళ్ల అమిత్ షాకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్ నిర్ధరణైంది. గుర్‌గావ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొంది రెండు వారాల తరువాత డిశ్చార్జయ్యారు.
అయితే, కొద్దిరోజలు తరువాత మళ్లీ అనారోగ్యంగా ఉండడంతో ఆగస్టు 18న దిల్లీ ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జయ్యారు.
అనంతరం కొద్దిరోజులకే అంటే సెప్టెంబరు 13న మళ్లీ ఆయన ఎయిమ్స్‌లో చేరారు. గురువారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు... సోమవారం నుంచి పార్లమెంటుకు హాజరవుతారని చెబుతున్నారు.
వీరే కాకుండా మరికొందరు కేంద్ర మంత్రులూ కోవిడ్ బారిన పడ్డారు.
కోవిడ్ బారిన పడిన కేంద్రమంత్రులు వీరే
1) ప్రహ్లాద్ పటేల్ - సాంస్కృతిక, పర్యటక మంత్రి
2) ధర్మేంద్ర ప్రధాన్ - పెట్రోలియం, సహజవాయు మంత్రి. ఆగస్టు 4న ఈయనకు కోవిడ్ నిర్ధరణైంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా అమిత్ షా చికిత్స పొందిన మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స పొందారు.
3) అర్జున్ రామ్ మేఘ్వాల్ - పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి. ఆగస్టు 9న ఈయనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.
జులైలో మేఘ్వాల్ ఒక రకం అప్పడాలు తింటే ఇమ్యూనిటీ పెరిగి కరోనా రాదని చెప్పిన కొద్దిరోజులకే దాని బారినపడ్డారు.
4) గజేంద్ర సింగ్ షెకావత్ - కేంద్ర జలవనరుల మంత్రి. ఆగస్టు 20న కరోనా బారినపడ్డారు.
5) శ్రీపాద యశోనాయక్ - ఆయుష్ శాఖ మంత్రి. ఆగస్ట్ 13న కరోనా బారినపడ్డారు.
6) కైలాశ్ చౌదరి- వ్యవసాయ శాఖ సహాయ మంత్రి.. ఆగస్టు 8న కరోనాబారినపడ్డారు.
7) అమిత్ షా - హోం మంత్రి
8) నితిన్ గడ్కరీ - ఉపరితల రవాణా మంత్రి
14, సెప్టెంబర్ 2020, సోమవారం
12, సెప్టెంబర్ 2020, శనివారం
రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో బయటపెట్టిన రియా చక్రవర్తి? తెలుగు సినీ, రాజకీయ స్నేహితుల పేర్లూ బయటకొస్తాయా
11, సెప్టెంబర్ 2020, శుక్రవారం
అయినా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ?
సుమారు 45 ఏళ్లుంటాయి ఆమెకు. బాగా సిగ్గు పడుతోంది.. అంతకుమించి భయపడుతోంది.
అన్ని రకాల కేసులు వస్తుంటాయి కాబట్టి డాక్టరుకు ఇలాంటివి కొత్తేమీ కావు. ఆమెలో కనిపిస్తున్న సిగ్గు, భయం రెండింటినీ చూసినప్పటికీ ఏమీ తెలియనట్లే పోయి బెడ్ మీద పడుకోమని చెప్పారు డాక్టర్.
తనిఖీ చేశాక.. గర్భం ఉందని చెప్పింది డాక్టర్.
అంతే.. అంతవరకు కనిపించిన భయం ఏకంగా ఏడుపుగా మారిపోయింది.. వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టిందామె.
మా ఆయనకు తెలిస్తే ఏమంటాడో ఏమో? అంటూ ఏడుస్తోంది.
అదేంటమ్మా.. అలా అంటావు.. గర్భం వద్దనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ, ఇంతవరకు వచ్చాక ఇప్పుడు ఏడిస్తే ఎలా? అన్నారు డాక్టర్.
ఎంతమంది పిల్లలు? అడిగారు డాక్టర్.
ఇద్దరండీ.. చెప్పిందామె.
ఎంత వయసు?
పెద్దోడు డిగ్రీ అయిపోయింది పాప ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చెప్పిందామె.
అంత పెద్ద పిల్లలున్న తరువాత ఇప్పుడు మళ్లీ కడుపంటే అందరూ ఏమనుకుంటారో ఏమో? పైగా మా ఆయన కూడా ఊరుకోడు అంటూ మళ్లీ ఏడుపు లంఖించుకుంది.
బయట ఒకరిద్దరు పేషెంట్లే ఉండడంతో కాస్త ఆమెకు కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించుకుంది డాక్టర్.
మరి గర్భం వద్దనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి కదమ్మా.. అంది డాక్టర్.
జాగ్రత్తలు తీసుకున్నామండీ.. అయినా ఎలా వచ్చిందో తెలీడం లేదు.. చెప్పిందామె.
బహుశా నిరోధ్ ఫెయిలై ఉంటుంది అంది డాక్టర్.
నిరోధ్ వాడలేదండీ.. మా ఆయనకు నచ్చదు.. చెప్పిందామె.
అయితే, మాత్రలు వాడారా?
ఊహూ...
మరైతే ఇంకేంటి.. లూప్ కూడా లేదు కదా? డాక్టరు ఆమె వంక చూస్తూ అడిగింది.
ఆమె సమాధానం చెప్పలేదు.. సిగ్గుపడిపోతోంది.
ఇంకేం జాగ్రత్తలు తీసుకున్నారమ్మా.. ఇవేం కాకుండా.. డాక్టరు రెట్టించింది.
అదేనండీ.. ఆయన జాగ్రత్తపడతారు చెప్పిందామె.
ఆయన జాగ్రత్తపడడమంటే నిరోధ్ వాడడమే కదా.. మరి వాడలేదంటున్నారు కదా.. డాక్టరు అడిగింది.
నిరోధ్ వాడకపోయినా జాగ్రత్త తీసుకుంటారండీ..
అదెలా? డాక్టర్ అడిగింది.
ఆ టైంకి.. అని సిగ్గుపడిపోతుందామె.
ఓహో... ఆ టైంకి బయటకు తీసేస్తారా?
అవునన్నట్లుగా తలూపిందామె.
దాన్ని జాగ్రత్త అనరమ్మా... అది అజాగ్రత్త. ఆ అజాగ్రత్త వల్లే నీకిప్పుడు కడుపొచ్చింది... చెప్పింది డాక్టర్.
అవునా అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసిందామె..
డాక్టరుకు విషయం అర్థమైంది.. ఆమె ఒక్కరికే కౌన్సెలింగ్ చేస్తే చాలదని అర్థమై రిసెప్షన్లో కూర్చున్న ఆమె భర్తను కూడా పిలిచింది.
మీ ఆవిడకు ప్రెగ్నెన్సీ ఉందండీ.. చెప్పింది డాక్టర్.
భర్త ఏమీ మాట్లాడలేదు.. తన భార్యవైపు కొరకొరా చూస్తున్నాడు అక్కడే.
మీరలా చూడనవసరం లేదు.. జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వయసులోనైనా గర్భం వస్తుంది.. అన్నది డాక్టర్.
జాగ్రత్తలు తీసుకున్నామండీ ఎందుకు తీసుకోలేదు.. అచ్చం తన భార్య చెప్పినట్లే చెప్పాడాయనే.
మీరు తీసుకున్న జాగ్రత్తేమిటో ఆవిడ చెప్పారు.. దాన్ని జాగ్రత్త అనరు. అజాగ్రత్త అంటారు అంది డాక్టర్.
నిరోధ్, పిల్స్, కాపర్ టీ లాంటి సంతాన నిరోధక పద్ధతుల్లోనే ఫెయిల్యూర్లు ఉంటాయి.. అలాంటి మీరు పాటించే ఈ విధానంలో ఇంకా ఎక్కువ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఉంటుంది.
గర్భ నిరోధక మాత్రలు వాడే వెయ్యి మందిలో ఒకరికి ఫెయిల్ అయితే, మీరు పాటించే ఈ విత్ డ్రా పద్ధతిలో 20 శాతం ఫెయిల్యూర్ ఉంటుంది.. డాక్టరు చెప్పింది.
వీర్యం బయటే ఉండిపోతే గర్భం ఎలా వస్తుంది.. అడిగాడాయన.
వీర్యం బయటే ఉండిపోతుందని మీరనుకుంటారు కానీ స్ఖలనానికి ముందు కొన్ని ద్రవాలు విడుదలవుతాయి.. అందులోనూ కొన్ని శుక్రకణాలుంటాయి.. అవి గర్భాశయంలోకి చేరితే గర్భం వస్తుంది. మీకు ఇలాగే జరిగింది.. డాక్టరు వివరించి చెప్పింది.
భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
ముఖాలు చూసుకుని ఇప్పుడేం చేయలేరు.. ఆర్థికంగా స్థిరంగానే ఉన్నారు కదా.. ఏం ఫరవాలేదు.. మీ పిల్లలు పెద్దోళ్లయినా ఇప్పుడీ బేబీని కనండి అని చెప్పి పంపించింది డాక్టర్.
Read Also:
10, సెప్టెంబర్ 2020, గురువారం
అంతర్వేది: ఫస్ట్ టైం.. హిందూ ఓట్ బ్యాంక్ దిశగా ఏపీ
పైగా గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో పాలనాపరమైన, రాజకీయపరమైన మార్పులు వచ్చాక జన్మతః హిందూ నాయకులు, వారి అనుయాయులు, హిందూ అధికారులుగా ఉన్నవారు కూడా ఎంతోమంది కెరీర్ ఎదుగుదల కోణంలో ఇతర మతాలను పులుముకొంటున్నారు.
ఇంతకీ.. ఇదంతా చెప్పడం ఎందుకంటే.. బీజేపీ.. అంటే భారతీయ జనతా పార్టీ.. దానికి ఆంధ్రప్రదేశ్‌లో గల అవకాశాల గురించి మాట్లాడడానికి. అవును.. అదే రీజన్.
టార్గెట్ 2029 నుంచి 2024కి..
ఏపీలో బీజేపీలో బలపడడానికి కానీ.. కలో, కల్పనో ఆ పార్టీ నాయకులు అప్పుడప్పుడు చెప్పే అధికారంలోకి రావడం గురించి మాట్లాడడానికి ప్రధానమైన డిస్కషన్ పాయింట్ ఈ మతాల, జనాభాలో శాతాల లెక్క. అంతకుమించి ఈ లెక్కలకు వేరే కారణాలేవీ లేవు.
బీజేపీ 2024లో ఏపీలో అధికారంలోకి వస్తుంది అని చెబితే పకపకా నవ్వి పిచ్చోడిని చూసినట్లు చూసేవారు చాలామంది ఉంటారు. కానీ, అలా నవ్వేవారే పిచ్చోళ్లనుకోవాలి. అవును.. నిజమే. 2024 అనేది కాస్త అతిశయం అనుకున్నా 2029 మాత్రం అతిశయం ఏమీ కాదు. 2029 నాటికి ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. అందుకు బలమైన కారణాలున్నాయి. ఆ బలమైన కారణాల్లో ఒకటి ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం. ఈ ప్రభుత్వ కాలంలో క్రైస్తవ మతం అనేక ఇతర ముసుగుల్లో ఉంటూ హిందూత్వపై దాడులకు తెగబడుతుండడం.
ఇటీవల ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలే అందుకు ఉదాహరణ. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో రథం కాలిపోవడం, తాజాగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం కాలిపోవడం.
అంతర్వేది ఘటన తరువాత బీజేపీ కాస్త గట్టిగానే స్పందించింది. కానీ, పార్టీ సిద్ధాంతంలో ఉన్న దూకుడు, స్పష్టత ఏపీ బీజేపీ నాయకుల్లో లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకో ఏపీ బీజేపీ వీరత్వం ప్రదర్శించడం లేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
అంతోఇంతో చూపుతున్నట్లు అనిపిస్తున్నా అది కూడా ఇప్పుడు జరుగుతున్నదంతా వదిలేసి గత ప్రభుత్వంపై చూపుతున్న వీరత్వమే.
నేషనల్ చాంపియన్లను చూసి నేర్చుకోరా?
రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. చిన్నచితకా పార్టీల నుంచి ఈ దేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన ముసలి పార్టీల వరకు అన్నీ నిత్యం రాళ్లు విసురుతున్నా... సూడో మేధావులు సూదులతో పొడుస్తున్నా జాతీయ స్థాయిలో బీజేపీ మాత్రం దినదిన ప్రవర్థమానమవుతోంది.
అందుకు కారణం సుస్పష్టం. ఇప్పుడు దేశంలో దుమ్ము రేపుతున్నది ఒకప్పటి బీజేపీ కాదు.. మోదీ-అమిత్ షా ద్వయం నేతృత్వంలో ఉరకలేస్తున్న బీజేపీ. కాకపోతే.. ఉత్తరాదిని పూర్తిగా సోలిడ్ చేసుకోవడానికి, కాస్త బలంగా ఉన్న రాష్ట్రాలు, అవకాశాలు మెరుగ్గా ఉన్న రాష్ట్రాలను ముందుగా తమ పరం చేసుకోవడానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండడం... కోవిడ్ కారణంగా రాజకీయాలు చేయడం ఇష్టం లేకపోవడం వంటి కారణాల వల్ల మోదీ-షాల నేతృత్వంలోని బీజేపీ ఇంకా ఏపీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు.
ఏపీపై ఇప్పుడే కనుక మోదీ-షా దృష్టిపెడితే వారి టార్గెట్ 2024 అవుతుంది. దేశ, ప్రపంచ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం.. మోదీ, షాలకు ఇతర ప్రాథామ్యాలు ఉండడం వల్ల ఏపీ, అందులోని వైసీపీ ప్రభుత్వం బతికిపోయిందనే చెప్పొచ్చు. లేదంటే అంతర్వేది రథం దహనం వంటి ఘటనలు జరుగుతున్న సమయంలో బీజేపీ అధిష్ఠానం వైఖరి ఇంత ఈజీగా ఉండదనే చెప్పాలి.
ఏపీ బీజేపీ పెద్దలు, ఏపీ బీజేపీలోని ఇతర కొందరు నాయకులు వైసీపీకి అనుకూలంగా ఉన్నా కేంద్రం చూస్తూ ఊరుకుంటుందంటే అందుకు కారణం రాజకీయాలు చేసే టైం కాదని బీజేపీ దిల్లీ పెద్దలు భావిస్తుండడమే.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ను వైసీపీ బంగారు పళ్లెంలో బీజేపీకి బహుకరించినట్లే.
దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో కులమే ప్రధానమైనప్పటికీ ఇలాంటి ఘటనను జరుగుతుంటే మతమూ ఎన్నికల్లో ఓట్లేయడానికి ప్రధానాంశంగా మారుతుంది. అప్పుడు ఏపీలాంటి రాష్ట్రంలో రాజకీయ పార్టీలవారీగా భావజాలాలున్న ప్రధాన సామాజికవర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే తేడా లేకుండా హిందూ ఓట్ బ్యాంక్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఏపీలో తొలిసారి అలాంటి పరిస్థితులకు దారులు కనిపిస్తున్నాయి.
Read Our Exclusives:
- Big boss4: యూట్యూబ్ గంగవ్వ ఇప్పుడు బిగ్‌బాస్ గంగవ్వ
- పబ్జీ సహా 118 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన భారత్
- ప్రణబ్ ముఖర్జీ: కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు బలైపోయి ప్రధాని కాలేకపోయిన గొప్ప నేత
- చైనా, భారత్ ఘర్షణ: మళ్లీ ఆక్రమణలకు తెగబడిన చైనా.. తిప్పికొట్టిన భారత్
- లాక్డౌన్: ముంబయి ప్రజలపై ఒత్తిడి విపరీతం.. చెన్నైలో కొంత నయం.. విద్యార్థులకు సంతోషం తగ్గిపోయింది.. ప్రజలకు నిద్ర పట్టలేదు
- ఈడీ అమీన్: శత్రువుల రక్తం తాగి, మర్మావయవాలనూ తినేసిన నియంత.. ఆయన దారుణాలు చదివితేనే వణుకు పుడుతుంది
- కరోనా వైరస్ 15 లక్షణాలు ఇవే
6, సెప్టెంబర్ 2020, ఆదివారం
Big boss4: యూట్యూబ్ గంగవ్వ ఇప్పుడు బిగ్‌బాస్ గంగవ్వ
గంగవ్వ.. తెలుగు రాష్ట్రాల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న చాలామందికి తెలిసిన పేరది. ఇప్పుడు టీవీ ఉన్న అందరికీ తెలిసే టైమొచ్చేసింది. అవును.. గంగవ్వ టాలెంట్ అలాంటిది.
టెక్నాలజీ తెలియకపోయితే తన సింపుల్ స్టైల్‌తో యూట్యూబ్‌లో పాపులర్ అయిన గంగవ్వ ఇప్పుడు మొబైల్ స్క్రీన్ నుంచి టీవీ స్క్రీన్‌కు వచ్చేశారు. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు.
గంగవ్వ పూర్తి పేరు మిల్కూరి గంగవ్వ. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి ఆమె స్వగ్రామం. ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లు ఉన్న గంగవ్వ వయసెంతో ఎవరికీ కచ్చితంగా తెలియదు. బర్త్ రికార్డులు వంటివి ఏమీ లేకపోవడమే దానికి కారణం.
‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్ వీడియోల్లో ఆమె కనిపిస్తారు. 2012లో ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్ ఈ చానల్ ప్రారంభించారు. సినిమా రంగంలో అనుభవం ఉన్న శ్రీకాంత్ 9 మంది టీంతో కలిసి ఈ చానల్‌కు వీడియోలు చేస్తూ తన అత్తగారైన గంగవ్వను అందులో భాగస్వామిని చేశారు. క్రమంగా ఆమె వీడియోలకు పాపులారిటీ పెరగడంతో ఆ చానల్‌కు ఇప్పుడు మిలియన్లలో ఫాలోవర్లు వచ్చారు.
గ్రామీణ జీవితాలు, సంస్కృతిపై వీరు వీడియోలు చేస్తారు.
2012లోనే మై విలేజ్ షో చానల్ మొదలైనా పెద్దగా పాపులర్ కాలేదు. 2017 నుంచి ఆ చానల్ వీడియోల్లో గంగవ్వ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేవారు. వాటికి మాంచి స్పందన రావడంతో ఎక్కువ వీడియోల్లో ఆమెను ఇన్వాల్వ్ చేసేవారు. దాంతో ఆ చానల్, గంగవ్వ ఇద్దరూ ఫేమస్ అయ్యారు.
అత్యంత సహజమైన నటనే గంగవ్వను యూట్యూబ్ స్టార్‌ను చేసింది.
‘‘నాకు చదువు రాదు.. ఈ ఫోన్లు, కెమేరాలు ఏవీ తెలిసేవి కాదు.. నా మాట తీరే జనానికి నచ్చినట్లుంది’’ అంటారు గంగవ్వ.
గంగవ్వ యూట్యూబ్ స్టార్ కావడానికి ముందు పొలం పనులు చేసుకునేవారు. బీడీలు చుట్టేవారు.
యూట్యూబ్‌లోనే కాదు గంగవ్వకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పాపులారిటీ ఉంది. ఆమెకు ఇన్‌స్టాలో 50 వేల మందికి పైగా ఫాలోవర్లున్నారు.
ఈ పాపులారిటీయే ఆమెను సినిమాల్లో నటించేలా చేసింది. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం వంటి సినిమాల్లో ఆమె నటించారు.
ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 4లో ఆమె కూడా ఒక కంటెస్టెంట్ కావడంతో ఆమె స్టార్‌డమ్ మరింత పెరిగింది.
3, సెప్టెంబర్ 2020, గురువారం
నరేంద్ర మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్, యాప్‌కు చెందిన ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ట్విటర్ ప్రకటించింది.