27, జులై 2020, సోమవారం

సోము వీర్రాజు: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు

సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం రాత్రి ఈ మేరకు నియామకం చేపట్టగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పేరిట ప్రకటన వెలువడింది.
సోము వీర్రాజు నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆ నియామక పత్రంలో పేర్కొన్నారు.
వీర్రాజు ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ, సోము వీర్రాజు

సోము వీర్రాజుది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కత్తెరు గ్రామం. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన మొదటి నుంచి బీజేపీ భావజాలంతో పార్టీలో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. భారతీయ యువమోర్చా రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు.

16, జులై 2020, గురువారం

ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా

ఆన్‌లైన్‌లో సెమీ న్యూడ్ చిత్రాలు

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఉద్యోగాలకు దూరం చేసింది. కొత్త నియామకాలు లేకపోవడమే కాదు ఉన్న ఉద్యోగాలూ పోవడంతో ఎంతోమంది తాము అంతకుముందెన్నడూ చేయని పనులు చేస్తున్నారు.
చివరకు కొందరు వ్యభిచారం, ఆన్‌లైన్లో తమ నగ్న ఫొటోలను పెట్టడం వంటి పనులతో డబ్బు సంపాదించుకుంటున్నారు.
బ్రిటన్‌కు చెందిన మార్క్ అనే వ్యక్తీ ఇలాంటి పనే చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘‘నాకు ఇది తప్పదు. ఆదాయం కావాలి. నేను ఊరికే నా నగ్న ఫోటోలు తీసుకుని ఆన్‌లైన్‌లో పెట్టడం లేదు'' అంటున్నాడు మార్క్. 
మార్క్
కరోనా వైరస్‌ కారణంగా మార్చి నెలలలో మార్క్‌ ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి తన సెమీ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
32 ఏళ్ల మార్క్‌ గతంలో ఓ ఫైవ్‌స్టార్‌ రిసార్ట్ కంపెనీలో షోలు నిర్వహించేవాడు. లాక్‌డౌన్‌తో ఆయన కాంట్రాక్టు రద్దయి ఉద్యోగం పోయింది. ‘‘ జాబ్‌సెంటర్‌ వెబ్‌సైట్‌లో షాప్‌కీపర్‌ పోస్టు దగ్గర్నుంచి కనిపించిన ప్రతి జాబ్‌కు నేను అప్లికేషన్లు పెట్టాను'' అని చెప్పారు మార్క్‌.
ఒక మిత్రుడి సలహాతో ఓన్లీఫ్యాన్స్‌లో ఒక అకౌంట్‌ ఓపెన్ చేశారాయన. దీన్ని ఫాలో అయ్యే సబ్‌స్క్రైబర్లు నెలనెలా కొంత ఫీజు చెల్లించి ఈ అకౌంట్‌ సృష్టికర్త పెట్టే ఫోటోలు, వీడియోలు, లైవ్‌ స్ట్రీమ్‌లను వీక్షించవచ్చు. ఇందులో పోస్టులు పెట్టేవారి నుంచి ఈ వెబ్‌సైట్‌ 20శాతం కమీషన్‌ తీసుకుంటుంది.
పూర్తి నగ్నచిత్రాలు ఉండవంటూ ప్రొఫైల్‌లో రాసినప్పటికీ ఆయన చిత్రాలు అమ్ముడు పోవడం మొదలు పెట్టాయి. గత నాలుగు నెలలుగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా నెలకు 1500 యూరోలు సంపాదిస్తున్నానని చెబుతున్నాడు మార్క్.
"ఓన్లీఫ్యాన్స్‌ సైట్‌ నా ఇంటి రెంట్‌ను చెల్లిస్తోంది. నా తిండి ఖర్చులు, నా కారు ఖర్చులు చెల్లిస్తోంది. నాకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తోంది'' అని చెబుతున్నాడు మార్క్‌.
"దీనికి నెగెటివ్‌ కోణం కూడా ఉంది. దీన్ని ప్రారంభించిన కొత్తల్లో నా స్నేహితులు నన్ను తిడుతూ కామెంట్లు పెట్టారు'' అని చెప్పారు మార్క్‌.
"ఇది ఆత్మను అమ్ముకోవడంలాంటిది'' అని నా స్నేహితులు విమర్శించారు. నేను అందరితో సెక్స్‌లో పాల్గొంటు, వాటిని రికార్డు చేసి పోస్ట్ చేస్తానని ఊహించుకున్నారు. కానీ ఇది అలాంటిది కాదు. నా పేజ్‌లో అలాంటివి ఉండవు'' అన్నారాయన.
శృంగార కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేయమని చాలామంది అడిగారని కాను తాను తిరిస్కరించానని చెబుతున్నాడు మార్క్.

ఇక స్కాట్లాండ్‌లో క్రాఫ్ట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ యువతి కూడా ఉద్యోగం పోవడంతో ఇలాంటి పనే చేస్తోంది.
ఓన్లీఫ్యాన్స్‌ సైట్‌లో ఎకౌంట్‌ ఓపెన్‌ చేసిన ఆమె, తన తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లినప్పుడు తన ఫోటోషూట్‌ ప్రారంభిస్తారు. వీటిని సబ్‌స్క్రైబర్లకు అమ్ముకోవడం ద్వారా ఆమె నెలకు సుమారు 5.55 యూరోలు సంపాదిస్తోంది. 
ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

బరాక్ ఒబామా, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజెస్ ట్విటర్ అకౌంట్లు హ్యాక్.. బిట్ కాయిన్ స్కామర్ల పనే

బరాక్ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ఉపాధ్యాక్షుడు జో బిడెన్ సహా కొందరు హై ప్రొఫైల్ వ్యక్తుల ట్విటర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. 
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఉబర్, యాపిల్ ట్విటర్ అకౌంట్లూ హ్యాకయ్యాయి.
బిట్ కాయిన్ అడ్రస్ ఒకటి ఇచ్చి దానికి వెయ్యి డాలర్లు పంపితే తిరిగి 2 వేల డాలర్లు పంపుతామంటూ హ్యాక్ అయిన ట్విటర్ అకౌంట్ల నుంచి ట్వీట్లు వచ్చాయి.
దీంతో ప్రపంచవ్యాప్తంగా గందరగోళం ఏర్పడింది.
ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ దీనిపై స్పందించారు.. ఏం జరిగిందో తెలుసుకుంటున్నామని.. తెలియగానే వెల్లడిస్తామని ట్వీట్ చేశారు.

12, జులై 2020, ఆదివారం

ఐశ్వర్య రాయ్‌, ఆరాధ్యకు కరోనా.. మంత్రి ట్వీట్ అంతలోనే డిలీట్

ఐశ్వర్య రాయ్, ఆరాధ్య

ఐశ్వర్య రాయ్‌కు కూడా కరోనా సోకిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె ప్రకటించారు.
శనివారం రాత్రి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లు కరోనాతో ఆసుపత్రిలో చేరగా కుటుంబ సబ్యులందరికీ టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో అమితాబ్ కోడలు, అభిషేక్ భార్య అయిన ఐశ్వర్య రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య అభిషేక్ బచ్చన్‌లకు కూడా కరోనా సోకినట్లు నిర్ధరణయింది.
కాగా జయా బచ్చన్‌కు టెస్ట్ రిజల్ట్ నెగటివ్ వచ్చిందని రాజేశ్ తోపె ట్వీట్ చేశారు.
అయితే కొద్దిసేపటికే రాజేశ్ తోపె ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
కానీ, అప్పటికే మంత్రి ట్వీట్ ఆధారంగా జాతీయ దినపత్రికల వెబ్‌సైట్లలో ఆ వార్త వచ్చేసింది.
హిందూస్తాన్ టైమ్స్, ఇండియా న్యూస్, ముంబయి నుంచి వెలువడే డీఎన్‌ఏ సహా పలు వార్తా వెబ్ సైట్లు ఈ వార్తను ప్రచురించాయి.

11, జులై 2020, శనివారం

అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా.. చిరంజీవి ఏమని ట్వీట్ చేశారంటే..

అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను శనివారం రాత్రి ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేర్చారు.
అమితాబ్ బచ్చన్ కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
అమితాబే స్వయంగా ఈ విషయాన్ని ప్రజలకు వెల్లడించారు.
కాగా అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నాకు కోవిడ్ -19 టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దాంతో నన్ను ఆసుపత్రిలో చేర్చారు. నా కుటుంబ సభ్యులు, సిబ్బందికీ కరోనా పరీక్షలు జరిపారు. వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. గత పది రోజుల్లో నాకు సమీపంగా మెలిగినవారరు ఎవరైనా కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా అమితాబ్ కరోనా నుంచి కోలుకోవాలంటూ సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున సందేశాలు వస్తున్నాయి. 
బాలీవుడ్ ఒక్కటే కాకుండా దేశంలోని అన్ని భాషల సినిమా పరిశ్రమకు చెందిన నటులు.. రాజకీయ నాయకులు, ఇతర రంగాల వారు అమితాబ్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
 తెలుగు సినీరంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.

10, జులై 2020, శుక్రవారం

వికాస్ దూబే ఎన్‌కౌంటర్

వికాస్ దూబే
Vikas Dubey Most Wanted Criminal Encounter
 
వికాస్ దూబే.. తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపి 8 మంది పోలీసుల మృతికి కారణమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్. ఆ వికాస్ దూబేను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో బుధవారం వికాస్ దూబేను అరెస్ట్ చేశారు. 
అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ తీసుకెళ్తుండగా తప్పించుకునేందుకు ప్రయత్నించిన వికాస్ దూబే పోలీసు కాల్పుల్లో మరణించినట్లు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉజ్జయిని నుంచి రోడ్డు మార్గంలో కాన్పూర్ తీసుకెళ్తుండగా కారు పల్టీ కొట్టిందని.. దాంతో వికాస్ దూబే తమ వద్ద ఉన్న పిస్టల్ లాక్కుని కాల్పులు జరపడంతో తిరిగి కాల్చామని.. ఆ కాల్పుల్లో దూబే చనిపోయాడని పోలీసులు చెప్పారు.
కాగా నిన్న బుధవారం వికాస్ దూబేను అరెస్ట్ చేయగా అంతకుముందు రోజు ఆయన అనుచరులు ఇద్దరిని అరెస్టు చేశారు. 
వారిని కాన్పూర్ తెస్తున్న సమయంలోనూ బుధవారం వారిని ఎన్‌కౌంటర్ చేశారు.
కాగా యోగి ఆదిత్యనాథ్ పాలనలో యూపీలో పెద్ద సంఖ్యలో రౌడీ షీటర్లను ఎన్‌కౌంటర్ చేశారు.

3, జులై 2020, శుక్రవారం

కరోనాకు వ్యాక్సిన్ మరో 40 రోజుల్లో వచ్చేస్తోంది

Covaxin

ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న కరోనా రోగానికి చెక్ చెప్పే వ్యాక్సిన్ తయారీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. 

దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడుతున్నాయి. ఇలాంటి వేళ.. మిగిలిన కంపెనీల కంటే ముందుగా తమ వ్యాక్సిన్ తొలుత బయటకు వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తోంది భారత్ బయోటెక్ కంపెనీ. మీడియా మొఘల్ రామోజీ కొడుకు కిరణ్  వియ్యంకుడికి చెందిన ఈ కంపెనీ వ్యాక్సిన్ తయారీలో కీలక అంకాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. 
ఇటీవల ఈ కంపెనీ రూపొందించిన  వ్యాక్సిన్ ట్రయల్ రన్ కు కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్లినికల్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. మిగిలిన వారి కంటే ముందే.. మన దేశంలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ఈ కంపెనీ నమ్మకంగా చెబుతోంది. దీని ఆధారంగానే ఐసీఎంఆర్ ఆగస్టు 15 కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. 
తాము అనుకున్నట్లు జరిగితే.. వ్యాక్సిన్ ను వచ్చే నెల పదిహేనో తేదీన ల్యాంచ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున వ్యాక్సిన్ కానీ విడుదల చేస్తే.. భావోద్వేగం పరంగానూ కలిసి వస్తుందన్న ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే.. ఏర్పాట్లు సాగుతున్నట్లు చెబుతున్నారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజునే.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి నుంచి స్వాతంత్య్రాన్ని పొందేలా వ్యాక్సిన్ వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగే.. ఈ వ్యాక్సిన్ కనెక్టు కావటమే కాదు.. ప్రపంచానికి గుదిబండలా మారిన మహమ్మారిని తరిమి.. తరిమి కొట్టొచ్చని చెప్పక తప్పదు. 

సరోజ్ ఖాన్ : బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ మృతి

సరోజ్ ఖాన్


ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కార్డియాక్ అరెస్ట్ వల్ల గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటల సమయంలో మరణించారు. 
శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో జూన్ 17న ఆమెను ముంబయిలోని గురునానక్ ఆసుపత్రిలో చేర్పించారు.
కరోనా వైరస్ టెస్టులు కూడా జరిపించగా నెగటివ్ వచ్చింది.
72 ఏళ్ల సరోజ్ ఖాన్‌కు భర్త సోహన్ లాల్, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సాధు సింగ్ నాగ్ పాల్. దాదాపు 2000కు పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం చేశారు సరోజ్.
మూడేళ్ల వయసులోనే బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన సరోజ్ ఖాన్ అంచెలంచెలుగా ఎదిగి గొప్ప కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు. 
మిస్టర్ ఇండియాలోని హవాహవా పాట నుంచి 2002లో దేవదాస్ సినిమాలోని ‘డోలా రే డోలా రే’’ పాట వరకు వందలాది పాటలకు గొప్ప నృత్య దర్శకత్వం చేసి పేరు తెచ్చుకున్నారు.