భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం దేశంలో కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య 18,601కి చేరింది.
వీరిలో 3,251 మంది ఇప్పటికే కోలుకోగా 590 మంది మరణించారు.
ప్రస్తుతం 14,759 మంది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగానే ఉన్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆ ఒక్క రాష్ట్రంలోనే 4,666 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్ర తరువాత 2081 కేసులతో దిల్లీ రెండో స్థానంలో ఉంది.
గుజరాత్‌లో 1939 కేసులు నమోదయ్యాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి