ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే 2070 సంవత్సరాల వెనక్కు వెళ్లాలి. క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్.. జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు.
సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించారు. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల కంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మనం కొన్నిసార్లు లీప్ డే ఒకదానిని యాడ్ చేస్తాం. భూమి రోజులో ఒకసారి తన చుట్టూ తాను కూడా తిరుగుతుంటుంది. కాబట్టే రోజూ ఒకసారి సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతుంటాయి.
అయితే, క్యాలండర్‌లో ఏ రోజుతో సంవత్సరం ప్రారంభించాలి అనే విషయంలో సీజర్ ఆలోచించారు.
రోమన్లకు జనవరి నెల ఇంపార్టెంట్. వారి దేవత జనస్ పేరిట ఏర్పడిన నెల అది.
యూరప్‌లో శీతాకాలం తర్వాత పగటిపూట సమయం ఎక్కువగా ఉండేది కూడా ఈ నెలలోనే.
అందుకే ఆయన జనవరితో క్యాలండర్ ప్రారంభించాలని నిర్ణయించారు.
రోమన్లు తమ అధికారాన్ని విస్తరించిన కొద్దీ వాళ్ల రాజ్యంతో పాటు క్యాలెండర్ కూడా ఆయా ప్రాంతాలకు చేరింది.
అయితే, పాశ్చాత్యంలో 5వ శతాబ్ధంలో రోమన్ల సామ్రాజ్యం పతనమై ఆ స్థానంలో క్రైస్తవం అధికారం చెలాయించింది.
అప్పట్లో జనవరి 1వ తేదీ అన్యమత సంప్రదాయంగా చూసేవాళ్లు.
క్రిస్టియన్ దేశాలు మార్చి 25తో మొదలుపెట్టాలని కోరుకున్నాయి..
చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ కావాలని కోరుకున్నాయి. దేవదూత గాబ్రియెల్.. మేరీకి కనిపించిన తేదీగా మార్చి 25కి ప్రాశస్త్యం ఉంది.
క్రీస్తు జన్మించిన రోజు క్రిస్మస్. అయితే, దేవుని నూతన అవతారానికి జన్మనివ్వబోతున్నావంటూ మేరీకి క్రీస్తు జననం గురించి చెప్పింది మాత్రం మార్చిలో. అప్పటి నుంచే క్రీస్తు కథ ప్రారంభమవుతుంది. మరెన్నో కారణాలతో పాటు మార్చి 25వ తేదీ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం కావాలనటానికి ఇది కూడా ఒక కారణం.
పోప్ 13వ గ్రెగరీ 16వ శతాబ్ధంలో గ్రెగరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు.
క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి 1వ తేదీగా పునరుద్ధరించారు.
అయితే క్యాథలిక్ చర్చిలతో సంబంధం లేని ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లండ్ మాత్రం 1752వ సంవత్సరం వరకూ కొత్త సంవత్సర దినోత్సవాన్ని మార్చి 25నే జరుపుకొంటూ వచ్చింది.
అయితే, 1752లో దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకువచ్చి, యూరప్‌తో పాటుగా ఇంగ్లండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకునేట్లు చేసింది.
ఇక వర్తమానంలోకి వస్తే.. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగరియన్ క్యాలెండర్‌నే ఉపయోగిస్తున్నాయి.
అందుకే మనం ప్రతి ఏటా జనవరి 1వ తేదీన కొత్త సంవత్సర వేడుకలను జరుపుకొంటున్నాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి