లోతైన విశ్లేషణలు, ట్రెండింగ్ టాపిక్స్, రాజకీయాలు, సామాజిక అంశాలు అన్నిటిపైనా సమగ్ర కథనాలు అందించడమే మా ధ్యేయం.
11, జులై 2020, శనివారం
అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా.. చిరంజీవి ఏమని ట్వీట్ చేశారంటే..
10, జులై 2020, శుక్రవారం
వికాస్ దూబే ఎన్కౌంటర్
3, జులై 2020, శుక్రవారం
కరోనాకు వ్యాక్సిన్ మరో 40 రోజుల్లో వచ్చేస్తోంది
ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న కరోనా రోగానికి చెక్ చెప్పే వ్యాక్సిన్ తయారీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి.
దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడుతున్నాయి. ఇలాంటి వేళ.. మిగిలిన కంపెనీల కంటే ముందుగా తమ వ్యాక్సిన్ తొలుత బయటకు వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తోంది భారత్ బయోటెక్ కంపెనీ. మీడియా మొఘల్ రామోజీ కొడుకు కిరణ్ వియ్యంకుడికి చెందిన ఈ కంపెనీ వ్యాక్సిన్ తయారీలో కీలక అంకాన్ని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఈ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ ట్రయల్ రన్ కు కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్లినికల్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. మిగిలిన వారి కంటే ముందే.. మన దేశంలో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని ఈ కంపెనీ నమ్మకంగా చెబుతోంది. దీని ఆధారంగానే ఐసీఎంఆర్ ఆగస్టు 15 కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.
తాము అనుకున్నట్లు జరిగితే.. వ్యాక్సిన్ ను వచ్చే నెల పదిహేనో తేదీన ల్యాంచ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున వ్యాక్సిన్ కానీ విడుదల చేస్తే.. భావోద్వేగం పరంగానూ కలిసి వస్తుందన్న ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే.. ఏర్పాట్లు సాగుతున్నట్లు చెబుతున్నారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజునే.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి నుంచి స్వాతంత్య్రాన్ని పొందేలా వ్యాక్సిన్ వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగే.. ఈ వ్యాక్సిన్ కనెక్టు కావటమే కాదు.. ప్రపంచానికి గుదిబండలా మారిన మహమ్మారిని తరిమి.. తరిమి కొట్టొచ్చని చెప్పక తప్పదు.
సరోజ్ ఖాన్ : బాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ మృతి
30, జూన్ 2020, మంగళవారం
భారత్, చైనాల్లో ఎవరి బలమెంత? ఎవరి దగ్గర ఏఏ ఆయుధాలు ఎన్నెన్ని ఉన్నాయి - పార్ట్ 2
భారత్, చైనాల మధ్య పోలిక విషయం భారత్ చైనా జనాభా 1,296,834,042 1,384,688,986 అందుబాటులో ఉన్న మానవ శక్తి 622,480,340 752,855,402 మిలటరీలో పనిచేయగలిగే సత్తువ ఉన్నవారు 494,249,390 621,105,706 ఏటా మిలటరీలో పనిచేసే వయసులోకి వచ్చేవారు 23,116,044 19,614,518 యాక్టివ్ మిలటరీ బలగాలు 1,444,000 2,183,000 రిజర్వ్ బలగాలు 2,100,000 510,000
ఆర్థిక పరిస్థితి
విషయం | భారత్ | చైనా |
రక్షణ బడ్జెట్ | $61,000,000,000 | $237,000,000,000 |
విదేశీ రుణం | $501,600,000,000 | $1,598,000,000,000 |
విదేశీ మారక ద్రవ్య నిల్వలు | $409,800,000,000 | $3,236,000,000,000 |
కొనుగోలు శక్తి | $10,065,500,000,000 | $24,810,000,000,000 |
వైమానిక సామర్థ్యం
విషయం | భారత్ | చైనా |
మొత్తం విమానాలు | 2,123 | 3,210 |
కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ | 538 | 1,232 |
దాడుల కోసమే కేటాయించినవి (డెడికేటెడ్ అటాక్) | 172 | 371 |
రవాణా కోసం వాడేవి(ట్రాన్స్పోర్ట్) | 250 | 224 |
శిక్షణ విమానాలు | 359 | 314 |
స్పెషల్ మిషన్ | 77 | 111 |
హెలికాప్టర్లు | 722 | 911 |
అటాక్ హెలికాప్టర్లు | 23 | 281 |
భూతల యుద్ధ సామర్థ్యం, నేవీ సామర్థ్యం, లాజిస్టిక్స్, వనరులు, భౌగోళిక స్వరూపం వివరాలు పార్ట్ 3లో
29, జూన్ 2020, సోమవారం
59: టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్‌ను నిషేధించిన భారత్.. మొత్తం లిస్ట్ ఇదే
2.షేర్ ఇట్
3.క్వాయ్
4.యూసీ బ్రౌజర్
5.బైదూ మ్యాప్
6.షెయిన్
7.క్లాష్ ఆఫ్ కింగ్స్
8.డీయూ బ్యాటరీ సేవర్
9.హెలో
10.లైకీ
11.యూక్యామ్ మేకప్
12.ఎంఐ కమ్యూనిటీ
13.సీఎం బ్రౌజర్స్
14.వైరస్ క్లీనర్
15.ఏపీయూఎస్ బ్రౌజర్
16.రామ్‌వీ
17.క్లబ్‌ఫ్యాక్టరీ
18.న్యూస్‌డాగ్
19.బ్యూటీప్లస్
20.వీచాట్
21.యూసీ న్యూస్
22.క్యూక్యూ మెయిల్
23.వీబో
24.క్జెండర్
25.క్యూక్యూ మ్యూజిక్
26.క్యూక్యూ న్యూస్‌ఫీడ్
27.బీగో లైవ్
28.సెల్పీ సిటీ
29.మెయిల్ మాస్టర్
30.ప్యార్లల్ స్పేస్
31.ఎంఐ వీడియోకాల్
32.వీ సింక్
33.ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్
34.వీవా వీడియో
35.మేయి టూ
36.వీగో వీడియో
37.న్యూ వీడియో స్టేటస్
38.డీయూ రికార్డర్
39.వాల్ట్ హైడ్
40.క్యాషే క్లీనర్
41.డీయూ క్లీనర్
42.డీయూ బ్రౌజర్
43.హ్యాగో ప్లే
44.క్యామ్ స్కానర్
45.క్లీన్ మ్యాస్టర్
46.వండర్ క్యామెరా
47.ఫోటో వండర్
48.క్యూక్యూ ప్లేయర్
49.వీ మీట్
50.స్వీట్ సెల్ఫీ
51.బైడూ ట్రాన్స్‌లేట్
52.వీ మేట్
53.క్యూక్యూ ఇంర్నేషనల్
54.క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్
55.క్యూక్యూ లాంచర్
56.యూ వీడియో
57.వీ ఫ్లై స్టేటస్ వీడియో
58.మొబైల్ లెజెండ్స్
59.డీయూ ప్రైవసీ
భారత్, చైనాల్లో ఎవరి బలమెంత? ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయి - పార్ట్ 1
భారత్, చైనా మధ్య యుద్ధం వస్తే ఎవరిది పైచేయి అవుతుంది? ఇండియాలో ఉంటూ
చైనాను సమర్థించేవారు.. అలాగే ఆల్రెడీ వాడుతున్న తమ చైనా ఫోన్లను, టీవీలను, ఇతర చైనా ఉత్పత్తులను
నేలకేసి కొట్టిమరీ చైనాపై కసి తీర్చుకుంటున్నవారూ ఉంటున్నారు.
సాధారణ జనంలోని ఆగ్రహావేశాలు, ఇష్టాయిష్టాలను
పక్కనపెడితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎవరు గెలిచే
అవకాశం ఉంటుందన్నది పరిశీలిద్దాం.
దీనికి ప్రధానంగా రెండు రెండు దేశాల ఆయుధ సామర్థ్యం ఎంత? ఆర్థిక సామర్థ్యం ఎంత? యుద్ధం ఎలా జరుగుతుంది.. ప్రపంచ దేశాల్లో ఏఏ దేశాలు భారత్ పక్షం వహిస్తాయి.. ఏవి చైనా పక్షం వహిస్తాయి? ఎన్నాళ్లు ఈ యుద్ధం సాగుతుంది వంటి ఎన్నో అంశాలు గెలుపోటములను నిర్దేశిస్తాయి. ఇందులో కొంత స్పష్టమైన వాస్తవాలు ఆధారంగా అంచనా వేయగలిగేవి కాగా మరికొన్ని హైపోథీసిస్ ఆధారంగా అంచనా వేయాల్సినవి.
మొదట భారత్, చైనాల మిలటరీ కెపాసిటీని పోల్చి చూద్దాం.
అంతర్జాతీయ సంస్థల లెక్కల ప్రకారం చూస్తే ప్రపంచంలో సైనిక సామర్థ్యం
ర్యాంకుల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంటే చైనా మూడో స్థానంలో ఉంది. అమెరికా, రష్యాలు ఒకటి, రెండు స్థానాల్లో
ఉన్నాయి.
అయితే.. గ్లోబల్ మిలటరీ పవర్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే భారత్
మంచి స్థానంలోనే ఉంది. గ్లోబల్ మిలటరీ పవర్ ఇండెక్స్ 0(జీరో)గా ఉంటే ఆ దేశం పూర్తిగా
శత్రు దుర్భేద్యం అని చెప్పుకోవచ్చు. కానీ, ప్రపంచంలో అంత శత్రుదుర్భేద్యమైన
దేశం ఏదీ లేదు. గ్లోబల్ పవర్ ఇండెక్స్‌లో 0.0606 పాయింట్లలో అమెరికా అత్యంత పవర్ ఫుల్
పొజిషన్లో ఉండగా 0.0681 పాయింట్లతో రష్యా ఉంది. మూడో స్థానంలో ఉన్న చైనా 0.0691 పాయింట్లతో
దాదాపు రష్యా స్థాయిలో ఉంది. ఇక భారత్ 0.0953 పాయింట్లతో సురక్షిత స్థానంలోనే ఉంది.
0.1 కంటే తక్కువ పాయింట్లతో బలమైన పొజిషనన్లో ఉన్నవి ఈ నాలుగు
దేశాలే. ప్రపంచంలోని మరే ఇతర దేశమూ ఈ నాలుగు దేశాల దరిదాపుల్లో కూడా లేదు.
గ్లోబల్ మిలటరీ పవర్ ఇండెక్స్‌లో టాప్ టెన్ కంట్రీస్
1) అమెరికా (0.0606 పాయింట్లు)
2) రష్యా(0.0681)
3) చైనా(0.0691)
4) భారత్(0.0953)
5) జపాన్(0.1501)
6) దక్షిణ కొరియా(0.1509)
7) ఫ్రాన్స్(0.1702)
8) యునైటెడ్ కింగ్డమ్(0.1717)
9) ఈజిప్ట్(0.1872)
10) బ్రెజిల్(0.1988)
నిత్యంతో మనలను కవ్వించే పొరుగు దేశం ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో(0.2364
పాయింట్లతో) ఉండగా ఈమధ్య కాలంలో చైనా అండ చూసుకుని కాలు దువ్వుతున్న నేపాల్ 122వ స్థానంలో(2.9891
పాయింట్లతో) ఉంది.
(పార్ట్ - 2 కోసం రేపు ఇదే వెబ్సైట్లో చూడండి. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక బలం వంటివన్నీ ఇండియాకు ఎంతుంది.. చైనాకు ఎంతుందనే విశ్లేషణ కోసం పార్ట్-2 చదవండి)