6, డిసెంబర్ 2025, శనివారం

 Quinton De Kock: ఇండియా మీద హాఫ్ సెంచరీ చేశాడంటే అది సెంచరీ అయిపోతుంది

QUINTON DE KOCK


ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డీకాక్ సెంచరీ చేశాడు.

ఇండియాపై వన్డేల్లో డీకాక్‌కు ఇది ఏడో శతకం.

దీంతో ఆయన ఇండియాపై అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాటర్‌గా సనత్ జయసూర్య రికార్డ్ ఈక్వల్ చేశాడు. శ్రీలంక బ్యాటర్ జయసూర్య కూడా ఇండియాపై ఏడు సెంచరీలు చేశాడు.

అంతేకాదు.. డీకాక్ తన ఈ శతకంతో ఇండియాలో ఎక్కువ సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా ఏబీ డివిలియర్స్ రికార్డ్ ఈక్వల్ చేశాడు. డివిలియర్స్ కూడా ఇండియాలో 7 సెంచరీలు చేయగా... డీకాక్ కూడా ఇండియాలో 7 సెంచరీలు చేశాడు.

డీకాక్ ఈ సెంచరీతో మరో రికార్డు కూడా ఈక్వల్ చేశాడు. ప్రపంచంలోని వికెట్ కీపర్లలో ఎక్కువ వన్డే సెంచరీలు చేసింది శ్రీలంకకు చెందిన సంగక్కర. ఆయన మొత్తం 23 సెంచరీలు చేశాడు. డీకాక్ కూడా ఈ సెంచరీతో మొత్తం 23 సెంచరీలు పూర్తి చేసుకుని సంగక్కర రికార్డు సమం చేశాడు.

ఈ రికార్డులన్నీ ఒకెత్తయితే.. డీకాక్ ఇండియాపై ఇండియాలో ఆడిన మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీ చేసిన ప్రతిసారీ దాన్ని సెంచరీగా మార్చాడు.

ఇలాంటి రికార్డు ఇంకెవరికీ లేదు.

డీకాక్ 2013 నుంచి 2025 ఇప్పటివరకు ఇండియాతో మొత్తం 23 మ్యాచ్‌లు ఆడగా అందులో 7 సెంచరీలు చేశాడు. మొత్తం 1278 బంతులు ఎదుర్కొని 1191 పరుగులు చేశాడు. ఇండియాపై వన్డేల్లో డీకాక్ స్ట్రైక్ రేట్ 93.19.. కాగా యావరేజ్ 51.78. హయ్యెస్ట్ స్కోర్ 135. ఒకసారి మాత్రమే డకవుట్ అయ్యాడు.

ఇండియాపై ఇంతవరకు 141 ఫోర్లు 19 సిక్సర్లు కొట్టాడు.

ఆయన ఏడో సెంచరీ చేసిన తాజా మ్యాచ్‌లోనే 6 సిక్సర్లు కొట్టాడు.. అందులో ఒక సిక్సర్‌ కొట్టి హాఫ్ సెంచరీ.. ఇంకో సిక్సర్ కొట్టి సెంచరీ చేశాడు.

మొత్తానికి డీకాక్ ఇండియాపై మామూలోడు కాదబ్బా.