1, అక్టోబర్ 2019, మంగళవారం

Herbert Kleber ఎవరు? గూగుల్ ఎందుకు డూడుల్‌తో గుర్తుచేసింది?


హెర్బర్ట్ క్లెబర్ ఎవరు? గూగుల్ ఎందుకు డూడుల్‌తో గుర్తుచేసింది?




గూగుల్ డూడుల్ తాజాగా డాక్టర్ హెర్బర్ట్ డేవిడ్ క్లెబర్‌ను గుర్తుచేసింది. ప్రఖ్యాత అడిక్షన్ సైకాలజిస్ట్ ( addiction psychologist) అయిన హెర్బర్ట్ క్లెబర్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసన్ (National Academy of Medicine)కు ఎన్నికై అక్టోబరు 1, 2019 నాటికి 23 సంవత్సరాలైన సందర్భంగా డూడుల్ రూపొందించింది.
గత ఏడాది(2018)లో మరణించిన హెర్బర్ట్ క్లెబర్ 1934 జూన్ 19న పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో జన్మించారు. క్లెబర్ తండ్రి డాక్టర్ కావాలనుకుని కాలేకపోవడంతో కొడుకును డాక్టర్ చేయాలని బలంగా కోరుకున్నారు. అందుకు అనుగుణంగానే డార్మౌత్ కాలజీలో చేరిన క్లెబర్ అక్కడ సైకాలజీ పట్ల ఆకర్షితుడై ఆ శాస్త్రంలో పట్టు సాధించారు. అనంతరం యాలె యూనివర్సిటీలో సైకియాట్రిక్ రెసిడెన్సీ పూర్తిచేశారు.
హెర్బర్ట్ క్లెబర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
* వ్యసనాలకు బానిస కావడాన్ని నైతిక విలువలు పాటించడంలో వైఫల్యంగా క్లెబర్ ఎన్నడూ చూడలేదు. అధ్యయనం, మందులు ఇవ్వడం, చికిత్స చేయడంతోనే వ్యక్తులను వ్యసనాల నుంచి బయటపడేయగలమని ఆయన నమ్మేవారు.
* జార్జిబుష్ మన్ననలు పొందిన సైకాలజిస్ట్: క్లెబర్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టురుగా నియమించారు.
* అడిక్షన్ బాధితుల కోసం క్లెబర్ అనేక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేషనల్ సెంటర్ ఆన్ అడిక్షన్ అండ్ సబ్‌స్టాన్స్ అబ్యూజ్ ఆయన ఏర్పాటుచేసిందే. కొలంబియా యూనివర్సిటీలోనూ క్లెబర్ సబ్‌స్టాన్స్ అబ్యూజ్ విభాగం ఏర్పాటు చేశారు. అనంతర కాలంలో అది అమెరికాలోనే టాప్ కేంద్రంగా మారింది.
* 1996లో ప్రతిష్ఠాత్మక ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసన్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్‌ సభ్యుడిగా క్లెబర్ ఎన్నికయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి