దేశవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) కేసులు 123కు చేరుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఈయూ దేశాలు, బ్రిటన్, టర్కీపై ట్రావెల్ బ్యాన్ చేసి ప్రయాణికులు రాకుండా కేంద్రం నిషేధం విధించింది. ఈ నెల 31 వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది. అంతేకాకుండా ఈ వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన కూడా జారీ చేసింది. మార్చి 31 వరకూ దేశవ్యాప్తంగా స్కూళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, షాపింగ్‌మాల్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీలైనంత వరకూ అన్ని రంగాల ఉద్యోగులూ ఇండ్ల నుంచే పని చేయడం మంచిదని సూచనలు జారీ చేసింది. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని తెలిపింది. వ్యక్తి వ్యక్తికి కనీసం ఒక మీటర్ దూరం ఉండే విధంగా చూసుకోవాలని సూచించింది. ఒకేచోట 50 మంది కంటే ఎక్కువగా గుమిగూడొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
లోతైన విశ్లేషణలు, ట్రెండింగ్ టాపిక్స్, రాజకీయాలు, సామాజిక అంశాలు అన్నిటిపైనా సమగ్ర కథనాలు అందించడమే మా ధ్యేయం.
17, మార్చి 2020, మంగళవారం
16, మార్చి 2020, సోమవారం
కరోనా వైరస్ Coronavirus మనిషిని ఎలా చంపుతుంది?
కరోనా వైరస్ పేరు చెబితేనే చాలు ప్రజలు గడగగడలాడుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది చనిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ కరోనా వైరస్.. ఇది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. దీనివల్ల మనుషులు ఎలా చనిపోతున్నారు.. దీనికి చికిత్స చేయడం ఎలా అనేది చూద్దాం..
కరోనా మనిషి శరీరంలో చేరిన తరువాత వివిధ దశల్లో అది ఆ శరీరాన్ని పీల్చిపిప్పి చేయడానికి ప్రయత్నిస్తుంది.
ఇంక్యుబేషన్ పీరియడ్
వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తన పట్టును పెంచుకునే సమయం ఇది. వైరస్‌లు.. మన శరీర నిర్మాణంలోని కణాలలోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను స్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి చొరబడుతుంది. మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. వాటిని 'కరోనావైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి ఉప్పెనలా మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.ఇది ప్రాధమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.
ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ - అంటే వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం - ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది.
మైల్డ కేసెస్..
చాలామందిలో కరోనా వైరస్ ఈ స్టేజ్‌లోనే తగ్గిపోతుంది. కోవిడ్-19 వ్యాధి వచ్చిన ప్రతి 10 మందిలో ఎనిమిది మందికి స్వల్ప ఇన్‌ఫెక్షన్‌గానే ఉంటుంది. ప్రధాన లక్షణాలు జ్వరం, దగ్గు. ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చు. తప్పనిసరిగా వస్తాయనేమీ లేదు. జ్వరం రావటానికి, నలతగా ఉన్నట్లు అనిపించటానికి కారణం.. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్‌ఫెక్షన్‌కు ప్రతి స్పందించటమే. శరీరంలో ప్రవేశించిన వైరస్‌ను దాడి చేసిన శత్రువుగా మన రోగనిరోధక వ్యవస్థ గుర్తించి.. ఏదో తేడా ఉందంటూ కైటోకైన్లు అనే రసాయనాలను విడుదల చేయటం ద్వారా శరీరంలోని మిగతా భాగమంతటికీ సంకేతాలు పంపిస్తుంది.నిజానికి ఈ కైటోకైన్లు మన రోగనిరోధక వ్యవస్థలో భాగం. కానీ దీనివల్ల ఒళ్లు నొప్పులు, జ్వరం వస్తాయి.కరోనావైరస్ వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.
కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.
ఈ లక్షణాలకు.. శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ.. ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ మందులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు.
ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే.. వారిలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది.
అయితే.. కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం వంటి జలుబు వంటి లక్షణాలు కూడా రావచ్చని ఇప్పుడిప్పుడే పలు అధ్యయనాల్లో తెలుస్తోంది.
వ్యాధి ముదిరితే..
వ్యాధి ముదిరిందంటే.. దానికి కారణం మన రోగనిరోధక వ్యవస్థ - వైరస్ మీద పోరాడటానికి అతిగా ప్రతిస్పందించటం.రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని మిగతా భాగానికి పంపించే రసాయన సంకేతాలైన కైటోకైన్ల వల్ల వాపు రావచ్చు. దీంట్లో సున్నితంగా సంతులనం సాధించాల్సి ఉంటుంది. వాపు విపరీతంగా పెరిగినట్లయితే శరీరమంతటా చాలా నష్టం జరగవచ్చు.
ఊపిరితిత్తుల వాపును న్యుమోనియా అని పిలుస్తారు.
ఈ ఊపిరితిత్తులు రెండు చిన్న పాటి గాలి సంచుల్లా ఉంటాయి. మన శ్వాసప్రక్రియలో.. ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించటం, కార్బన్‌డయాక్సైడ్ వెలుపలికి రావటం జరిగేది ఈ ఊపిరితిత్తుల్లోనే. కానీ న్యూమోనియా వచ్చినపుడు.. ఈ గాలి సంచులు నీటితో నిండిపోవటం మొదలవుతుంది. దీనిఫలితంగా శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది. చివరికి చాలా కష్టమవుతుంది.
కొంతమందికి శ్వాస అందించటానికి వెంటిలేటర్ (కృత్రిమ శ్వాస పరికరం) అవసరమవుతుంది.
చైనా నుంచి అందిన సమాచారం ఆధారంగా చూస్తే.. కరోనావైరస్ సోకిన వారిలో సుమారు 14 శాతం మంది ఈ దశకు చేరుతున్నట్లు భావిస్తున్నారు.
విషమించిన వ్యాధి
మొత్తం మీద ఆరు శాతం కేసుల్లో విషమంగా జబ్బుపడుతున్నట్లు అంచనా. ఈ దశకు వచ్చేసరికి.. శరీరం విఫలమవటం మొదలవుతుంది. మరణం సంభవించే అవకాశం అధికం. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అదుపు తప్పిపోతూ.. శరీరమంతటినీ పాడుచేస్తుండటం ఇక్కడ సమస్య.దీనివల్ల 'సెప్టిక్ షాక్' సంభవించవచ్చు. అంటే.. రక్తపోటు ప్రమాదకరస్థాయిలో పడిపోయి, అంతర్గత అవయవాలు సరిగ్గా పనిచేయటం ఆగిపోయి చివరికి పూర్తిగా విఫలమవుతాయి.
ఊపిరితిత్తుల్లో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాపు వల్ల.. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ తలెత్తుతుంది. అంటే శ్వాసప్రక్రియ దాదాపుగా ఆగిపోయి.. శరీర మనుగడకు అవసరమైన ఆక్సిజన్ అందకుండా పోతుంది. ఆక్సిజన్ అందకపోతే.. శరీరంలోని కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయలేవు. పేగులు దెబ్బతింటాయి.
ఈ వైరస్ ఎంత భారీగా వాపు సంభవిస్తుందంటే.. దానివల్ల శరీరంలోని అనేక అవయవాలు విఫలమై మరణం సంభవిస్తుంది. వైరస్‌ను రోగ నిరోధక వ్యవస్థ అదుపులోకి తేలేకపోయినట్లయితే.. ఆ వైరస్ శరీరంలోని ప్రతి మూలకూ విస్తరిస్తుంది. దానివల్ల మరింత విధ్వంసం జరుగుతుంది.
ఈ దశలో చికిత్స అందించటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈసీఎంఓ - ఎక్స్‌ట్రా-కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ కూడా చేయాల్సి రావచ్చు.
అంటే.. కృత్రిమ ఊపిరితిత్తులు శరీరంలోని రక్తాన్ని ట్యూబుల ద్వారా బయటకు తీసి, దానికి ఆక్సిజన్ అందించి మళ్లీ శరీరంలోకి పంపిస్తుంది.
కానీ.. చివరికి శరీరంలో అంతర్గత విధ్వంసం ప్రాణాంతక స్థాయికి చేరవచ్చు.. అప్పుడు అంతర్గత అవయవాలు ఇక శరీరాన్ని సజీవంగా ఉంచలేవు.
మరణాలు...
తాము శాయశక్తులా ప్రయత్నించినా కూడా కొంతమంది పేషెంట్లు ఎలా చనిపోయారనేది డాక్టర్లు వివరించారు.చైనాలోని ఉహాన్‌లో గల జిన్‌యిన్‌టాన్ హాస్పిటల్‌లో చనిపోయిన మొదటి ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ.. వారు దీర్ఘకాలంగా ధూమపానం చేస్తున్నారని, దానివల్ల వారి ఊపిరితిత్తులు దెబ్బతిని ఉంటాయని.. లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో వివరించారు.
మృతుల్లో మొదటి వ్యక్తి వయసు 61 సంవత్సరాలు. ఆయన ఆస్పత్రికి వచ్చేటప్పటికే న్యుమోనియా తీవ్రంగా పెరిగింది. ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించినప్పటికీ.. ఊపిరితిత్తులు విఫలమయ్యాయి. అతడి గుండె కొట్టుకోవటం ఆగిపోయింది.
ఆస్పత్రిలో చేర్చిన 11 రోజుల తర్వాత అతడు చనిపోయాడు.
మృతుల్లో రెండో వ్యక్తి వయసు 69 సంవత్సరాలు. ఆయనకు కూడా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ తలెత్తింది.
ఆయనకు ఈసీఎంఓ మెషీన్ (కృత్రిమ ఊపిరితిత్తులు) ఉపయోగించినా కూడా సరిపోలేదు. ఆయన తీవ్రమైన న్యుమోనియాతో పాటు, రక్తపోటు పడిపోవటంతో సెప్టిక్ షాక్ వల్ల చనిపోయాడు.
కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు
కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది.
వీటిలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం, ఆహార జాగ్రత్తలు ఉన్నాయి.
శ్వాస ఇబ్బందులు ఎదుర్కుంటున్న రోగులకు దగ్గరగా ఉండకూడదని సూచించారు.
తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, పెంపుడు జంతువులు, లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలని చెప్పింది.
పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.
అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.
కరోనా వైరస్ లక్షణాలు
కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది.
శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు.
కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మర్స్(మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం.
వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు.
ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు.
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల వల్ల ఇది జ్వరంతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తర్వాత పొడి దగ్గు తీవ్రంగా ఉంటుంది.
వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి.
కానీ సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది.
కిడ్నీలు ఫెయిలై రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు.
ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు.
ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు.
28, ఫిబ్రవరి 2020, శుక్రవారం
దిల్లీ హైకోర్టు 1984 సిక్కుల ఊచకోతను ఎందుకు గుర్తుచేసింది.. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది
దిల్లీ అల్లర్ల నేపథ్యంలో అక్కడి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇందిరాగాంధీ హత్య తరువాత 1984 సిక్కుల ఊచకోత నాటి పరిస్థితులు రానివ్వబోమని కోర్టు అన్నది. ఇంతకీ.. 1984లో ఏం జరిగింది.. ఇందిరాగాంధీ హత్య తరువాత దిల్లీలో సిక్కులను ఎవరు ఊచకోత కోశారు.. వేలాది మందిని ఎవరు పొట్టన పెట్టుకున్నారో చూద్దాం..
1984, అక్టోబరు 31న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగింది. ఆ మరుసటి రోజు నవంబరు 1న సిక్కుల ఊచకోత మొదలైంది.
ఇందిర హత్య జరిగిన రోజే సిక్కులను లక్ష్యంగా చేసుకొని చాలా చోట్ల దాడులు జరిగినప్పటికీ, మొదటి హత్య మాత్రం మరుసటి రోజు, నవంబర్ 1న తెల్లవారుజామున జరిగింది.
నవంబర్ 1 ఉదయం, తూర్పు దిల్లీలో తొలుత ప్రారంభమైన హింసాకాండ హత్యకు దారితీసింది. గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇందిర హత్య జరిగిన తర్వాత చాలా సేపటికి సిక్కుల ఊచకోత మొదలైంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ మారణహోమంలో 2,733 మంది చనిపోయారు.
ఈ హింసాకాండ ఇందిర హత్య జరిగిన వెంటనే మొదలు కాలేదు కాబట్టి ఇది పథకం ప్రకారం సాగించిన హత్యాకాండ కాదని ప్రభుత్వం చేసే వాదన సత్యదూరమైంది.
1984 మారణకాండపై విచారణకు అనేక కమిటీలు, కమిషన్లు వేశారు. రెండు నెలల కిందట కూడా దీనిపై కొత్తగా మరో కమిటీ కూడా ఏర్పాటైంది.
1984 మారణహోమంపై సుప్రీం కోర్టు నేరుగా జోక్యం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.
ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) రెండేళ్లుగా విచారణ చేసినప్పటికీ 1984 మారణహోమానికి సంబంధించిన 200 కేసులను ఎందుకు మూసివేసిందో విచారించేందుకు ఈ ఏడాది ఆగస్టు 16న ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటైంది. మూడు నెలల్లో ఇది తన నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది.
సిట్ ఇప్పటి వరకు 293 కేసులను పరిశీలించి అందులో కేవలం 59 కేసులను తిరిగి ప్రారంభించింది. అందులో కూడా మళ్లీ 39 కేసులను మూసివేసింది. కేవలం 4 కేసులలో లిఖితపూర్వక ఆధారాలు సేకరించింది.
1984లో దిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో చెలరేగిన హింస సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్ అక్కడే ఉన్నట్లు సాక్ష్యాలున్నాయి. ఆయన్ను చూసిన ప్రత్యక్ష సాక్షులూ ఉన్నారు. అందుకే ఈ విషయంలో తమకు కొంతైనా న్యాయం జరుగుతుందని, ఈ కాంగ్రెస్ మాజీ ఎంపీకి శిక్ష పడుతుందని బాధితులు బలంగా నమ్మారు. ఈ విచారణలో బాధితుల తరఫున పోరాడేందుకు సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్కా పంజాబ్ అంసెబ్లీ ప్రతిపక్ష హోదాను కూడా వదులుకున్నారు. 2018 చివర్లో సజ్జన్ కుమార్‌కు శిక్ష పడింది.
శిక్షలు పడకపోయినా 1984 ఊచకోత కేసులో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎందరో విచారణ ఎదుర్కొన్నారు. కేంద్రంలో మంత్రులుగా పనిచేసినవారు, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు కూడా (1984 తరువాత) ఆ సమయంలో మూకలను రెచ్చగొడుతూ దిల్లీ వీధుల్లో తిరుగుతూ వేలాది మంది సిక్కుల మరణానికి కారణమయ్యారని అప్పటి ఘటనను గుర్తుచేసుుంటూ అప్పటివారు చెబుతారు.
దిల్లీ అల్లర్లు.. ఎందుకు? ఎవరి పని?
ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం నాలుగురోజులుగా చెలరేగుతున్న వికృత విధ్వంసకాండ ఫలితం, భయానక బీభత్సకాండ ఫలితం! ‘‘శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించాలన్న మానవీయ శాసనాన్ని’’ వ్యతిరేకిస్తున్నవారు వారాల తరబడి జరుపుతున్న అల్లర్లకు పరాకాష్ఠ ఈ విధ్వంసకాండ... ఈ మారణకాండ... ఈ బీభత్సకాండ, ఈ పైశాచిక కాండ! ఇరవై మూడవ తేదీన రాజుకున్న ఈ విద్రోహకాండ ఇరవై నాలుగవ తేదీనుంచి భయానక దావానలంగామారి ఢిల్లీ ప్రజలను ముంచెత్తింది. ఈ రాక్షస కాండకు ఇరవై మందికి పైగా బలయిపోయారు. రతన్‌లాల్ అనే ‘ప్రధాన రక్షక భటుడి’- హెడ్ కానిస్టేబుల్-ని దుండగులు తలపై కొట్టి చంపడం ఉద్యమం పేరుతో జరుగుతున్న పైశాచిక క్రీడకు ఒక నిదర్శనం మాత్రమే! అమిత్‌శర్మ అన్న ఉన్నత పోలీసు అధికారిని సైతం దుండగులు తీవ్రంగా గాయపరచడం ‘‘పథకం ప్రకారం జరుగుతున్న భయానక బీభత్సకాండ’’కు నిదర్శనం. ఈ పథకం భారత రాజ్యాంగ వ్యవస్థను వ్యతిరేకిస్తున్న చైనా తొత్తులైన ప్రచ్ఛన్న బీభత్సకారులది, పాకిస్తాన్ కొమ్ముకాస్తున్న జిహాదీ పైశాచిక మూకలది! విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో సంవత్సరాల తరబడి పాతుకొనిపోయి ఉన్న ఈ చైనా తొత్తులు, పాకిస్తాన్ అనుకూల ముఠాలు ప్రచ్ఛన్న బీభత్సకారులు. ‘పౌరసత్వ సవరణ చట్టం’- సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్- రూపొందిన వెంటనే ఈ ప్రచ్ఛన్న బీభత్సకారులు రంగప్రవేశం చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించడం నెపం... దేశాన్ని కల్లోలగ్రస్తం చేయడం లక్ష్యం! అందువల్ల ‘‘వ్యతిరేక ఉద్యమం’’ పేరుతో దేశ వ్యతిరేక కుట్రను సాగిస్తున్నవారు ఈ ఢిల్లీ హత్యాకాండకు పథకాన్ని రూపొందించారు! పథకం ప్రకారం జరిగిన ఈ అల్లర్లలో ప్రత్యక్ష బీభత్సకారులు కూడ చేరిపోయారన్నది స్పష్టం. రెండువందల మందికి పైగా గాయపడడం, వేల మంది ఇళ్లువదలి పారిపోవలసి రావడం ఈ విద్రోహ పథకానికి నిదర్శనాలు! కేవలం ఆవేశపూర్వకంగా లేదా తత్కాల ఉద్రేకంతో అల్లర్లకు పూనుకున్నవారు ఇంతటి రాక్షసకాండను జరుపలేరు. అంకిత్‌శర్మ అన్న నిఘా విభాగపు ఉద్యోగి మృతదేహం బుధవారం ఒక కాలువలో లభించిందట! అంటే పోలీసులను, నిఘా విభాగం ఉద్యోగులను హత్యచేయాలన్న పథకాన్ని విద్రోహులు ముందే రూపొందించుకున్నారన్నమాట! అందువల్ల ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో నాలుగురోజులుగా జరిగిన దౌర్జన్యకాండ ఇరువర్గాల మధ్య జరిగిన తాత్కాలిక సంఘర్షణ కాజాలదు! ప్రశాంతిని భంగంచేసి రక్తపాతం కల్పించాలన్న లక్ష్యంతో పొంచి ఉన్న చైనీయ, పాకిస్తానీ సమర్థక దేశ విద్రోహులకు ఇప్పుడు అవకాశం లభించింది... జమ్మూకశ్మీర్‌లో సైనికులపై, పోలీసులపై విద్రోహులు రాళ్లురువ్వడం దశాబ్దుల చరిత్ర... ఇటీవల- మూడువందల డెబ్బయ్యవ రాజ్యాంగ అధికరణం రద్దయిన తరువాత- జమ్మూకశ్మీర్‌లో రాళ్లురువ్వే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అందువల్ల ఆ విద్రోహులలో కొందరు బహుశా దేశ రాజధానిలోకి చొఱబడి తిష్ఠవేసి ఉండవచ్చు!
దాదాపు ఆరు సంవత్సరాలుగా మన అంతర్గత భద్రత పెంపొందుతోంది. చైనా సరిహద్దులలో చైనా దళాలు జరుపుతున్న చొఱబాట్ల తీవ్రత తగ్గింది. జమ్మూకశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు ‘కల్లోల గతం’నుంచి విముక్తమై కుదుటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పనితీరుతో అవినీతి కలాపాలు ఏర్పడడం లేదు. అంతర్జాతీయంగా మన ప్రతిష్ఠ పెరుగుతోంది. ప్రధానంగా మిత్ర దేశాలతో సంబంధాలు మరింత మెరుగయ్యాయి. అందువల్ల మన దేశం అంటే గిట్టని దేశాలవారు, దశాబ్దుల తరబడి తమ విధానాలలో భారత వ్యతిరేకత నిహితమై ఉన్న దేశాలవారు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడంకోసం వేచి ఉన్నారు! ఏదో ఒక ‘సాకు’కావాలి! ఆ ‘సాకు’ ప్రాతిపదికగా మన దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి పొంచి ఉన్నారు, అంతర్జాతీయ వేదికలపైన, వీలైతే ఐక్యరాజ్యసమితిలోను మన దేశానికి వ్యతిరేకంగా తీర్మానాలను చేయడానికి ఈ దేశాలవారు యత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యతిరేకులకు రెండు సాకులు దొరికాయి. మొదటిది రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికారణం రద్దు... రెండవది పౌరసత్వ సవరణ చట్టం! ఈ రెండు అంతర్గత వ్యవహారాలను అంతర్జాతీయం చేయడం ద్వారా మన దేశానికి ‘‘మనశ్శాంతి లేకుండా చేయాలన్న’’ది ఈ వ్యతిరేక దేశాల పన్నాగం...
ఈ పన్నాగంలో భాగంగానే మలేసియా, టర్కీ వంటి దేశాలు బాహాటంగా మన దేశంపై విషం కక్కుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమ్మూకశ్మీర్ గురించి చర్చించడానికై చైనా గత డిసెంబర్‌లో తీర్మానాన్ని ప్రతిపాదించింది. తీర్మానం చర్చకు రాలేదు. అది వేఱుకథ... కానీ మన అంతర్గత వ్యవహారాలలో జోక్యంచేసుకోవాలన్న చైనా పథకం ధ్రువపడింది. ‘పౌరసత్వ సవరణ చట్టం’పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నవారికి మద్దతుగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుదరెస్ వ్యాఖ్యలు చేయడం అక్రమ ప్రమేయానికి మరో సాక్ష్యం! ‘ఐరోపా సమాఖ్య’ పార్లమెంటులో భారత వ్యతిరేక తీర్మానం ప్రస్తావనకు రావడం మరో ‘అక్రమ ప్రమేయం’. జమ్మూకశ్మీర్‌ను చర్చించడానికై ‘ఇస్లాం మత రాజ్యవ్యవస్థలున్న దేశాల కూటమి’ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయడానికి పాకిస్తాన్ ఇప్పటికీ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చి వెళ్లాడు. ఆయన పర్యటన ప్రారంభం కావడానికి రెండు రోజులముందు అమెరికా ప్రభుత్వ ‘‘అంతర్జాతీయ మత స్వేచ్ఛా వ్యవహారాల’’ ఉప సంఘంవారు ఒక నివేదికను వెల్లడించారు. ఈ నివేదికలో మన ‘పౌరసత్వ సవరణ చట్టం’ గురించి వ్యతిరేక నిర్థారణలు చేశారు! ఇలా విదేశాలలో మన దేశం పట్ల దుష్ప్రచారం జరుగుతోంది. ఈ దుష్ప్రచారానికి దేశంలో ‘పౌరసత్వ సవరణ చట్టాని’కి వ్యతిరేకంగా జరుగుతున్న అర్థరహితమైన అతార్కికమైన, అన్యాయమైన ప్రచారం మరింత దోహదం చేస్తోంది! పాకిస్తాన్ ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ! ఇస్లాం మతోన్మాదులైన జిహాదీలు ఒకవైపు, పాకిస్తాన్ ప్రభుత్వం మరోవైపు ‘ఇస్లాం మతేతరుల’ను వివిధ బీభత్సకలాపాలకు బలిచేస్తుండడం క్రీస్తుశకం 1947నుంచి నడుస్తున్న చరిత్ర! లక్షల మంది ఇస్లామేతరులు ఈ దశాబ్దులలో హత్యకు గురిఅయ్యారు. మరికొన్ని లక్షల మంది ఇస్లాం మతేతరులు తరిమివేతకు గురిఅయినారు. అలా తరిమివేతకు గురిఅయినవారు శరణార్థులై వచ్చి మన దేశంలో తలదాచుకుంటున్నారు. అఫ్ఘానిస్థాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడ ఇలా ఇస్లాం మతేతరులు పారిపోయి ప్రాణావశిష్టులై మన దేశంలో శరణార్థులయ్యారు! ఇలాంటి వారికి మన దేశ పౌరసత్వం కల్పించడం మానవీయ కలాపం మాత్రమేకాదు, మన ప్రభుత్వ నైతిక బాధ్యత కూడ! ఎందుకంటె అఖండ భారత్ వివిధ సమయాలలో ముక్కలుచెక్కలు కాకుండా ఉండినట్టయిటే ఈ శరణార్థులు సహజంగానే మన దేశపు పౌరులు...
వాస్తవం, కఠోర సత్యం ఇంత స్పష్టంగా ప్రస్ఫుటిస్తున్నప్పటికీ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు?? ఈ వ్యతిరేకులు పరోక్షంగా పాకిస్తాన్‌ను సమర్థిస్తున్నారు!! తరిమివేస్తున్న పాకిస్తాన్ జిహాదీలను, ప్రభుత్వాన్ని ఈ ‘‘వ్యతిరేకులు’’ ఎందుకని తప్పుపట్టడం లేదు? పాకిస్తాన్‌లోను ‘బంగ్లా’లోను ఈ శరణార్థులను బతకనీయలేదు! మన దేశంలో కూడ వారికి శాశ్వత ఆశ్రయం దొరకకపోతే, ‘అఖండ భారత’ పౌరులైన ఈ శరణార్థులు ఎక్కడికి పోవాలి...??
దాదాపు ఆరు సంవత్సరాలుగా మన అంతర్గత భద్రత పెంపొందుతోంది. చైనా సరిహద్దులలో చైనా దళాలు జరుపుతున్న చొఱబాట్ల తీవ్రత తగ్గింది. జమ్మూకశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు ‘కల్లోల గతం’నుంచి విముక్తమై కుదుటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పనితీరుతో అవినీతి కలాపాలు ఏర్పడడం లేదు. అంతర్జాతీయంగా మన ప్రతిష్ఠ పెరుగుతోంది. ప్రధానంగా మిత్ర దేశాలతో సంబంధాలు మరింత మెరుగయ్యాయి. అందువల్ల మన దేశం అంటే గిట్టని దేశాలవారు, దశాబ్దుల తరబడి తమ విధానాలలో భారత వ్యతిరేకత నిహితమై ఉన్న దేశాలవారు మన దేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడంకోసం వేచి ఉన్నారు! ఏదో ఒక ‘సాకు’కావాలి! ఆ ‘సాకు’ ప్రాతిపదికగా మన దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి పొంచి ఉన్నారు, అంతర్జాతీయ వేదికలపైన, వీలైతే ఐక్యరాజ్యసమితిలోను మన దేశానికి వ్యతిరేకంగా తీర్మానాలను చేయడానికి ఈ దేశాలవారు యత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యతిరేకులకు రెండు సాకులు దొరికాయి. మొదటిది రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికారణం రద్దు... రెండవది పౌరసత్వ సవరణ చట్టం! ఈ రెండు అంతర్గత వ్యవహారాలను అంతర్జాతీయం చేయడం ద్వారా మన దేశానికి ‘‘మనశ్శాంతి లేకుండా చేయాలన్న’’ది ఈ వ్యతిరేక దేశాల పన్నాగం...
ఈ పన్నాగంలో భాగంగానే మలేసియా, టర్కీ వంటి దేశాలు బాహాటంగా మన దేశంపై విషం కక్కుతున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమ్మూకశ్మీర్ గురించి చర్చించడానికై చైనా గత డిసెంబర్‌లో తీర్మానాన్ని ప్రతిపాదించింది. తీర్మానం చర్చకు రాలేదు. అది వేఱుకథ... కానీ మన అంతర్గత వ్యవహారాలలో జోక్యంచేసుకోవాలన్న చైనా పథకం ధ్రువపడింది. ‘పౌరసత్వ సవరణ చట్టం’పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నవారికి మద్దతుగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుదరెస్ వ్యాఖ్యలు చేయడం అక్రమ ప్రమేయానికి మరో సాక్ష్యం! ‘ఐరోపా సమాఖ్య’ పార్లమెంటులో భారత వ్యతిరేక తీర్మానం ప్రస్తావనకు రావడం మరో ‘అక్రమ ప్రమేయం’. జమ్మూకశ్మీర్‌ను చర్చించడానికై ‘ఇస్లాం మత రాజ్యవ్యవస్థలున్న దేశాల కూటమి’ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయడానికి పాకిస్తాన్ ఇప్పటికీ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చి వెళ్లాడు. ఆయన పర్యటన ప్రారంభం కావడానికి రెండు రోజులముందు అమెరికా ప్రభుత్వ ‘‘అంతర్జాతీయ మత స్వేచ్ఛా వ్యవహారాల’’ ఉప సంఘంవారు ఒక నివేదికను వెల్లడించారు. ఈ నివేదికలో మన ‘పౌరసత్వ సవరణ చట్టం’ గురించి వ్యతిరేక నిర్థారణలు చేశారు! ఇలా విదేశాలలో మన దేశం పట్ల దుష్ప్రచారం జరుగుతోంది. ఈ దుష్ప్రచారానికి దేశంలో ‘పౌరసత్వ సవరణ చట్టాని’కి వ్యతిరేకంగా జరుగుతున్న అర్థరహితమైన అతార్కికమైన, అన్యాయమైన ప్రచారం మరింత దోహదం చేస్తోంది! పాకిస్తాన్ ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ! ఇస్లాం మతోన్మాదులైన జిహాదీలు ఒకవైపు, పాకిస్తాన్ ప్రభుత్వం మరోవైపు ‘ఇస్లాం మతేతరుల’ను వివిధ బీభత్సకలాపాలకు బలిచేస్తుండడం క్రీస్తుశకం 1947నుంచి నడుస్తున్న చరిత్ర! లక్షల మంది ఇస్లామేతరులు ఈ దశాబ్దులలో హత్యకు గురిఅయ్యారు. మరికొన్ని లక్షల మంది ఇస్లాం మతేతరులు తరిమివేతకు గురిఅయినారు. అలా తరిమివేతకు గురిఅయినవారు శరణార్థులై వచ్చి మన దేశంలో తలదాచుకుంటున్నారు. అఫ్ఘానిస్థాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి కూడ ఇలా ఇస్లాం మతేతరులు పారిపోయి ప్రాణావశిష్టులై మన దేశంలో శరణార్థులయ్యారు! ఇలాంటి వారికి మన దేశ పౌరసత్వం కల్పించడం మానవీయ కలాపం మాత్రమేకాదు, మన ప్రభుత్వ నైతిక బాధ్యత కూడ! ఎందుకంటె అఖండ భారత్ వివిధ సమయాలలో ముక్కలుచెక్కలు కాకుండా ఉండినట్టయిటే ఈ శరణార్థులు సహజంగానే మన దేశపు పౌరులు...
వాస్తవం, కఠోర సత్యం ఇంత స్పష్టంగా ప్రస్ఫుటిస్తున్నప్పటికీ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు?? ఈ వ్యతిరేకులు పరోక్షంగా పాకిస్తాన్‌ను సమర్థిస్తున్నారు!! తరిమివేస్తున్న పాకిస్తాన్ జిహాదీలను, ప్రభుత్వాన్ని ఈ ‘‘వ్యతిరేకులు’’ ఎందుకని తప్పుపట్టడం లేదు? పాకిస్తాన్‌లోను ‘బంగ్లా’లోను ఈ శరణార్థులను బతకనీయలేదు! మన దేశంలో కూడ వారికి శాశ్వత ఆశ్రయం దొరకకపోతే, ‘అఖండ భారత’ పౌరులైన ఈ శరణార్థులు ఎక్కడికి పోవాలి...??
(ఆంధ్రభూమి సౌజన్యంతో)
30, నవంబర్ 2019, శనివారం
Priyanak Reddy Rape, Murder: ప్రియాంకా రెడ్డి చివరి ఫోన్ కాల్ ఇదే.. మొత్తం వినండి
హైదరాబాద్ శివార్లలో అత్యాచారం, హత్యకు గురయిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి చనిపోవడానికి ముందు తన చెల్లెలుతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సంభాషణ విన్న ప్రతి ఒక్కరి మనసు చలిస్తోంది. ఈ సంభాషణలు మొత్తం ఇవీ..
ప్రియాంకారెడ్డి: పోయావా పాపా ఆఫీస్‌కి.చెల్లెలు: హా.
ప్రియాంకారెడ్డి: నాదిప్పుడు అయిపోయింది. వచ్చినా ఇప్పుడు.
చెల్లెలు: హా.
ప్రియాంకారెడ్డి: మాట్లాడు.. కొంచెం సేపు మాట్లాడు.
చెల్లెలు: ఏమైందే.
ప్రియాంకారెడ్డి :మాట్లాడు పాపా నీకు తర్వాత చెప్తా.
చెల్లెలు: యాక్సిడెంట్ అయిందా? చెప్పు.
ప్రియాంకారెడ్డి :నాకు చాలా టెన్షన్ గా ఉందే.
చెల్లెలు: యాక్సిడెంట్ అయిందా?
ప్రియాంకారెడ్డి : అక్కడ ఎప్పుడూ బైక్ పెట్టి పోతానని చెప్పినా కదా. ఆ రోజు అక్కడ పెట్టిన, నిలబడ్డ. టోల్ కలెక్ట్ చేసేటాయన పిలిచి ఇక్కడ బైక్ పెట్టకండి మేడమ్, ఇంతకు ముందే పోలీసువాళ్లు తీసుకొనిపోయిన్రు అంటే.. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఇంకొక దారి ఉంటుంది కదా, అక్కడ పెట్టాను. ఇప్పుడు దిగి వచ్చాను పాపా ఇక్కడికి. స్కూటీ పంక్చర్ అయింది.
చెల్లెలు : మరి వదిలేసి రా. ఇంకేంటి?
ప్రియాంకారెడ్డి : వదిలేస్తే ఎట్ల, మల్ల పొద్దున ఎవరు తీసుకొస్తరే?
చెల్లెలు : ఇంక రేపొద్దున్న ఎవరినైనా తీసుకెళ్లి చేయించి తీసుకురావాలి.
ప్రియాంకారెడ్డి : ఎవర్ని తీసుకెళ్లాలి?
చెల్లెలు: మెకానిక్‌ని.
ప్రియాంకారెడ్డి : మెకానిక్ నా?
చెల్లెలు : అవును మెకానిక్‌ని. కొంచెం దూరం కూడా పోదానె పంక్చర్ అయితే? చూడాలి వస్తందేమో.
ప్రియాంకారెడ్డి : వెనకాల టైర్.
చెల్లెలు : నాకు తెలీదు కదా.
ప్రియాంకారెడ్డి : అయితే.. చెప్తా విను. ఇక్కడొక లారీ ఉందే. అందులో జనాలు ఉన్నారు. అందులో ఒకాయన నేను చేయించుకొస్తా అని తీసుకొని పోయిండు స్కూటీ.
చెల్లెలు : తీసుకురాలేదా మళ్లీ స్కూటీ?
ప్రియాంకారెడ్డి : తీసుకొచ్చిండు. క్లోజ్ ఉంది షాప్ అని తీసుకొచ్చింది. మళ్లీ ఇంకో షాప్‌కు పోయి చేయించుకొస్తా అని తీసుకెళ్లిండు. భయం అయితాంది పాపా నాకు.
చెల్లెలు : ఎవరూ లేరా అక్కడ?
ప్రియాంకారెడ్డి : వెహికల్స్ ఉన్నాయి. టోల్ ఉంటాది చూడూ.. ఆడ. నేను వెళ్తా అంటే వద్దు నేనే వెళ్తా అని దెయ్యంలా వెంట పడిండు. వద్దు మధ్యలో ఆగిపోతోంది అన్నాడు. నాకు భయం అయితాంది పాపా.
చెల్లెలు : ఎందుకు? ఏమైతుంది? ఉండు అక్కడ, టోల్ గేట్ దగ్గర.
ప్రియాంకారెడ్డి :వాళ్లు బయటనే నిలబడిండ్రు.
చెల్లెలు : ఎవరు?
ప్రియాంకారెడ్డి : లారీస్ వాళ్లు.
చెల్లెలు : నువ్వు, టోల్ గేట్ ఉంటుంది కదా.. అక్కడికి వెళ్లి నిలబడు.
ప్రియాంకారెడ్డి : అక్కడకా? నువ్వు మాట్లాడు పాపా.. భయం అయితాంది.
చెల్లెలు: టోల్ ప్లాజా దగ్గర ఇస్తారు కదా టికెట్లు.. అక్కడికెళ్లు, అక్కడికెళ్లి నిలబడు.
ప్రియాంకారెడ్డి : వీళ్లేంటే.. సడెన్‌గా ఎవరూ కనిపస్తలేరు. దెయ్యాల్లా ఈడనే ఉన్నరు అంతసేపు.
కనిపించిన్రులే. నేను పోతున్నా పాపా.. ఎక్కి స్టార్ట్ చేసిన. కిందికొచ్చి.. మేడమ్ మేడమ్ టైర్ పంక్చర్ అయిందని. బస్టాండ్ వరకూ వెళ్లదా.. బస్టాండ్ దగ్గర షాప్ ఉంటదే, అక్కడ చేయించుకుంటా అంటే, లేదు మేడమ్ వద్దు మేడమ్ నేను చేయించుకొస్తా అని ఎవడో ఒక పిలగాడ్ని పంపించిండు. ఆ దెయ్యం పిలగాడు పోయిండు. ఉత్తగ వచ్చిండు. సర్లేండి మళ్లీ ఎక్కడో ఇంకొక షాప్ ఉందని చెప్పిండు. ఇంక లేట్ అవుతోంది నేను వెళ్తా అంటే.. లేదు మేడమ్, మధ్యలో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది. కష్టం అవుతుందని దయ్యాల్లాగా నా వెంట పడిండ్రే.
చెల్లెలు : నిజంగానే సడెన్‌గా మధ్యలో ఆగిపోతే అప్పుడేం చేస్తావ్?
ప్రియాంకారెడ్డి : నాకు ఇక్కడ చాలా భయం అయితాంది.
చెల్లెలు : టోల్ గేట్ దగ్గరకు వెళ్లి నిలబడు.
ప్రియాంకారెడ్డి : ఆ టోల్ బూత్ దగ్గర ఏం నిలబడాలే. అందరూ నన్నే చూస్తారు. ఆడ నిలబడితే.
చెల్లెలు : చూస్తే చూడనీ.. కాస్త జనాలైనా ఉంటారు కదా ఆడ.
ప్రియాంకారెడ్డి: చాలా భయం అవుతోంది వాల్లను చూస్తుంటే. ఏడుపొస్తోందే..
భయం అయితాంది పాపా. ఇంకా తీస్కరాలేదే.. దెయ్యం ముసుగోడు.
చెల్లెలు : తీసుకొస్తడు లే.
ప్రియాంకారెడ్డి: నాకు వాళ్లను చూస్తుంటే చాలా భయంగా ఉందే.. ఈ దయ్యం పిల్లగాడు ఇంకా రాలేదు.
చెల్లెలు : సరే కొంచెంసేపైన తర్వాత మళ్లీ చేస్తా.
ప్రియాంకారెడ్డి: (ఏడుస్తూ..) ప్లీజ్ పాపా..
చెల్లెలు: సరే కొంచెంసేపైన తర్వాత చేస్తా.
షాద్ నగర్ అత్యాచారం-హత్య: PriyankaReddy ని అత్యాచారం చేసి ఎవరు చంపారు? ఎందుకు చంపారు?
ప్రియాంకారెడ్డి(Priyanka Reddy) ఒక వెటర్నరీ డాక్టర్. బుధవార రాత్రి ఆమెను హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ వద్ద నలుగురు యువకులు మహమ్మద్ పాషా, చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌లు దారుణంగా సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. అనంతరం శవాన్ని గురువారం వేకువజామున ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో చింతపల్లి గ్రామం సమీపంలో పెట్రోలు పోసి కాల్చేశారు.
నిందితులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
అత్యాచారం, హత్యకు గురయిన ప్రియాంక రెడ్డి పశు వైద్యురాలు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లి ఆమె సొంతూరు. ఈ కుటుంబం శంషాబాద్‌లో నివాసం ఉంటోంది. ప్రియాంక రెడ్డి బుధవారం సాయంత్రం గచ్చిబౌలి వెళ్ళారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయల్దేరి శంషాబాద్ దగ్గర తొండుపల్లి టోల్ ప్లాజాకి కాస్త దూరంలో బండి పెట్టి అక్కడి నుంచి క్యాబ్‌లో వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో తిరిగి ప్లాజా దగ్గరకు వచ్చారు.
అప్పుడు ఆమె బండి పంక్చర్ అయిందని అక్కడున్న లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేసే నలుగురు నిందితులు ఆమెతో చెప్పారు. పంక్చర్ వేయించుకుని వస్తామని బండి తీసుకెళ్లి ఆమెను అక్కడ వెయిట్ చేసేలా చేశారు. అంతలోనే ఆమెను పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు.
నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడానికి ముందే ఆమె వారి తీరును అనుమానించి భయంతో తన సోదరికి ఫోన్ చేసి చెప్పింది. చెల్లెలు ఆమెను టోల్ ప్లాజా వద్దకు వచ్చి వెయిట్ చేయమని చెప్పింది. అయితే, తిరిగి రాత్రి 9.44 ప్రాంతంలో సోదరి మళ్లీ కాల్ చేయగా, ఫోన్ స్విచాఫ్ అయి ఉంది. అప్పుడు కుటుంబ సభ్యులు టోల్ ప్లాజాకు వెళ్లారు. రాత్రంతా వెతికి అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కేసు నమోదయింది. గురువారం తెల్లవారుజామున షాద్ నగర్ దగ్గర్లో స్థానికులు కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం అక్కడకు చేరిన బంధువులు, గొలుసు, చున్నీ ఆధారంగా ఆ మృతదేహం డాక్టర్‌దేనని గుర్తించారు. పోలీసులు అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
బాధితురాలు తన సోదరికి చెప్పిన కథనం ప్రకారం, ఒక లారీ డ్రైవర్ ఆమె దగ్గరకు వచ్చి మీ బండి పంక్చర్ అయిందనీ, తాను బాగు చేయిస్తాననీ అన్నాడు. అవసరంలేదు తానే పంక్చర్ షాపుకు వెళ్తానన్నప్పటికీ తాను సాయం చేస్తానంటూ తీసుకెళ్లాడు. దీంతో అతనికి దూరంగా టోల్ ప్లాజా దగ్గర నిలబడమని బాధితురాలికి సోదరి సూచించగా, ఆమె నిరాకరించారు. అందరూ చూస్తారని భయపడింది. కాసేపటికి ఫోన్ స్విచాఫ్ అయింది.
ఉదయం ఏడు గంటలకు షాద్ నగర్ పోలీసులకు మృతదేహం గురించి సమాచారం వచ్చింది. పోల్చి చూడగా అది రాత్రి మిస్ అయిన కేసుకు సంబంధించినదే అని తేలింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)