ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ఎర్లీ యాక్సెస్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబర్ 16 నుంచి 21వ తేదీ వరకు ఉంటాయి. ఈ తేదీల్లో లక్షలాది వస్తువులపై తగ్గింపు ధరలు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.
నిజానికి అక్టోబరు 16 నుంచి ఇది మొదలవుతున్నప్పటికీ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు మాత్రం అక్టోబరు 15 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఆఫర్లకు యాక్సెస్ వస్తుంది. అంటే మిగతా సాధారణ కస్టమర్ల కంటే 12 గంటల ముందుగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లు అందుతాయన్నమాట.
ఏటా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు పేటీఎం, మింత్ర, అజియో లైఫ్, టాటా క్లిక్, స్నాప్ డీల్ వంటి ఈకామర్స్ సంస్థలు ఇలాంటి భారీ ఆఫర్ సీజన్ కోసం వినియోగదారులు ఎదురుచూస్తుంటారు.
ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు ఉంటే మరో 10 శాతం ఇనిస్టెంట్ డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో వస్తువులు కొనేవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డుతో కానీ క్రెడిట్ కార్డుతో కానీ వస్తువులు కొంటే వారికి అప్పటికే ఉన్న తగ్గింపు ధరలపై అదనంగా మరో 10 శాతం తగ్గింపు వస్తుంది.
దీంతో మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, దుస్తులు, షూస్, గృహోపకరణాలు వంటి ఎన్నో వస్తువులు కొనాలనుకుని ఈ బిగ్ బిలియన్ డేస్ కోసం ఎదురుచూస్తున్నవారు కొనుగోళ్లు ప్రారంభించారు.
మా ఇతర కథనాలు: