29, జూన్ 2020, సోమవారం

59: టిక్‌ టాక్‌ సహా 59 చైనా యాప్స్‌ను నిషేధించిన భారత్.. మొత్తం లిస్ట్ ఇదే

టిక్‌టాక్ టిక్ టాక్

టిక్‌టాక్ టిక్ టాక్‌పై నిషేధం
ఇండియా గవర్నమెంట్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్‌లో నిషేధించింది. నిషేధిత జాబితాలో టిక్ టాక్, హలో, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్ వంటివి ఉన్నాయి.
దీంతో ఇకపై మొబైల్‌లో కానీ, ఇంకే పరికరాల్లో కానీ వీటిని వాడడానికి వీల్లేదు.
ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 69ఏ నిబంధన ప్రకారం ఈ 59 యాప్స్‌ను నిషేధించారు.

నిషేధించిన 59 యాప్స్ ఇవే.. 
1.టిక్‌ టాక్‌

2.షేర్ ఇట్‌

3.క్వాయ్‌

4.యూసీ బ్రౌజ‌ర్‌

5.బైదూ మ్యాప్‌

6.షెయిన్‌

7.క్లాష్ ఆఫ్ కింగ్స్‌

8.డీయూ బ్యాట‌రీ సేవ‌ర్‌

9.హెలో

10.లైకీ

11.యూక్యామ్ మేక‌ప్‌

12.ఎంఐ క‌మ్యూనిటీ

13.సీఎం బ్రౌజ‌ర్స్‌

14.వైర‌స్ క్లీన‌ర్‌

15.ఏపీయూఎస్ బ్రౌజ‌ర్‌

16.రామ్‌వీ

17.క్ల‌బ్‌ఫ్యాక్ట‌రీ

18.న్యూస్‌డాగ్‌

19.బ్యూటీప్ల‌స్‌

20.వీచాట్‌

21.యూసీ న్యూస్‌

22.క్యూక్యూ మెయిల్‌

23.వీబో

24.క్జెండ‌ర్‌

25.క్యూక్యూ మ్యూజిక్‌

26.క్యూక్యూ న్యూస్‌ఫీడ్‌

27.బీగో లైవ్‌

28.సెల్పీ సిటీ

29.మెయిల్ మాస్ట‌ర్‌

30.ప్యార్ల‌ల్ స్పేస్‌

31.ఎంఐ వీడియోకాల్‌

32.వీ సింక్‌

33.ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోర‌ర్‌

34.వీవా వీడియో

35.మేయి టూ

36.వీగో వీడియో

37.న్యూ వీడియో స్టేట‌స్‌

38.డీయూ రికార్డ‌ర్‌

39.వాల్ట్ హైడ్‌

40.క్యాషే క్లీన‌ర్‌

41.డీయూ క్లీన‌ర్‌

42.డీయూ బ్రౌజ‌ర్‌

43.హ్యాగో ప్లే

44.క్యామ్ స్కాన‌ర్‌

45.క్లీన్ మ్యాస్ట‌ర్‌

46.వండ‌ర్ క్యామెరా

47.ఫోటో వండ‌ర్‌

48.క్యూక్యూ ప్లేయ‌ర్‌

49.వీ మీట్‌

50.స్వీట్ సెల్ఫీ

51.బైడూ ట్రాన్స్‌లేట్‌

52.వీ మేట్‌

53.క్యూక్యూ ఇంర్నేష‌న‌ల్‌

54.క్యూక్యూ సెక్యూరిటీ సెంట‌ర్‌

55.క్యూక్యూ లాంచ‌ర్‌

56.యూ వీడియో

57.వీ ఫ్లై స్టేట‌స్ వీడియో

58.మొబైల్ లెజెండ్స్‌

59.డీయూ ప్రైవ‌సీ



1. TikTok
2. Shareit
3. Kwai
4. UC Browser
5. Baidu map 
6. Shein 
7. Clash of Kings 
8. DU battery saver 
9. Helo 
10. Likee
11. YouCam makeup 
12. Mi Community 
13. CM Browers 
14. Virus Cleaner 
15. APUS Browser 
16. ROMWE 
17. Club Factory 
18. Newsdog 
19. Beutry Plus 
20. WeChat 
21. UC News 
22. QQ Mail 
23. Weibo 
24. Xender 
25. QQ Music 
26. QQ Newsfeed 
27. Bigo Live 
28. SelfieCity 
29. Mail Master 
30. Parallel Space 31. Mi Video Call – Xiaomi 
32. WeSync 
33. ES File Explorer 
34. Viva Video – QU Video Inc 
35. Meitu 
36. Vigo Video 
37. New Video Status 
38. DU Recorder 
39. Vault- Hide 
40. Cache Cleaner DU App studio 
41. DU Cleaner 
42. DU Browser 
43. Hago Play With New Friends 
44. Cam Scanner 
45. Clean Master – Cheetah Mobile 
46. Wonder Camera 
47. Photo Wonder 
48. QQ Player 
49. We Meet 
50. Sweet Selfie 
51. Baidu Translate 
52. Vmate 
53. QQ International 
54. QQ Security Center 
55. QQ Launcher 
56. U Video 
57. V fly Status Video 
58. Mobile Legends 
59. DU Privacy

భారత్, చైనాల్లో ఎవరి బలమెంత? ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలున్నాయి - పార్ట్ 1

భారత్, చైనా సైనికుల కొట్లాట

భారత్, చైనా మధ్య యుద్ధం వస్తే ఎవరిది పైచేయి అవుతుంది? ఇండియాలో ఉంటూ చైనాను సమర్థించేవారు.. అలాగే ఆల్రెడీ వాడుతున్న తమ చైనా ఫోన్లను, టీవీలను, ఇతర చైనా ఉత్పత్తులను నేలకేసి కొట్టిమరీ చైనాపై కసి తీర్చుకుంటున్నవారూ ఉంటున్నారు.

సాధారణ జనంలోని ఆగ్రహావేశాలు, ఇష్టాయిష్టాలను పక్కనపెడితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుందన్నది పరిశీలిద్దాం.

దీనికి ప్రధానంగా రెండు రెండు దేశాల ఆయుధ సామర్థ్యం ఎంత? ఆర్థిక సామర్థ్యం ఎంత? యుద్ధం ఎలా జరుగుతుంది.. ప్రపంచ దేశాల్లో ఏఏ దేశాలు భారత్‌ పక్షం వహిస్తాయి.. ఏవి చైనా పక్షం వహిస్తాయి? ఎన్నాళ్లు ఈ యుద్ధం సాగుతుంది వంటి ఎన్నో అంశాలు గెలుపోటములను నిర్దేశిస్తాయి. ఇందులో కొంత స్పష్టమైన వాస్తవాలు ఆధారంగా అంచనా వేయగలిగేవి కాగా మరికొన్ని హైపోథీసిస్ ఆధారంగా అంచనా వేయాల్సినవి.

మొదట భారత్, చైనాల మిలటరీ కెపాసిటీని పోల్చి చూద్దాం.

అంతర్జాతీయ సంస్థల లెక్కల ప్రకారం చూస్తే ప్రపంచంలో సైనిక సామర్థ్యం ర్యాంకుల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంటే చైనా మూడో స్థానంలో ఉంది. అమెరికా, రష్యాలు ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి.

అయితే.. గ్లోబల్ మిలటరీ పవర్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే భారత్ మంచి స్థానంలోనే ఉంది. గ్లోబల్ మిలటరీ పవర్ ఇండెక్స్ 0(జీరో)గా ఉంటే ఆ దేశం పూర్తిగా శత్రు దుర్భేద్యం అని చెప్పుకోవచ్చు. కానీ, ప్రపంచంలో అంత శత్రుదుర్భేద్యమైన దేశం ఏదీ లేదు. గ్లోబల్ పవర్ ఇండెక్స్‌లో 0.0606 పాయింట్లలో అమెరికా అత్యంత పవర్ ఫుల్ పొజిషన్లో ఉండగా 0.0681 పాయింట్లతో రష్యా ఉంది. మూడో స్థానంలో ఉన్న చైనా 0.0691 పాయింట్లతో దాదాపు రష్యా స్థాయిలో ఉంది. ఇక భారత్ 0.0953 పాయింట్లతో సురక్షిత స్థానంలోనే ఉంది.

0.1 కంటే తక్కువ పాయింట్లతో బలమైన పొజిషనన్లో ఉన్నవి ఈ నాలుగు దేశాలే. ప్రపంచంలోని మరే ఇతర దేశమూ ఈ నాలుగు దేశాల దరిదాపుల్లో కూడా లేదు.

గ్లోబల్ మిలటరీ పవర్ ఇండెక్స్‌లో టాప్ టెన్ కంట్రీస్

1) అమెరికా (0.0606 పాయింట్లు)

2) రష్యా(0.0681)

3) చైనా(0.0691)

4) భారత్(0.0953)

5) జపాన్(0.1501)

6) దక్షిణ కొరియా(0.1509)

7) ఫ్రాన్స్(0.1702)

8) యునైటెడ్ కింగ్‌డమ్(0.1717)

9) ఈజిప్ట్(0.1872)

10) బ్రెజిల్(0.1988)

నిత్యంతో మనలను కవ్వించే పొరుగు దేశం ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో(0.2364 పాయింట్లతో) ఉండగా ఈమధ్య కాలంలో చైనా అండ చూసుకుని కాలు దువ్వుతున్న నేపాల్ 122వ స్థానంలో(2.9891 పాయింట్లతో) ఉంది.

(పార్ట్ - 2 కోసం రేపు ఇదే వెబ్‌సైట్‌లో చూడండి. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైనిక బలం వంటివన్నీ ఇండియాకు ఎంతుంది.. చైనాకు ఎంతుందనే విశ్లేషణ కోసం పార్ట్-2 చదవండి)

28, జూన్ 2020, ఆదివారం

కరోనా వైరస్ 15 లక్షణాలు ఇవే


పింక్ ఐ

కరోనా లక్షణాల్లో ఇప్పటి వరకు జ్వరం, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కఫం, కండరాల నొప్పి, ముక్కు కారడం, గొంతుమంట, విరేచనాలు, వాసన లేమి, రుచిని తెలుసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నాయి. 
కళ్లు గులాబీ రంగులోకి మారడమూ కొవిడ్ 19 ప్రైమరీ లక్షణమేనని కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మజీ ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. 
అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వాంతులు, విరేచనాలతో పాటు ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలేనని తేల్చారు. ఈ లక్షణాలు వైరస్‌ సోకిన 2 నుంచి 14 రోజుల్లోగా కనిపిస్తాయని సంస్థ పేర్కొంది.

ఇప్పటివరకు మొత్తంగా 12 లక్షణాలు కొవిడ్ లిస్టులో ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 15కు చేరింది.
 కొవిడ్ గురించి తెలుసుకున్న కొద్దీ.. ఈ లిస్టులో మార్పులు వస్తుంటాయని ఏజెన్సీ తెలిపింది. 
ఇప్పటివరకు కరోనా బాధితుల్లో కొందరికి సింప్టమ్స్ కనిపించగా, మరికొందరికీ అసలు ఏమాత్రం సింప్టమ్స్ కనపడటం లేదని, వ్యక్తికి వ్యక్తికి మధ్య కరోనా వ్యాధి లక్షణాల్లో మార్పు ఉందని సీడీసీ వెల్లడించింది. 
హార్ట్, లంగ్ డిసీజ్, డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్న వారికి కరోనా రిస్క్ ఎక్కువని కూడా ప్రకటించింది. 

27, జూన్ 2020, శనివారం

చైనా పొగరు అణచాలంటే ఇండియన్ నేవీతోనే సాధ్యం.. అదెలాగో తెలుసా?

ఇండియన్ నేవీ Indian navy


చైనా గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులను పొట్టనపెట్టుకోవడం, అందులో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా అమరుడు కావడం తెలిసిందే. 
ఆ తరువాత కమాండర్ల స్థాయలో చర్చలు జరిగినా, ఉద్రిక్తతలు చల్లార్చడానికి రెండు దేశాల సైన్యాల మధ్య అంగీకారం కుదిరినా చైనా మాత్రం ఏదో నాటకం ఆడుతుందన్న వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. 
చైనా కనుక దారికి రాకుంటే తాను భారత్ తరఫున ఉంటానని అమెరికా కూడా ప్రకటించింది.
అయితే.. భారతే స్వయంగా చైనాకు చెక్ పెట్టాలంటే అందుకు మార్గం ఉందని.. గాల్వన్, ఇతర భూ సరిహద్దుల్లో చైనాకు చెక్ పెట్టాలంటే అందుకు ఇండియన్ నేవీని ఉపయోగించుకోవాలని రక్షణ నిపుణుల నుంచి సూచనలు వినిపిస్తున్నాయి. 
భూసరిహద్దుల్లో చైనా రెచ్చిపోతుంటే నేవీ ఏం చేస్తుందన్న అనుమానాలు కలగొచ్చు.. అందుకు సమాధానమే ఈ వ్యాసం.

చైనాను కంట్రోల్ చేయడానికి ఇండియన్ నేవీ ఎలా ఉపయోగపడుతుందంటే..

* చైనా నౌకా రవాణాపై తనిఖీ పెంచాలి. గతంలో మాదిరిగా అంత సులభంగా వాటిని వదిలేయకుండా తనిఖీల పేరుతో ఒత్తిడి పెంచాలి.
* హిందూ మహాసముద్రం మీదుగా వచ్చే చైనా నౌకలకు అనుమతుల విషయంలో ఏ చిన్న కారణం దొరికినా అభ్యంతరాలు పెట్టి అడ్డగించాలి.
* చైనా నౌకలు హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడానికి ముందే  పశ్చిమ పసిఫిక్ మహా సముద్రంలో భారత ప్రాబల్యం పెంచాలి.
* సౌత్ చైనా సీ(దక్షిణ చైనా సముద్రం) విషయంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న తటస్థ వైఖరిని వదిలి చైనా వ్యతిరేక స్టాండ్ తీసుకోవాలి.
* చైనాతో కలహాలున్న జపాన్, ఇండోనేసియా, వియత్నాం, ఆస్ట్రేలియాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకుని చైనాపై ఒత్తిడి పెంచాలి.

చైనా రవాణా కోసం ఎక్కువగా హిందూ మహా సముద్రంపైనే ఆధారపడుతుంది. అందుకే అక్కడ మనం బిగిస్తే చైనా ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇండియా ఏమీ మనల్ని ఊరికే వదిలిపెట్టదన్న సంగతి చైనాకు అర్థమవుతుంది. 


26, జూన్ 2020, శుక్రవారం

అమెజాన్ పే నుంచి ‘స్మార్ట్ స్టోర్’.. లోకల్ వ్యాపారుల కోసమే

అమెజాన్ పే

అమెజాన్ పే శుక్రవారం (జూన్ 26) భారతదేశంలో స్మార్ట్ స్టోర్స్ ఫీచర్‌ను ప్రారంభించింది, ఇక్కడ వినియోగదారులు స్టోర్‌లో లభించే ఉత్పత్తులను అన్వేషించడం ప్రారంభించడానికి అమెజాన్ యాప్‌ను ఉపయోగించి స్టోర్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.

'' స్మార్ట్ స్టోర్ '' ఫీచర్ స్థానిక షాపులకు ఫుట్‌ఫాల్స్‌ను పెంచడానికి, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు ఎక్కువ అమ్మకాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

"అమెజాన్ పే ఇప్పటికే మిలియన్ల స్థానిక దుకాణాలలో అంగీకరించబడింది, స్మార్ట్ స్టోర్స్ ద్వారా స్థానిక దుకాణాలలో వినియోగదారుల కొనుగోలు అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము" అని అమెజాన్ పే సిఇఒ మహేంద్ర నెరుర్కర్ అన్నారు.

ఉత్పత్తులను ఎంచుకున్న తరువాత, వినియోగదారులు అమెజాన్ పేతో కొనుగోలు చేస్తారు, ఇది వారికి యుపిఐ, బ్యాలెన్స్ లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించుకునే ఎంపికను ఇస్తుంది.

కస్టమర్లు ఆన్-ది-స్పాట్ లావాదేవీని EMI గా మార్చవచ్చు మరియు ఎప్పటికప్పుడు వారి బ్యాంకుల నుండి లేదా అమెజాన్ పే ద్వారా అద్భుతమైన బహుమతులు పొందవచ్చు.

స్మార్ట్ స్టోర్ స్థానిక దుకాణాన్ని డిజిటల్ స్టోర్ ఫ్రంట్ ప్రారంభించటానికి అనుమతిస్తుంది, తద్వారా వినియోగదారులకు ఉత్పత్తులను కనుగొనడం, సమీక్షలు చదవడం, స్టోర్‌లో ఉన్నప్పుడు లేదా అమెజాన్ అనువర్తనాన్ని ఉపయోగించి ఎక్కడి నుండైనా ఆఫర్‌లను అంచనా వేయడం జరుగుతుంది.

కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి స్థానిక దుకాణాలకు అమెజాన్ పే రివార్డ్ కూపన్లను అందించడానికి ఇది వీలు కల్పిస్తుంది.

దేశవ్యాప్తంగా వేలాది స్థానిక షాపులు ఇప్పటికే అమెజాన్ పే స్మార్ట్ స్టోర్స్‌గా, విశాకపట్నంలో శ్రీ బాలాజీ కిచెన్‌లు, జబల్‌పూర్‌లోని యుఎస్‌హెచ్‌ఎ కంపెనీ స్టోర్ మరియు బిగ్ బజార్, మెడ్‌ప్లస్ మరియు మరిన్ని సూపర్‌మార్కెట్ల వంటి బ్రాండ్ల lets ట్‌లెట్లుగా సైన్ అప్ అయ్యాయి.

"EMI లు, బ్యాంక్ ఆఫర్లు మరియు రివార్డుల ద్వారా, మేము ఈ కొనుగోళ్లను మరింత సరసమైన మరియు కస్టమర్లకు బహుమతిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాము మరియు వ్యాపారులకు అమ్మకాలను పెంచడంలో సహాయపడతాము" అని నెరుర్కర్ తెలిపారు.

Che Guevara : చే గువేరా ఇల్లు అమ్మకానికి పెట్టారు

che guevara చే గువేరా చే గెవేరా


Che Guevara  చే గెవేరా చే గువేరా
చే గెవేరా.. ప్రపంచానికి రివల్యూషనరీ ఐకాన్.
అర్జెంటీనాలోని రొసారియోలో ఆయన పుట్టిన ఇంటిని అమ్మకానికి పెట్టారు. 2,580 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇంటిని 2000లో కొన్నానని ప్రస్తుతం ఆ ఇంటి యజమాని అయిన ఫ్రాన్సిస్కో ఫరుగ్గియా చెబుతున్నారు.
నిజానికి ఫరుగ్గియా ఆ ఇంటిని ఒక కల్చరల్ సెంటర్‌గా మార్చాలని ట్రై చేశారట.. కానీ, తన వల్ల కాలేదని.. అందుకే అమ్మేస్తున్నానని చెప్పారు.

ఏటా లక్షలాది మంది పర్యాటకులు

రొసారియాలో ఉన్న ఈ ఇంటిని సందర్శించడానికి ప్రపంచ దేశాల నుంచి ఏటా లక్షలాది మంది వస్తుంటారు.

ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్‌ పీపే ముజికా, క్యూబా మాజీ అధినేత ఫీడెల్ క్యాస్ట్రో సంతానం, 1950లలో మోటార్‌సైకిల్‌పై చే గువేరాతో పాటు దక్షిణ అమెరికావ్యాప్తంగా వేల కిలోమీటర్లు ప్రయాణించిన డాక్టర్‌ ఆల్బర్టో గ్రానడోస్‌ కూడా అనంతర కాలంలో ఈ ఇంటిని సందర్శించారు.

చే గెవేరా నేపథ్యం

1928లో ఓ ధనిక-మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన చే గెవేరా, దక్షిణ అమెరికాలో పేదరికం, ఆకలిని చూసి విప్లవకారుడిగా మారారు. 1953-59 మధ్య సాగిన క్యూబా విప్లవంలో నియంత బటిస్టాను పదవి నుంచి పడదోయడంలో కీలకపాత్ర పోషించారు చే గెవేరా.
క్యూబా విప్లవం ముగిసిన తర్వాత ఆయన బొలీవియాలో ఉద్యమానికి నాయకత్వం వహించారు. అప్పటి ఆ దేశ అధ్యక్షుడు రెనీ బారియంటోస్‌ ఒర్డునోను గద్దె దించాలని ఆయన విప్లవించారు.
Che Guevara చే గువేరా మృతదేహం


అమెరికా సైన్యం సహకారంతో బొలీవియా సేనలు చే గెవేరాను, ఆయన సహచరులను బందీలుగా పట్టుకున్నాయి. 1967 అక్టోబర్‌ 9న లా హిగేరా అనే గ్రామంలో బొలీవియా దళాలు ఆయనను కాల్చి చంపాయి. ఆ తర్వాత ఆయన శరీరాన్ని గుర్తు తెలియని ప్రదేశంలో ఖననం చేశాయి.

1997లో ఆయన అస్థికలు బైటపడటంతో వాటిని క్యూబాకు తరలించి అక్కడ తిరిగి ఖననం చేశారు. 
Read Also

25, జూన్ 2020, గురువారం

ఎమర్జెన్సీ: ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడానికి కారణమేంటి? సంజయ్ గాంధీ అప్పుడు సాగించిన అరాచకాలేమిటి?


Indira Gandhi Sanjay Gandhi ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ

June 25, 1975 Emergecy In India - Indira Gandhi, Sanjay Gandhi

ఎమర్జెన్సీ... స్వతంత్ర భారత దేశం 28 ఏళ్ల వయసులో ఉరకలేయాల్సిన వేళ ఇందిరాగాంధీ నియంతృత్వానికి బలైంది. 1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యయిక స్థితి ఆమె అనువంశిక పాలన, నియంతృత్వ ధోరణి, వ్యక్తిపూజ వంటి దుర్లక్షణాలకు భయంకరమైన సాక్ష్యం. 
1975 జూన్‌ 25న నాటి ప్రధాని ఇందిర విధించిన ఎమర్జెన్సీ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను ప్రభుత్వం, దాని రౌడీ మూకలు దారుణంగా చెరిచాయి.. చంపాయి.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ చీకటి అధ్యాయానికి నేటితో 45 ఏళ్లు.

ఇందిరాగాంధీ

ఎమర్జెన్సీ ఎందుకు విధించారు?

1971లో లోక్‌సభ సభ్యురాలిగా ఇందిరాగాంధీ గెలవడాన్ని ఆమెపై పోటీచేసి ఓడిపోయిన రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో సవాల్ చేశారు. కేసు విచారించిన కోర్టు ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదని తేల్చింది. ఆమె అధికారంలోనుంచి దిగిపోవాలని 1975 జూన్‌ 12న అలహాబాదు హైకోర్టు తీర్పు చెప్పింది. 
దానిపై ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆమె ప్రధానిగా పనిచేయడానికి వీలులేదని, లోక్ సభ సమావేశాల్లో పాల్గొనడం, మాట్లాడటం, ఓటు వేయడం, లోక్‌సభ సభ్యురాలిగా జీతం పొందడం కూడా కుదరదన్న షరతులతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కృష్ణ అయ్యర్‌ ఆమెకు బెయిలు మంజూరు చేశారు. 
అయితే... ఇందిరాగాంధీ స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి సమయం కావాలి కాబట్టి తీర్పును 20 రోజుల పాటు వాయిదా వేశారు.
అదే ఈ దేశం కొంపముంచింది. 


సుప్రీం నిర్ణయం నేపథ్యంలో సర్వోదయ ఉద్యమ నాయకులు జయప్రకాశ్‌ నారాయణ్‌ ఇందిర రాజీనామా కోరుతూ దేశవ్యాప్త సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు. 
దాంతో దాన్నే కారణంగా చూపుతూ అంతర్గత కల్లోలం నుంచి దేశాన్ని కాపాడాలన్న కారణం చెప్పి ఇందిర ప్రభుత్వం 'ఎమర్జెన్సీ' ప్రకటించింది. 
ఇక అక్కడి నుంచి ఇందిరాగాంధీ, ఆమె చిన్న కొడుకు సంజయ్ గాంధీలు సాగించిన అరాచకం అంతాఇంతా కాదు. 
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల పేరిట జరిగిన అరాచకాలు, పార్టీ కార్యకర్తల అండతో చేయించిన దాడులు, ఆదాయపుపన్ను శాఖను 'బ్లాక్‌ మెయిల్‌' చేసే యత్నాలు, పత్రికలపై ఉక్కుపాదం, పార్టీలోని భజనపరులు, తైనాతీలకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం, ప్రతిపక్ష నాయకులను, మేధావులను, కవులు, రచయితలు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి జైళ్ళలో బంధించడం వంటి అన్యాయాలు అడ్డూ ఆపూ లేకుండా జరిగాయి.

సంజయ్ గాంధీ Sanjay Gandhi

రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చివేస్తూ పార్లమెంటుకు అపరిమిత అధికారాలు కట్టబెట్టే సవరణలూ తీసుకువచ్చారు. పార్లమెంటు పదవీ కాలాన్ని అయిదేళ్లనుంచీ ఆరేళ్లకు పెంచారు. 'మిసా' (అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం 1973) ద్వారా వేల సంఖ్యలో అసమ్మతి వాదుల్ని చెరసాలల్లో బంధించారు. 
వార్తా పత్రికల కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. పత్రికల్లో ఏం రాయాలో, ఏం రాయకూడదో ఆంక్షలు విధించారు. దీని ఫలితంగా కొన్ని దినపత్రికలు సంపాదకీయం ఉండాల్సిన చోటును ఏమీ రాయకుండా ఖాళీగా ఉంచి తాము అణచివేతకు గురవుతున్నామని నిరసన తెలిపేవి.
అలా చేయడంపైనా ప్రభుత్వం కన్నెర్ర చేసింది. 
ప్రభుత్వానికి అనుకూలంగా లేనట్లు కనిపించిన పాత్రికేయులు, కార్టూనిస్టులు, ఫొటోగ్రాఫర్లు సహా వేలాది మంది గుర్తింపు కార్డులు రద్దు చేశారు.
జర్నలిస్టులకు వర్తించే సౌకర్యాలను రద్దు చేయడంతోపాటు పత్రికా సమావేశాల్లో పాల్గొనకుండా వారిని నిషేధించారు. దేశ ప్రజాస్వామ్య, సామ్యవాద విలువల పరిరక్షణకే ఆ చర్యలన్నీ చేపట్టినట్లు ఆనాటి ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంది.

అంతర్గత అత్యవసర పరిస్థితుల పేరిట ఇందిర జమానాలో తీసుకువచ్చిన చట్టాలపై జనతా పార్టీ అధికారంలోకి రాగానే 1977 ఆగస్టులో శ్వేతపత్రం సమర్పించింది.
 రాజ్యాంగానికి చేసిన వివిధ సవరణలతో పాటు అనేక చట్టాలను పూర్వ స్థితికి తీసుకు వచ్చారు.

Read Also:

20, జూన్ 2020, శనివారం

సోలార్ ఎక్లిప్స్ : జ్వాలా వలయ సూర్యగ్రహణం అంటే ఏమిటి.. గ్రహణం గురించి ప్రజల్లో ఉన్న భయాలేంటి.. అసలు వాస్తవాలు ఏంటి

సోలార్ ఎక్లిప్స్ రింగ్ ఆఫ్ ఫైర్ Solar Eclipse Ring of Fire

సూర్యగ్రహణం : జూన్ 21, 2020న ఏర్పడుతున్న సూర్యగ్రహణం భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుని చుట్టూ వలయాకారంలో కనిపిస్తుంది. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ లేదా అగ్ని వలయం లేదా జ్వాలావలయం అంటున్నారు.

కానీ, దేశంలోనే అత్యధిక ప్రాంతాల్లో మాత్రం ఈ సూర్యగ్రహణం పాక్షికంగానే కనిపించనుండడంతో ఆయా ప్రాంతాల్లో ఈ జ్వాలా వలయాన్ని చూడలేరు.

సూర్యగ్రహణం సరిగ్గా ఎన్ని గంటలకు కనిపిస్తుంది

దేశంలో సూర్యగ్రహణం ఎన్ని గంటలకు కనిపిస్తుందనే విషయంలో భిన్న సమయాలను చెబుతున్నారు. కోల్‌కతాలోని బిర్లా ప్లానిటోరియం చెబుతున్న ప్రకారం అయితే... సూర్య గ్రహణం మొదట రాజస్థాన్ రాష్ట్రంలోని ఘర్సాణా దగ్గర ఉదయం 10.12 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది. అది 11.49 నిమిషాలకు వలయాకారంలో కనిపించడం మొదలవుతుంది. తర్వాత 11.50కి ముగుస్తుంది.


రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది?

రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలోని సిర్సా, రతియా, కురుక్షేత్ర, ఉత్తరాఖండ్‌లోని దెహ్రాడూన్, చంబా, చమేలీ, జోషీమఠ్ ప్రాంతాల్లో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ ఒక నిమిషం పాటు కనిపిస్తుంది.

2019 డిసెంబర్ 26న సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు కూడా రింగ్ ఆఫ్ ఫైర్ కనిపించింది. కానీ, ఈసారి అప్పటిలా ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంత స్పష్టంగా కనిపించదు. 

రింగ్ ఆఫ్ ఫైర్ సోలార్ ఎక్లిప్ల్ అసలు ఎలా ఏర్పడుతుంది

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో ఉన్నప్పుడే వలయాకార సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఏర్పడుతుంది. కొంత సమయం పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా చీకటి కమ్మేస్తుంది.

ఆ సమయంలో సూర్యుడు జ్వాలావలయంలా కనిపిస్తాడు కాబట్టే ఆదివారం సూర్య గ్రహణం ప్రత్యేకం కాబోతోంది.



హైదరాబాద్‌లో ఎన్ని గంటలకు కనిపిస్తుంది?

హైదరాబాద్‌లో పాక్షిక సూర్యగ్రహణం ఉదయం 10.14కు మొదలై, మధ్యాహ్నం 1.44కు ముగుస్తుంది.

దిల్లీలో ఉదయం 10.20కి ప్రారంభమయ్యే సూర్య గ్రహణం 1.48కి ముగుస్తుంది. 

ముంబయిలో అది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.27 వరకూ, చెన్నైలో ఉదయం 10.22 నుంచి మధ్యాహ్నం 1.41 వరకూ, బెంగళూరులో 10.13 నుంచి 1.31 వరకూ, కోల్‌కతాలో పాక్షిక సూర్యగ్రహణం ఉదయం 10.46కు ప్రారంభమై, 2.17కు ముగుస్తుంది.

ప్రపంచంలో మొట్ట మొదట ఎక్కడ కనిపిస్తుంది?


ప్రపంచంలో మొట్టమొదట ఆఫ్రికా ఖండంలోని కాంగో ప్రజలకు ఈ వలయాకార సూర్య గ్రహణం కనిపిస్తుంది.

ఇండియాలో మొట్టమొదట రాజస్థాన్‌లో కనిపించడానికి కంటే ముందు సౌత్ సూడాన్, ఇథియోపియా, యెమెన్, ఒమన్, సౌదీ అరేబియా, హిందూ మహాసముద్రం, పాకిస్తాన్‌లో కనిపిస్తుంది.

భారత్ తర్వాత టిబెట్, చైనా, తైవాన్ ప్రజలు దీన్ని చూడగలరు. 

పసిఫిక్ మహాసముద్రం మధ్యకు చేరుకోగానే అది ముగుస్తుంది.

ప్రజల్లో అనేక భయాలు

యుగాంతం లేదా భయంకర అల్లకల్లోలానికి గ్రహణం ఒక హెచ్చరిక అని, అది ప్రమాదానికి సంకేతం అని ప్రపంచంలో చాలా మంది భావిస్తారు.

అమృతం కోసం ‘క్షీరసాగర మథనం’ జరిగిన తర్వాత రాహు-కేతు అనే రాక్షసులే ఈ గ్రహణాలకు కారణమయ్యారని పురాణాలు చెబుతాయి.

గ్రహణం ఎందుకు ఏర్పడుతుందో మనకు వైజ్ఞానిక కారణాలు తెలుసినప్పటికీ, మనలో చాలా మంది ఇప్పటికీ గ్రహణానికి సంబంధించిన కథలు, విశ్వాసాలు నమ్ముతుంటారు.

ప్రస్తుతం కూడా కరోనాకు, గ్రహణానికి ముడిపెడుతూ అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి.

Read Also:

సూర్య గ్రహణం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ని గంటలకు మొదలై ఎన్ని గంటలకు ముగుస్తుంది.. ఈ గ్రహణం ప్రత్యేకతలేమిటి?