దేశవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) కేసులు 123కు చేరుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఈయూ దేశాలు, బ్రిటన్, టర్కీపై ట్రావెల్ బ్యాన్ చేసి ప్రయాణికులు రాకుండా కేంద్రం నిషేధం విధించింది. ఈ నెల 31 వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది. అంతేకాకుండా ఈ వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన కూడా జారీ చేసింది. మార్చి 31 వరకూ దేశవ్యాప్తంగా స్కూళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, షాపింగ్‌మాల్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీలైనంత వరకూ అన్ని రంగాల ఉద్యోగులూ ఇండ్ల నుంచే పని చేయడం మంచిదని సూచనలు జారీ చేసింది. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని తెలిపింది. వ్యక్తి వ్యక్తికి కనీసం ఒక మీటర్ దూరం ఉండే విధంగా చూసుకోవాలని సూచించింది. ఒకేచోట 50 మంది కంటే ఎక్కువగా గుమిగూడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి